పవన్ కళ్యాణ్......
తెలుగు ప్రజావాణికి పరిచయం అక్కర్లేని పేరు.అతి కొన్ని సినిమాలతోనే గ్లామర్ ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగించిన పేరు.ఒక తరం యువతకు పూనకాలు తెప్పించిన పేరు.ఇది "ఈ అబ్బాయే కళ్యాణ్" అని పోస్టర్ పడిన తరువాత.కానీ మనకి పరించయం లేని ఒక అమాయకమైన,స్వచ్ఛమైన కళ్యాణ్.జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఏం చెయ్యాలో దిక్కుతోచక ప్రశ్నలకు మూగ సాక్షిగా ఆలోచనల వినీల గగనంలో సమాధానాల వేటకి ఉపక్రమించిన కళ్యాణ్.సమాజంలో జరిగే అసమానతలకు చలించిపోయి తన వంతుగా చెయ్యాల్సినదంత చేసిన కళ్యాణ్.తన చిన్న నాటినుంచి జరిగే చాలా విషయాలకు పుస్తకాల రూపంలో సమాధానాలు వెతుక్కున్న కళ్యాణ్ ని మరొక్కసారి గుర్తు చేసే ప్రయత్నమే ఇది...!!!
కళ్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమేనా??
దీనికి సమాధానం చాలా సింపుల్.సినిమా హీరో అయితే ఆ రంగానిక సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించి అతని పనేదో అతను చేసుకుంటూ ఉండేవాడు! అతనికి నటన నేర్పిన గురువుగారి ఇంట్లో పెళ్లి అంటే అప్పట్లో చాలా పెద్ద మొత్తం అయిన 50,000 ఇవ్వడు.ఎక్కడి నుంచో ముక్కు మొఖం తెలియని ఒకావిడ " జీసస్ హోమ్ " అని చెప్పగానే పిలిచి ఆప్యాయంగా సహాయం చెయ్యడు.ఎక్కడో ఒక పల్లెటూర్లో జనం తాగునీటి సమస్య అనగానే బోర్ వేయించడు.ఆయనకెందుకు?? కేవలం పది సినిమాలతోనే ఎవరికి అందనటువంటి స్టార్డమ్ అనతికాలంలోనే సంపాదించాడు...మరెందుకు??
అతనికి చిన్నతనం నుంచి సమాజం పట్ల బాధ్యత ఎక్కువ,అప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు అలవరుచుకున్నాడు...
ఈ మాటను అతను తన జీవితంలో చాలా కఠినంగా అనుసరించారు.జీవన విధానంలో నాలుగు ఆశ్రమాలు ముఖ్యం అని సనాతన ధర్మం చెబుతుంది.బ్రహ్మచర్యం,గృహస్తం,వానప్రస్థం,సన్యాసం.
వీటన్నిటినీ క్రోడీకరించి వాటిని తన జీవనంలో మమేకం చేస్తూ తన జీవన విధానాన్ని అలవరుచుకున్నాడు.చాతుర్మాస దీక్షలు,పుస్తకాలు,వ్యవసాయం,నదుల పరిరక్షణ,పశు సంపద,వృక్షాలు,మాతృ భాష మొదలైనవి అన్నీ అతని జీవితంలో భాగం అయ్యాయి...
సమస్యని చూసి ఆ సమస్యని అలా వదిలేయకుండా విశ్లేషించి,దాని గురించి ప్రపంచంలో ఇంకెక్కడైనా ఇదే జరుగుతుందా అని శోధించి,సమాధానం తెలుసుకుని,జీర్ణించుకునీ,దాన్ని గుర్తుపెట్టుకునేవాడు.ఇది జనసేన మానిఫెస్టోలో సుస్పష్టంగా తెలుస్తోంది.అతను సమస్యల మీద ఎంత ఆలోచించాడో కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం:
కొన్ని అంశాలను చూస్తే అతనికి ఎంత దూరదృష్టి ఉందని ఆశ్చర్యం కలుగుతుంది.అందులో ప్రధానమైనది రాష్ట్రం అనగానే గుర్తొచ్చే రాజధాని విషయం.అతను ఎక్కడికి వెళ్ళినా పదే పదే గుర్తు చేసేవాడు.మీరు రాజధానులు ఎక్కడ పెట్టుకున్నా అమరావతి రైతులు నష్టపోకూడదు.వచ్చే ప్రభుత్వం అన్యాయం చేస్తే ఎవరిది బాధ్యత అని.మానిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని చాలా సుస్పష్టంగా పొందు పరిచారు.
ఇక రెండవది:
ప్రజలు పట్టించుకోని ఆ ఏముందిలే అని వదిలేసే అతి పెద్ద మాఫియా,రేషన్:
ఒక బియ్యం బస్తా,కేవలం ఒక బియ్యం బస్తా...మొత్తం తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లు 1,48,05,879 కుటుంబాలు.
ఇందులో గ్రామీణ జనాభా ఎక్కువ.అసలు బియ్యం పండించే కుటుంబాలకి బియ్యం ఇస్తే ప్రయోజనం ఏమిటి.వీళ్లు ఇచ్చే నాసిరకం బియ్యంతో పోల్చి చూస్తే మసూరు బియ్యం కూడా బాగానే ఉంటాయి.అవన్నీ పక్కన పెట్టి ఈ బియ్యం ఎవరైనా తింటారా?? తింటున్నారా??
ఈ బియ్యం అంతా ఎటూ పోతుంది??అసలే కరోనా కాలం, క్వారంటిన్ కి హోటల్ వాళ్లు లీజులు తీసుకుంటున్నారు.ఈ బియ్యం అంతా ఎటు వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు.అంటే ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యంలో 70-80% తిరిగి ప్రభుత్వానికే రేటు వేసి అమ్ముతునట్టు!!!
దీనికి అన్ని రకాలుగా ఎవరికీ నష్టం లేకుండా ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చారు మానిఫెస్టోలో:
నెలకి నలుగురు ఉండే కుటుంబానికి రెండు పాతిక కేజీల బియ్యం బస్తా 2200/-,గ్యాస్ ఉచితం,మిగిలేది 1300 నెలవారీ నిత్యావసర సరుకు వచ్చేస్తుంది.ఇది ఎంత మంచి పథకం అంటే.దిగువ మధ్య తరగతి కుటుంబాలకు సగం సంసారం గట్టెక్కిపోతుంది.
మూడవ అంశం విద్య:
కేంద్ర విద్యాశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి సలహాలు ఆచరణలోకి తీసుకున్నాం అని ట్వీట్ చేసిన విషయం విధితమే.ఆయన పేర్కొన్న అంశాలు ముఖ్యమైనవి:
ఇక్కడ మనం బాగా గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది.అది కుల మత జాతి బేధం లేకుండా హాస్టళ్లు.ప్రభుత్వం ఓట్లను విడదీసేది ఇక్కడే.ప్రైవేటు రంగ విద్యాసంస్థలు మంచి రిజల్ట్ రావడానికి ఒక కారణం మౌలిక సదుపాయాలు కాగా,రెండవ కారణం ఇలాంటివాటికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం.దేనికోసం అతను ఎన్నో కలలు కన్నాడు.ఏం జరిగినా మొదట కులాన్ని చూసే మన రాష్ట్రంలో ఇది చాలా చాలా అవసరం.
ఇదే కాకుండా ఈ మధ్యనే ప్రవేశ పెట్టిన #CET విధానం.
ఒక మధ్య తరగతి వ్యక్తికి కేవలం పరీక్షలకు మాత్రమే సంవత్సరానికి సుమారుగా 20000/- అప్లికేషన్ ఫీజులు అవుతాయి.పైగా CET మార్కులు మూడు సంవత్సరాలు చెల్లుతాయి అనేది చాలా ఉపశమనం ఇచ్చే విషయం.
నాలుగవది ఆరోగ్యం:
నిజానికి కేంద్రం ఒక్క విద్యా ప్రణాళికలో పవన్ కళ్యాణ్ గారి సూచనలు అనుసరించింది అని అంటున్నారు.కానీ రైతు భరోసా, లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా పవన్ కళ్యాణ్ కిందటి ఎన్నికల మ్యానిఫెస్టోలోనే పొందు పరిచారు.
ప్రతి వ్యక్తికి 10లక్షల health insurance:
ఇవన్నీ పక్కన పెడితే 80% ముఖ్యమంత్రులు అదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎన్నడూ అభివృద్ధికి నోచుకోకుండా ఇంకా కరువులోనే కొట్టుమిట్టాడుతున్న ప్రాంతానికి రాజధాని వికేంద్రీకరణ పేరుతో హైకోర్టును కేటాయించడం వల్ల జీరాక్స్ షాపులు, టీ షాపులు, ఎలాగో ఎమ్మెల్యేలు వాళ్ల తొత్తుల పైన కేసులు ఉంటాయి కాబట్టి వాళ్లు ఉండడానికి స్టార్ హోటళ్లు మాత్రమే ఏర్పడడం తప్ప వేరే ఎటువంటి అభివృద్ధికి అవకాశాలు ఉండవు.కానీ జనసేన ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సౌభాగ్య రాయలసీమ అనే ప్రత్యేక ఎజెండా మానిఫెస్టోలో పొందుపరిచి అసలైన వికేంద్రీకరణకు నాంది పలికింది...
ఇక పాతికేళ్ళ ప్రస్థానం అని ఏదో సినిమాలు గురించి చెప్తాడు అనుకుంటే అరిగిపోయిన రికార్డు లాగా
రాజకీయాలు గురించి మాట్లాడుతున్నాడు అని అనుకునే వారి కోసం అతని సినిమాల గురించి ప్రస్తావిస్తూ...
పవన్ కళ్యాణ్ ని సినిమాని విడదీయలేము..సినిమా అంటే కళ.మనం చూసిన,విన్న ఏ కళ అయినా పరోక్షంగా నిఘుూఢంగా ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది...అలోజింపజేస్తుంది...ప్రశ్నలను రేకెత్తిస్తుంది...
అది,
"ఏ మేర జహా "అయినా...
"I am an Indian" అయినా...
"Made in Andhra" అయినా...
"లే లే లే లే" అయినా...
"I am a travelling soldier" అయినా...
"గెలుపు తలుపులే" అయినా...
కష్టాలను పేదరికాన్ని అనుభవించి నక్సలైటుగా మారిన సంజు అయినా...
ఎదురుతిరిగిన అర్జున్ పాల్వాయ్ అయినా...
చిల్లరగా ఆడుతూ పడుతూ తిరిగి కుటుంబ గౌరవ విలువలు కాపాడిన సుబ్బు అయినా...
కర్తవ్యమే అన్నీ అని చూపించే ప్రయత్నం చేసిన పులి అయినా...
ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సును చాటి చెప్పాడు. సినిమా కోట్ల మంది చూస్తారు కాబట్టి ఆ చూసిన కోట్ల మందికి తన సందేశాన్ని ఇవ్వాలని చూశాడు. సినిమాలు చేశాడు.ఒక స్థాయి కి వెళ్ళాక ఆ రంగుల ప్రపంచం పట్ల ఆశక్తి పోయి తన ఆనందాన్ని ప్రజా స్రవంతిలో వెతుక్కున్నాడు.
ప్రజలతో ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నాడు...
" కర్మణ్యే వాదికారస్తే " అని స్మరించుకున్నాడు.
ఒక్కడిగా మొదలు పెట్టాడు...
అంతా ఒక్కడే అయ్యాడు..
ఎక్కడెక్కడికో వెళ్ళాడు..
నడిచాడు..
శరీరాన్ని హింసించాడు..
తనే మీడియా అయ్యాడు..
ప్రజల వైపు నిల్చున్నాడు..
చివరి వరకు పోరాడాడు..
అలసిపోయాడు..
ఓడిపోయాడు...
అయినా నిష్క్రమించలేదు..
" స్థితధీర్ ముణిర్ ఉచ్యతే" అనట్టు ఒక చిరు నవ్వుతో ఆ ఓటమిని పక్కన పెట్టేశాడు...
ఆయనకి తెలుసు అభిమానులు అంత తొందరగా మారారు అని..ప్రజలు మొదటి ఎన్నికల్లోనే పట్టం కట్టరని..డబ్బు మద్యం ముందు ఓటమిని చవి చూడాలని..అబాసు పాలు అవ్వాలని.. అప్పటివరకు తోడు ఉన్నవాళ్లు చిన్నబుచ్చుకుంటారని..కుతంత్రాలు చేస్తారని..వ్యక్తిగత జీవితాన్ని లాగుతారని...అభిమానులు అందరూ ఓట్లు వెయ్యరు అని...
అయినా నిష్క్రమించలేదు..
ఇప్పటికీ ప్రజలతోనే ఉన్నాడు,ప్రజల మధ్యనే ఉన్నాడు..అది ఆయన సంతోషం..
ఆయన ధైర్యం అనుచరగణం..ఆయన బలం అభిమానులు..నిజానికి బలం కన్నా బలహీనత అభిమానులు..కానీ మనం,మనకి నచ్చినట్టు ఆయన ఉండాలని కోరుకుంటాం,మనం చెప్పేదే చెయ్యాలని ఆశిస్తాం..ఆయన చేసింది నచ్చకపోతే అప్పటి వరకు దేవుడు అన్న నోటితోనే దేవుడిచ్చిన నోటితో దూషిస్తాం..
ఆయన సినిమాలు చేస్తున్నాడు..చూసి వినోదాన్ని పొందుదాం..
కానీ అతడి అసలైన ఆనందం ఎక్కడ అనేది నిజమైన అభిమానికి సుస్పష్టంగా తెలుస్తుంది ..ఆ ఆనందంలో మన వంతు సహాయం చేద్దాం...అతనిది కాని నటనకే కాకుండా,అతను పరితపించిన ఆశయాలకి అభిమానులం అవుదాం...
కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో
యువతలో సామాజిక బాధ్యత కలగడానికి ప్రేరణగా నిలిచి జనసేవ వంటి బృహత్కర కార్యం ద్వారా తన ఆశయ సాధనకు నాంది పలికాడు...
రెండు కుటుంబాల కబంధ హస్తాల సంకెళ్లలో పడి కుల మత జాడ్యాలతో మగ్గిపోతున్న రాష్ట్రాన్ని అసమానతల గాఢాంధకారం నుంచి దూరం చేస్తూ క్రాంతి రేఖలు దిద్దుతాడని ఆశిస్తూ...
అతడి శ్రేయస్సును ఎప్పటికీ కోరుకునే ఒక అభిమాని కాని శ్రేయోభిలాషి...
నిర్వాణ
Comments