top of page
Writer's pictureSainika Swaram

విద్య - రాజకీయం - వ్యాపారం

ప్రపచంలో అన్ని దేశాలతో పోల్చితే భారత దేశంలో విద్యకు సముచితమైన,గౌరవమైన స్థానం ఉంది.విద్య ను దేవునిగా కూడా కొలిచే సాంప్రదాయం ఉన్న దేశం మనది.


మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్న దేశం కావడం వలన,ప్రపంచంలో రెండవ అతి పెద్ద జనాభా కలిగినదేశం కావడం వలన నిరుద్యోగ,పేదరికం వంటి అసమానతలు పోవాలి అంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా పని చెయ్యాలి.లేకపోతే నేరాలు,పేదరికం పెచ్చు మీరుతుంది..

దీనికి గాను కేంద్ర బడ్జెట్ 2020-21 లో కొత్త విద్యా ప్రణాళికకు కేంద్రం స్థానం కల్పించడం హర్షణీయం.


ఇది కార్య రూపం దాల్చలని ఆశిద్దాం..


ఇక మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తె,ఏ ప్రభుత్వం ఏర్పడాలి అన్నా ఎన్నికల్లో విద్యా,ఉద్యోగం గురించి హామీల వర్షం గుప్పించడంసర్వ సాధారణం,దీనికి పునాధి వేసింది రాజశేఖర రెడ్డి..

Fee-reimbursement అనే ఒక హామీని తీసుకొచ్చి B..Tech విద్యార్థులకు ఇంచు మించు ఉచిత విద్య అనే ఎన్నికల హామీతో గెలవడం జరిగింది..తర్వాత చంద్ర బాబు గారు,”జాబు కావాలంటే బాబు రావాలి”,ప్రస్తుత ముఖ్యమంత్రి అమ్మ ఒడి,గ్రామ సచివాలయాలు వంటి హామీలతో వచ్చారు..


Fee-reimbursement అనగానే ఎన్నడూ లేని విధంగా ఇంజనీరింగ్ కాలేజీలు,ప్రపంచ స్థాయి స్కూళ్లు పుట్టుకొచ్చాయి.అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్ర విద్యా వ్యవస్థను కూలంకషంగా పరిశీలిద్దాం.


Fee-reimbursement క్రింద కొన్ని ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం:


ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం జిల్లాలో చూస్కుంటే 2004 లో ఉన్న engineering కాలేజీలు మొత్తం 9-10(ప్రస్తుతం ఉన్నవి నాలుగు)


వీటిలో

• SLN MITRA Inst. Of Technology

(సీనియర్ కాంగ్రెస్ నేత)

• SRI SIVANI

(గత ఎన్నికల్లో ఈ కాలేజీ గ్రౌండ్లో వైసీపీ కి ఉచిత బస ఏర్పాటు చేశారు)

ఇలా అవంతి,దాడి వీర భద్రరావు,ఇలా ఎంతో మంది జిల్లాలో సగం పైగా విద్యా సంస్థలు అప్పటి కాంగ్రెస్ నాయకులు స్థాపించారు..

విద్యా సంస్థలు విద్యావేత్తలు నడపాలి కానీ రాజకీయ నాయకులు కాదు..

ఈ reimbursement పథకం వల్ల,B.Tech లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగి పేరు పొందిన విద్యా సంస్థలు స్కూళ్లు పెట్టడం మొదలుపెట్టాయి.ఆరవ తరగతి నుంచే IIT శిక్షణా తరగతులు అంటూ మొదలుపెట్టాయి.దీని వల్ల విద్యార్థుల మీద ఎంత ఒత్తిడి పడిందో 2007 డిసెంబరులో వేసిన నీరద రెడ్డి కమిటీ వెల్లడించింది.


ఇదే కాకుండా ఆ సంవత్సరం విద్యార్థుల ఆత్మ హత్యలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయని పేర్కొనడం జరిగింది.


ఇక పోతే,ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి,నవశకం లాంటి పథకాలు,గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చిన హామీల గురించి చూద్దాం..


గత ప్రభుత్వం 2018-19 గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి సమకూర్చిన నిధులు 24,961 కోట్లు.




అదే 2019-20 గాను బడ్జెట్ కేటాయింపుల్లో revised 19,587 కోట్లు చూపించి విద్యా రంగానికి 33,410 కోట్లు కేటాయించారు..ఇందులో సుమారుగా 10,000 కోట్లు కేవలం అమ్మ ఒడి,పాఠశాలల మెరుగుదల వీటికోసం వెచ్చించారు.





.కాగా అమ్మ ఒడి ఇస్తున్న,పాఠశాలల్లో మౌలిక సదుపాయాల గురించి ఎలా ముందుకు వెళ్లాలి అన్న విధి విధానాల గురించి ఎటు వంటి ప్రణాళిక లేదు..

ఇందులో కేటాయించని చాలా హామీలు ఇంకా ఉన్నాయి,PG చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా హాస్టల్ ఖర్చులకు గాను ₹ 20,000.ఎన్నికల హామీ గుప్పించడం జరిగింది..ఇవన్నీ లెక్క వేస్తే సుమారుగా ప్రతి ఏటా ₹15,000 కోట్లు కేవలం తాయిలాలకే సరిపోతుంది…


ఇప్పుడు అసలు విషయాన్ని చర్చిద్దాం:


ఈ పథకాల వరకు నిజంగా ప్రజలకి ఎంత వరకు లాభం ఉంటుంది..దీని వల్ల వచ్చిన మార్పులు ఎంటి??

లాభాలు:

ఎటు వెతికినా ఎంత చూసినా ఒకటే లాభం కనిపిస్తుంది.15,000 కోసం పిల్లలు స్కూళ్లకు వెళతారు..ఉద్యోగ అవకాశాలు,దానికి కావాల్సిన కనీస అర్హతలు లేని అక్షరాస్యత ఎందుకు??


ఇప్పుడు నష్టాలు మాట్లాడుకుందాం:


వీటిని నష్టాలు అనే కన్న సంసిద్ధత లేకపోవడం అనాలి:

• ఆ వేసిన పది వేలు కేవలం పిల్లల చదువులకు ఉపయోగిస్తున్న తల్లి తండ్రులు ఎంత మంది.మొన్న సంక్రాంతికి చూశాం ఆ డబ్బులు ఎటు వెళ్ళాయో అనేది.

• ముఖ్యంగా మౌళిక సదుపాయాలు,ఇప్పుడున్న పోటీ తత్వానికి,పిల్లలు స్కూళ్లకు వెళ్తే సరిపోతుందా??లేక వెళ్లి పరిగెడుతున్న ప్రపంచానికి అనుగుణంగా తయారు అవ్వాలా?

• మన రాష్ట్రం లో పాఠశాలలు ప్రభుత్వ,మునిసిపల్,జిల్లా పరిషత్ అని మూడు విభాగాలుగా విభజించబడ్డాయి..

• వీటిలో ఎన్ని పాఠశాలల్లో కనీసం లో కనీసం ఒక కంప్యూటర్ అయిన ఉంది??

• ఎన్ని పాఠశాలల్లో శౌచాలయాలు ఉన్నాయి??

• ఎన్ని పాఠశాలల్లో బెంచీలు సరిగ్గా ఉన్నాయి??

• అసలు ఎన్ని పాఠశాలల్లో టీచర్లు బోధన సరిగ్గా ఉంది??

• ఇప్పటికిప్పుడు వచ్చి ఆంగ్ల మాధ్యమం అంటున్నారు,పిల్లలు అది అందుకొగల స్థోమతలో ఉన్నారా??

• అసలే ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అంతంత మాత్రమే ఉంటుంది..

• ఇక ఇది పక్కన పెడితే,ఒకప్పుడు విద్యార్థులకు ఎంతో ఒత్తిడికి గురిచేసిన 500+/600 మార్కుల పద్ధతి తిరిగి ప్రవేశ పెట్టింది ప్రస్తుత ప్రభుత్వం..

• గ్రేడ్ విధానం ద్వారా ఈ మార్కుల పరుగులకు ఒకింత కళ్లెం పడిందనే చెప్పాలి..కానీ ఇప్పుడు మళ్లీ అది మొదలవుతుంది..

• ప్రపంచంలో ఏ విద్యార్థిలో ఒక సబ్జెక్టు పట్ల ఉన్న పట్టు తెలుసుకోవాలి అనే ఏ పోటీ పరీక్షలు అయిన objective type పరీక్ష విధానాన్నే అవలంబిస్తారు.ఇందుకు గాను చిన్న వయసు నుంచే అలవాటు చేసే విధంగా పదవ తరగతిలో 30 మర్కులగాను bit paper ఉండేది.గత ప్రభుత్వం దీన్ని పది మర్కులకుగాను చెయ్యగా,ఈ ప్రభుత్వం పూర్తిగా 100 మార్కులు descriptive విధానాన్ని ప్రవేశపెట్టి 2½ గంటల్లో 100 మార్కులు రాసే విధంగా ప్రవేశ పెట్టింది.

దీని వల్ల important questions మీద ఆధారపడే వాళ్ళు అధికమై conceptual learning ki విద్యార్థులు దూరం అవుతారు.


ప్రపంచమంతా సాంఘికంగా,సాంకేతికంగా మారుతుంటే,ప్రస్తుత ప్రభుత్వం దివంగత నేత అని చెప్పుకుంటూ పది సంవత్సరాల క్రితం అవలంబించిన పద్ధతులను పాటిస్తుంది.

తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ అనుకూల వర్గాలకు మేలు చేస్తూ

“మన ప్లేటు,మన బిర్యానీ” పథకాన్ని అవలంబిస్తూ చాలా తక్కువ మందికి మేలు చేస్తూ,ఎక్కువ దుష్ప్రయోజనలు కలిగిన పథకాల ద్వారా ప్రభుత్వం ముందుకు వెళుతుంది..

ఒక రకంగా చెప్పాలంటే నేటి తల్లి తండ్రులు 15,000 తీసుకుని తమ పిల్లల చదువుని అమ్ముకుంటున్నారు..


చదువు' కున్నాము'

చదువు ' కొన్నాము '

ఆఖరికి

చదువు ' ఆమ్ముకుంటున్నాము '

525 views0 comments

Recent Posts

See All

Comentarios


bottom of page