top of page
Writer's picture Tyler Durden

Amaravati - The Lost Capital


అమరావతి, ఒకప్పటి శాతవాహనుల రాజధాని, కృష్ణ నది తీరానఊపిరి పోసుకొని కాలక్రమేణ ప్రసిద్ధిగాంచిన నగరం. చరిత్రపుటల్లో కలిసిపోయిన అమరావతికి తిరిగి ఊపిరిపోస్తాం అంటూ ఆశలు రేపి ఈ రోజుఎంతోమంది రైతుల కన్నీటికి కారణంఅయిన ఈ వైనానికి భాధ్యులు ఎవరు? భాధ్యత ఎవరిది?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి తమకంటూ ఒక రాజధాని ఉండాలి, అది ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే అంశాలని పరిశీలించడానికి 2014 లోనే కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఒక మహానగరం కంటే అభివృద్ధి వికేంద్రికరణకి ప్రాధాన్యత ఇవ్వాలి అని కమిటీ సలహాలు ఇచ్చినా అది పెడచెవిన పెడుతూ కృష్ణా నది తీరాన, విజయవాడ సమీపంలో రాజధానికి ముప్పైవేల ఎకరాల భూమిని గుర్తించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.అమరావతికి మొదటినుండి అడ్డంకులే. పంటలు పండించే సాగుభూమిని భవన నిర్మాణాలకు వాడకూడదు అని కొందరు, అమరావతి వరద పీడిత ప్రాంతం అక్కడ రాజధాని కడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అని కొందరు, NGT నుండి అడ్డంకులు, అన్నిటిని పక్కనపెడుతూ జూన్ 6, 2015 రోజు నగర నిర్మాణానికి భూమి పూజ తలపెట్టారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది, రాజధానికి కావలిసిన భూమికోసం భూసేకరణ చట్టాన్ని ఉపయోగిస్తే ఎక్కువ సమయం పడుతుంది అని భావించిన చంద్రబాబు గారు “ల్యాండ్ పూలింగ్ స్కీం” కి తెర లేపారు.ఆగమేఘాల మీదCRDA చట్టాన్ని అమలుచేసి 29 గ్రామాల్లో భూమిని సేకరించే ప్రయత్నం మొదలు పెట్టారు.


భూసేకరణ కోసంకొందరిని ఒప్పించారు, కొందరికి నొప్పించారు. సాగు భూములని ఇవ్వడం ఇష్టంలేకపోయినా ఎంతోమంది రైతులు తప్పక అప్పటి ప్రభుత్వాన్ని నమ్మి భూముల్ని ఇచ్చారు.


29 గ్రామాలు, ముప్పైవేల ఎకరాలకి పైగా భూమిని సేకరించడానికి ఉపయోగించిన ల్యాండ్ పూలింగ్ స్కీం ని అద్భుతం, అమోఘం అంటూ పొగిడిన మీడియా చానల్స్ ఎన్నో. అయితే భూసేకరణ చట్టంలో ఉన్న భద్రతా నిబంధనలు ల్యాండ్ పూలింగ్ స్కీం లో లేవు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు ముందు అమరావతిని వ్యతిరేకించారు, insider trading జరిగింది అని, అమరావతి ఒకే వర్గానికి చెందింది అని ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వం ఏం చేసినా వ్యతరేకించాలి అనే చందాన ప్రవర్తించారు కానీ ఆ నాడు ఒక భాధ్యతాయుతమయిన ప్రతిపక్ష పాత్ర పోషించింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే, మిత్ర పక్షంలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజల తరపున మాట్లాడారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చేసిన రెండు డిమాండ్ లలో ఒకటి సాగు భూముల్ని బలవంతంగా లాక్కోకూడదు రైతుల ఇష్టంతోనేభూములు తీసుకోవాలి, రెండోదితీసుకున్న భూమికి తగిన భద్రత కల్పించాలి.



భూ సేకరణ జరిగింది, oct 22, 2015నాడు చాలా ఆర్భాటంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. మొదటసింగపూర్ అన్నారు, తరువాత టోక్యో, అటు తరువాత లండన్, అస్థాన ఇలా నెలకో డిజైన్ మారుస్తూ అమరావతిని ఎడ్యుకేషన్ కాపిటల్ చేస్తాం, హెల్త్ కాపిటల్ చేస్తాం, amaravatito behappiest city, amaravatito get hyperloop అని ఇలా అరచేతిలో ఆకాశాన్ని చూపించి కాల యాపన చేశారు అప్పటి టీడీపి నాయకులు. తీరా చూస్తే శంకుస్థాపన జరిగి రెండేళ్ళు గడిచిన ఒక్క ఇటుక కూడా కదలలేదు.


అయితే ఈ మధ్యలోనే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదని, అమరావతిని మనస్పూర్తిగా రాజధానిగా ఒప్పుకుంటున్నాం అని జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు. 2015 లో అమరావతికి మద్ధతు ఇవ్వను, ఒకవేళ తను అధిరాకంలోకి వస్తే అమరావతి భూముల్ని తిరిగిఇచ్చేస్తాను అని చెప్పిన జగన్, 2017 లో మాట మార్చడానికి ప్రధాన కారణం votebank politics. ప్రజల్ని నమ్మించడానికి తను కూడా అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను అని ఒక ఎర వేశాడు, తన పార్టీ MLA లతో ప్రభుత్వం మారినా ఎప్పటికీ రాజధాని అమరావతిలోనే ఉంటుంది, అమరావతిని అభివృద్ధి చేసే సమర్ధత కూడా జగన్ గారికే ఉంది అని పదే పదే చెప్పించాడు.


2018: సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందాన ముందుకు మాత్రం సాగట్లేదు. ఎన్నికలు దగ్గర పడ్తున్నాయి అనే భయంతో ఇన్ని రోజులు ఫోటోలకే పరిమితమయిన గ్రాఫిక్స్ ని ఈ సారి వీడియోలలో చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, గ్రాఫిక్స్ తో పాటు కొన్ని తాత్కాలిక భవన నిర్మాణాలకి తెర లేపింది, అమరావతి అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది అని మీడియాలో ఊదరగోట్టింది, ఎన్ని చేసినా ప్రజల విశ్వాసాన్ని మాత్రం గెలవలేక 2019 లో ఓటమిని చవిచూసింది.

జగన్ ప్రభుత్వం వచ్చాక మొదటినుండి రాజధాని మారబోతుంది అనే సంకేతాలను ఇస్తూనే ఉన్నారు. అధికార వికేంద్రికరణ అనే ఒక అబద్ధాన్నిబూటకంగాచూపించి మూడు రాజధానులు అని చెప్పినా, విశాఖ మాత్రమే అసలు రాజధాని అని తెలుసుకోడానికి పెద్ద విజ్ఞత అక్కర్లేదు.ఏ రాష్ట్రంలో అయినా adminstrative/executive capital అనేదే నిజమయిన రాజధాని. Judicial capital, Legislative capital అంటూ ఇంతవరకూ మన దేశంలో ఎక్కడా లేని ఒక కొత్త పదాలని జోడించి కర్నూల్, అమరావతిలను రాజధానిగా అభివర్ణించిన అవి పేరుకు మాత్రమే పరిమితం.

రాజధాని విషయంలో ఏ పార్టీ చేసిన తప్పులు ఏంటి అని బేరీజు వేసుకొని చూస్తే,

2019 లోపు seed capital area ని పూర్తిగా నిర్మిస్తాం అని చెప్పి ఐదేళ్ళు గడిచినా అమరావతిని అరకొర భవనాలకే పరిమితం చేయడం, Amaravati: Peoples’ capital అని పదే పదే చెప్పి, రాజధాని నిర్మాణంలో ప్రతిపక్షాన్ని, అన్నిప్రాంతాల ప్రజల్ని కలుపుకోవడంలో విఫలం అవ్వడం, ఎటువంటి భద్రతా లేకుండా భూముల్ని సేకరించడం ఆ నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పులు. టీడిపి చెప్పినట్టు 2019 కల్ల core city ని అభివృద్ధి చేసి ఉంటేబహుషా ఈ రోజు జగన్ కి రాజధానిని మార్చే అవకాశం ఉండేది కాదేమో, అమరావతి ఒక ghost city గా మిగిలిపోయేది కాదేమో



ఇక వైసీపి చేసిన తప్పుల విషయానికి వస్తే, ఎన్నికలకి ముందు ఎప్పటికీ అమరావతినే రాజధాని గా ఉంటుంది అని ప్రజల్ని నమ్మించి ఇప్పుడు వికేంద్రికరణ అనే పేరుతో రాజధానిని విశాఖకి మార్చేశారు. అమరావతిలో insider trading జరిగింది అంటూ ఆరోపణలు చేసి ఒక్క ఆరోపణని కూడా నిరుపించకుండానే రాజధాని మార్పిడిని సమర్ధించుకోవడం.భారతదేశం లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో executive వ్యవస్థ, legislative వ్యవస్థలో ఒక అంతర్గత భాగం, అలాంటి పరస్పరాధారిత వ్యవస్థలని వేరు చేయడంలో తర్కం ఏంటి అని ఈ ప్రభుత్వానికే తెలియాలి. అమరావతి రైతుల విషయంలోమీ భూములకి మా భాధ్యత అంటూ ఒకప్పుడు హామీ ఇచ్చిన జగన్ గారు ఈ రోజు ఆ రైతులు 230 రోజుల నుండి దీక్ష చేస్తున్న కనీసం పట్టించుకోకుండా వాళ్ల భవిష్యత్తుని ప్రశార్థకంగా మార్చేశారు.

రాజధాని విషయంలో అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ముందు నుండి ప్రజల వైపు పోరాడుతుంది మాత్రం జనసేన మాత్రమే. ఆ రోజు భూములని లాక్కోవద్దు, తీసుకున్నభూములకి భద్రత ఇవ్వండి అని టీడిపిప్రభుత్వాన్ని వ్యతిరేకించింది జనసేన పార్టీయే. ఒక ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు నష్టపోకూడదు అని ఈ రోజు వైసీపి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులకి సంఘీభావాన్ని ప్రకటించిన పార్టీ జనసేనయే.


ఆగష్టు 23, 2015 లో పెనుమాకలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరిచిన భయాలు ఈ రోజు నిజం అయ్యాయి. ఒకరిvision పట్టణాలు కట్టడం వరకే పరిమితం అయితే ప్రజల భవిష్యత్తునిఅంచనావేసే vision మాత్రం పవన్ కళ్యాణ్ గారికే సొంతం.


ప్రజలకి జవాబుదారీగా ఉండకుండా మాటలు మార్చి నమ్మించి మోసం చేసింది వీరు,ఈ రెండు పక్షాలు... కానీ సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ అట .

నాడూ నేడూ జనసేనాని నిలబడింది నష్టపోతున్న వారి పక్షానే..నాడు తెదేపా హయాంలో రాజధాని ప్రాంత పర్యటనకి వస్తే రాళ్ళు విసిరి దాడులు చేశారు,టెంట్లు పీకెశారు.వైసీపీ పాలనలో అమరావతి కి వెళుతుంటే అడ్డుకొని నిర్బంధాలకి గురి చేశారు..అమరావతి రైతులపై జనసేన చిత్తశుద్దిని శంకించే పని లేదు.

ప్రజలచే ఎన్నుకోబడిన ఈ రెండు పక్షాల నాయకులకి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా రాజీనామాలు చేసి పోరాటం చేయాలి .

1,187 views9 comments

9 Comments


moviesflamesite
Sep 01, 2022

This post provide us lots of knowledge so we can grow our personal knowledge and skill and you may visit this gali result

Like

moviesflamesite
Sep 01, 2022

It is so exciting to see that lot of informative post that you post,this post I really loved it because it post have informative content and visit this <a href="https://disqus.com/by/disqus_c3rgjnCESV/">gali result</a>

Like

venkykalyanvk47
venkykalyanvk47
Aug 07, 2020

Very clearly mentioned every point to still wt happened n whats the role in Janasena party really very informative bro we need the facts in the form these articles , newspapers ...

Like

Good Information Bro TylerDurden 🙏😎

Like

Alp Kumar
Alp Kumar
Aug 04, 2020

Nice article bro

Like
bottom of page