top of page
Writer's picture Tyler Durden

పోలవరం అసలు కథ

పోలవరం బహులార్థసాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి

కోస్తా లో నాలుగు జిల్లాలకి సాగునీరు,తాగునీరు అందించడమే కాక క్రృష్ణా నది కి 80tmc నీటి మళ్లింపు ద్వారా ,రాయలసీమలోని శ్రీశైలం నుంచి మరిన్ని జలాలు ఉపయోగించుకోవచ్చు. తద్వారా అటు కోస్తా,ఇటు సీమ ప్రాంతం సుభిక్షం అవుతుంది.


అసలు పోలవరం ప్రాజెక్టు తొలుత బ్రిటీష్ వారు ప్రతిపాదించినా అది 2004 వరకు అమలు కాలేదు. 2004 లో ప్రతిపాదనలు కేంద్రానికి పంపినప్పటికీ తప్పుల వల్ల 2009 రావాల్సిన అనుమతులు వచ్చాయి. అప్పటికే కుడి ఎడమ కాలువల తవ్వకం మొదలు పెట్టారు.

అడ్డంకులు -


2004 తర్వాత దాదాపు నాలుగేళ్లు రీ డిజైనింగ్ మరియు పర్వావరణ అనుమతుల కోసం వెచ్చించారు. ఆ తరువాత కూడా ప్రాజెక్టు కోసం భూసేకరణ లో జాప్యం, నిర్వాసిత గ్రామాల నిర్మాణం,భూసేకరణ పూర్తిచేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో చాలా కాలం మందకోడిగా సాగింది. జాతీయ హోదా వచ్చాక డామ్ ఎత్తు పెంపు ,దానివల్ల ఒడిశా,చత్తీస్ఘర్ రాష్ట్రాల అభ్యంతరాలు ముంపు ప్రాంతాల కి పరిహారం విషయాల మీద,ఎత్తు పెంపు కారణంగా మళ్లీ పర్యావరణ అనుమతులు ఇలా సమయం వ్రృధా అయ్యిన మాట వాస్తవం. ఇందులో రాష్ట్ర అధికార యంత్రాంగం అలసత్వం కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. కాలువల అలైన్మెంట్, కాలువల భూసేకరణ ఇలా రకరకాల లోపాలతో సాగింది. అన్నీ వచ్చాక ఇప్పుడు డబ్బులు లేవంటుంది ప్రభుత్వం.

అసలు వ్యయం -?


పోలవరం మొదటి అంచనాల ప్రకారం 10,000కోట్ల పైమాట ఇది 2004 నాటి లెక్క. కానీ అనుమతి 2009 లో వచ్చిన కారణంగా వ్యయం పెరిగింది. దీనిని మళ్లీ 2011 లో సవరించిన అంచనాల ప్రకారం 16000 కోట్లుగా నిర్ణయించింది కేంద్రం. ఆ తరువాత సవరించిన అంచనాల ప్రకారం 20000 కోట్లుగా 2013-14 లెక్కల. ప్రకారం నిర్ణయించింది. ఇది జాతీయ హోదా రాకమునుపు మాట. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5000కోట్ల విలువైన పనులు చేసింది. ఆ తర్వాత 2017-18 అంచనాల ప్రకారం దాదాపుగా వ్యయం 55వేల కోట్లకు చేరింది. అందులో ఏ భాగం ఎంత అనేది కూడా చూద్దాం!

2014 విభజన చట్టం - ఆ తర్వాత :


విభజన చట్టం లో పేర్కొన్నట్టు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు అంటే మొత్తం వ్యయం అంతా కేంద్రమే భరించేలా చట్టంలో పొందుపరిచారు. పోలవరం అప్పటికే కొంత పని జరిగింది,కాలువల నిర్మాణం దాదాపుగా 70% పైగా పూర్తైంది. దీని వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించింది. పోలవరం ప్రాజెక్టుకు వ్యయం ,ప్రాజెక్టు అమలు, పరిశీలించడం కోసం ఒక SPV ని "పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ" ని ఏర్పాటు చేసింది. దాని ద్వారానే చెల్లింపులు చేసింది. మొదట బడ్జెట్ లో ప్రతిపాదించి దానిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ తర్వాత నాబార్డ్ ద్వారా నిధులు మంజూరు చేస్తూ వచ్చింది. విభజన చట్టంలో స్పష్టంగా పోలవరం పూర్తి భాథ్యత కేంద్రానిదే! కట్టడం,అనుమతులు అన్నీ కేంద్ర ప్రభుత్వానిదే భాథ్యత. విభజన చట్టంలో ఎక్కడా కూడా కేవళం "ఇరిగేషన్" అంటే సాగుబడికి,డామ్,పవర్ ప్లాంట్ ఖర్చు మాత్రమే అని ఎక్కడా చెప్పలేదు. పూర్తి భాథ్యత కేంద్రానిదే! ఇరిగేషన్ కాంపోనెంట్లోనే భూసేకరణ కూడా వర్తిస్తుంది. 2016 లో నిర్మాణ భాధ్యతలు కేందం రాష్ట్ర సలహా మేరకు రాష్ట్రానికి అప్పగించింది. ఒప్పందం ప్రకారం రాష్ట్రం కట్టిన తరువాత దానిని కేంద్రం ఇస్తుంది. భూసేకరణ చట్టం 2013 - దీని ప్రకారం నిర్వాసితులకి ఇవ్వాల్సిన నష్ట పరిహారం దాదాపు మూడు రెట్లు పెరిగింది. అంతకు ముందు ఉన్న చట్టం ప్రకారం చూసుకుంటే పోలవరం మొత్తం వ్యయం లో కేవళం 8% శాతం మాత్రమే భూసేకరణ,పునరావాస పాకేజీ. కానీ 2013 చట్టం తరువాత దాదాపుగా సగానికి పైగా వ్యయం పునరావాసానికే పెరిగింది. 2013 కి ముందు భూసేకరణ,పరిహారం,పునరావాసం ఏర్పాటుచేయలేదు కాబట్టి 2013 చట్టం ప్రకారం చెల్లింపులు జరపాలని నిర్ణయించారు. 2017 లో సవరించిన అంచనాల ప్రకారం 55వేల కోట్లలో దాదాపు 33వేల కోట్లు భూసేకరణ,పరిహారం,పునరావాసం కె పెరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం దాదాపు 5వేల కోట్ల పెరిగింది. దీనిని (55000కోట్ల అంచనా)కేంద్ర జల సంఘం TAC ఆమోదించింది. దానిని ఆర్థిక శాఖకు పంపింది.

కేంద్రం దోబూచులాట -


విభజన చట్టంలో ఉన్నది "పూర్తి భాధ్యత కేంద్రానిదే" అని పైగా పూర్తి వ్యయం కూడా కేంద్రానిదే అని. మొదట 2014 కి ముందు రాష్ట్రం పెట్టిన ఖర్చు ఇవ్వం అని తెగేసి చెప్పింది. ఆ తరువాత కేవళం డామ్,పవర్ ప్లాంటకి మాత్రమే మా భాధ్యత అని తప్పించుకుంటుంది. ఇప్పుడు 2011 లెక్కల ప్రకారం ఎంత ఉంటే అంతే ఇస్తాం అని ఖరాకండీగా చెప్తుంది. 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 8400కోట్లకి పైగా కేంద్రం ఇచ్చింది. ఇంకా రావాల్సిన రెండు వేల కోట్లు utilisation certificates ఇచ్చాక ఇస్తాం అంది.

రాష్ట్రం బాధ్యత ఎందుకు తీసుకుంది?- అసలు ప్రశ్న కేంద్ర బాధ్యత అయిన ప్రాజెక్ట్ ని రాష్ట్రం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది? చంద్ర బాబు ప్రభుత్వం బాధ్యత తీసుకోవడానికి కారణం కమిషన్ లు అనేది ఒక వర్గం వాదన అయితే నేనే కట్టను అనే మెప్పు కోసం అని ఇంకొక వర్గం వాదన. ఎది ఏమైనా అసలే ఆర్థిక పరిస్థితి బాగొని రాష్ట్రం నెత్తిన పోలవరం అనే గుది బండ పెట్టారు. ఒప్పందం ప్రకారం ముందు రాష్ట్ర ఖజాన నుండి ఖర్చు పెట్టక దానిని కేంద్రం ఆమోదం తెలిపి PPA ద్వారా ఇస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఎది అవసరమా అన్న ప్రశ్న కి తెలుగు దేశం సమాధానం చెప్పాలి . కాంట్రాక్ట్ ల కోసం తీసుకున్నారు అన్న వాదన లేకపోలేదు, కాని రాష్ట్రం ఎం చేసిన పైన కేంద్రం అన్ని చూస్తూనే ఉంటుంది. రాయపాటి కంపెనీనీ కాపాడడానికి అని కూడా విమర్శలు వచ్చాయి. అవినీతి జరిగింది అని ఆరోపణలు వస్తే కేంద్రం బాధ్యత తీసుకుని విచారణ చేసి ఎది ఎంటి అనేది నిరూపించాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల ప్రాజెక్ట్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. కాని అనవసరమైన ఖర్చు రాష్ట్రం ముందు భరించాల్సి ఉంటుంది. ఇక అసలు విషయం - కేంద్రం చెప్తుంది కేవలం irrigation component మాత్రమే మేమే ఇస్తం ,పునరావాస package మాకు సంబంధం లేదు అని వాదన. ఏ ప్రాజెక్ట్ అయిన భూ సేకరణ, పునరావాసం, కలిపే ఖర్చు ఉంటుంది. 20000 కోట్ల అంచనా 55000 కోట్లకి పెరగడానికి ముఖ్య కారణం 2013 భూ సేకరణ చట్టం. అది కేంద్ర ప్రభుత్వ చట్టం దాని వాళ్ళ 3ఇంతలు పెరిగింది. పెరిగిన ధరలను TAC కూడా ఆమోదించింది. కాని ప్రాజెక్ట్ నిర్మాణ భాద్యతలు రాష్ట్రానికి ఇచ్చేటప్పుడు G.O లో కేవలం irrigation component మాత్రమే అని పేర్కొంది ,అందులో భూ సేకరణ, పునరావాసం కలిపే ఉంటాయి కాని ఇప్పుడు మేము దాం,పవర్ ప్రాజెక్ట్ మాత్రమే అని అది కూడా 2013 రేట్ ల ప్రకారం అని చెప్తుంది. ఇది పూర్తి బాధ్యత రాహిత్యం. ఒకవేళ కేంద్రం కేవలం irrigation కి మాత్రమే అని చెప్పింది అనుకుంటే ఒప్పందం చేసుకున్న తెలుగు దేశం ప్రభుత్వం అప్పుడు భూ సేకరణ, పునరావాసం కి కలిపే న లేక ఆహ్ బాధ్యత రాష్ట్రమే భరించల అన్నది తెలుగు దేశం నాయకులు ప్రజలకి చెప్పాలి. ఇప్పుడు ముఖ్య మంత్రి జగన్ కూడా కమిషన్ ల కోసమే అంచనా లు పెంచారు అని మొదటి పేజి లో ప్రచురించారు. ఇప్పుడు అవే అంచనాలు సరైనవి అని కేంద్రానికి నివేదిక పంపారు.కేంద్రాన్ని నిధులు అడిగే నైతికత నీ కోల్పోయారు. ఒకవేళ ప్రాజెక్ట్ ని పూర్తి చేసినా భూ సేకరణ, పునరావాసం ఇవ్వనిదే ప్రజలకి న్యాయం జరగదు.

పునరావాసం,పరిహారం –


ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న ఊళ్ళ నుండి వెళ్ళిపోమని చెప్పి కనీసం నష్ట పరిహారం కాని పునరావాస కేంద్రాలను కాని నిర్మించుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళని వెల్లగొట్టి ప్రాజెక్ట్ పూర్తిచేసినా వారికి చేసింది అన్యాయమే. దేశం లో చాలా ప్రాజెక్ట్ లు ముందు ప్రాజెక్ట్ లు కట్టిన తరువాత నిర్వాసితుల గురించి ఆలోచిస్తారు, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ విషయం లో ,ఇప్పుడు పోలవరం విషయం లో కూడా ఇదే జరుగుతుంది. తమ హక్కులను చెరిపేసి, ప్రాజెక్ట్ లు కట్టి న్యాయం చెయ్యడం లేదు. వారి బాధలు వర్ణనాతీతం . రాష్ట్ర ప్రభుత్వము అనినీతి అక్రమాలు చేసి ఉంటే విచారణ చేసి చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది.గత ప్రభుత్వం బాధ్యత తీసుకున్న పాపానికి కేంద్రం రాష్ట్రమే సాగదీసింది అనే నెపం తో నిధులు ఆపింది. రాష్ట్రం లో ఉన్న రాజకీయ పార్టీ లే పోలవరానికి శాపం. రాజకీయ మెప్పు కోసం ప్రాజెక్ట్ తీసుకుని రాష్ట్రం మీద బరువు వేసిన చంద్ర బాబు ఒక పార్టీ,అదంత అక్రమం అని ఇప్పుడు అదే సరైనది అన్న జగన్ ఇంకో పార్టీ. ఇలా పార్టీ ల కుమ్ములాటలు వల్ల పోలవరం వెనక్కి వెళ్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యము వల్ల అంచనా పెరిగింది అని చెప్తున్న వారు,అన్ని జాతీయ ప్రాజెక్ట్ ల్లో ఎంత మేరకు మొదటి అంచనాలు సవరించిన అంచనాలు తేడా ఉని జల వనరుల శాఖ report చూస్తే అర్ధం అవుతుంది. అలాగే కేంద్రం ఎన్ని ప్రాజెక్ట్ లకి 2013 లెక్కల ప్రకారం నిధులు ఇస్తుంది? పోలవరం ఆంధ్ర జీవనాడి. కృష్ణ,గుంటూరు,ఉభయ గోదావరి, విశాఖపట్నం, అంతే కాకుండా రాయలసీమ (శ్రీశైలం నుండి) లబ్ధి . రాజకీయాలు పక్కన పెట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక అవగాహన తో "కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుని " పోలవరం పూర్తి చెయ్యాలి.

241 views1 comment

1 opmerking


sudarsan123
02 nov. 2020

ఒక పనికి అయ్యే ఖర్చు దాని వల్ల వచ్చే లాభాలు అన్నీ జాగ్రత్తగా పరిశీలించి, ప్రభుత్వము ప్రాధాన్యతా క్రమము ఏర్పరచుకోవాలి.

ఏపీలోని అన్ని పనులపై శాస్త్రీయ పరిశోదన చేసి, ప్రాధాన్యతా క్రమం ప్రకటించకుండా, పోలవరం ఏపీకి జీవనాడి అనడం మానాలి.

నీతీ నిజాయితీతో కూడిన ప్రభుత్వం మాత్రమే ఏపీకి జీవనాడి, పోలవరం కాదు, అమరావతి కాదు.

Like
bottom of page