top of page
Writer's picture Tyler Durden

సంక్షోభ పధకాలా ?? సంక్షేమ పధకాలా??


సంక్షేమం మాటున రాబోతున్న పెను సంక్షోభాల గురించి ప్రస్తావించుకుందాం.


ఒక సమాజంగా బ్రతుకున్న ప్రజలమైన మనం అందరం మన అవసరాలు,సమస్యలూ,ఇబ్బందుల పరిష్కారానికి, మౌలిక వసతల కల్పన,మెరుగైన జీవన విధానానికి బాటలు పరిచేలా చర్యలు, కార్యక్రమాలు చేపట్టేందుకు మన కష్టార్జితం నుండి పన్నులు కడుతూ ఆ పన్నులకి ధర్మ కర్తగా ఉంటూ ప్రాధాన్యతా క్రమంలో ఆ నిధులని మళ్ళీ ఆ సమాజానికే ఖర్చు చేసేందుకు మన నుండి కొందరిని కొంత కాలం పాటు మన ప్రతినిధులుగా ఎన్నుకొని మన జీతగాళ్లుగా ప్రజల సంక్షేమం కోసం పనిచేసేందుకు ప్రభుత్వం అనే వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం.

ఇదీ ప్రభుత్వాలు ఉండాల్సిన పద్దతి


కానీ కులాల మధ్య చిచ్చులు పెట్టి,మతాల మధ్యన మంటలు పెట్టి ,వర్గాలుగా ప్రజలను వేరు చేసి,ప్రజలను ఓటు బ్యాంకుగా మారుస్తూ కోట్లకి కోట్లు కుమ్మరిస్తూ ఓట్లని కొనుక్కుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారం చేపట్టిన రాజకీయ పార్టీలు,నాయకులు అధికారం అందాకా గెలిపించిన ప్రజలని విస్మరించి తమ భాద్యత మరచి స్వప్రయోజనాలు, మరో మారు అధికారం కైవసం చేసుకోవడం ఎలా అనే వాటికే ప్రాధాన్యత ఇస్తూ ప్రజలిచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు.

ప్రభుత్వాలని ఎన్నుకునేది ఐదు సంవత్సరాల కాల పరిమితికే అయినా కూడా వారు తీసుకునే నిర్ణయాలు ఒక తరాన్ని ద్రుష్టిలో పెట్టుకొని విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి.కానీ రాజకీయ నాయకులు తమ పార్టీ,తమ రాజకీయ భవిష్యత్ గురించే ఆలోచన తప్ప ప్రజలు రాబోయే తరాల గురించి కించిత్ ఆలోచన కూడా లేకుండా ఇష్టారాజ్యంగా తోచిన నిర్ణయాలు తీసుకుంటూ ఒక తరం భవితని తాకట్టు పెడుతున్నారు.

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న పధకాలనే ఒకసారి పరిశీలన చేస్తే,వాటి వల్ల నిజంగా రాభోయే తరాలకి ఏమైనా ఉపయోగం ఉందా? కనీసం లభ్దిదారులకి అయినా ఆ పధకాల వల్ల వస్తున్న డబ్బు వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? అమ్మ వొడి అంటూ ఆర్భాటంగా ప్రకటనలూ,ప్రచారాలూ... మనిషికి ఇన్ని వేలు అని పంచె బదులు,ఆ డబ్బులనే విద్యా వ్యవస్థని పటిష్టం చేయడానికి వినియోగించోచ్చు కదా? పెచ్చులు కూలుతున్న బడులు ఎన్నో ఉన్నాయి,అమ్మాయిలకి కనీసం శౌచాలయ వసతి కూడా లేని దుర్భర పరిస్థితులు ఉన్నాయి,సంక్షేమ వసతీ గృహాలలో ఎండకి ఎండీ వానకి తడిసీ,చలికి వణికిపోయే దీన స్థితిలో ఉంటున్నారు విద్యార్ధులు,పాఠ్య పుస్తకాలు విద్యా సంవత్సరంలో ఒక టర్మ్ గడిచినా అందవు,యూనిఫారాలు కూడా అంతే. ఈ సమస్యలు దూరం చేస్తే పట్టణాల్లో కూడా అప్పులు చేసి మరీ ప్రైవేటు బడులకి పంపుతున్న తల్లి దండ్రులు కూడా ప్రభుత్వ బడులకే మొగ్గు చూపుతారు కదా.వీటి గురించి పట్టదు.అనేకానేక సమస్యలతో విద్యా వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇవన్నీ విస్మరించి,ఇంటింటికీ డబ్బులు పంచడం ఎవరికీ ప్రయోజనం.రాజకీయ నాయకులకే, అడక్కుండానే మా అన్న ఎకౌంటులో డబ్బులు వేసాడు.ఇలానే ఏ కష్టం లేకుండా డబ్బులు పడాలంటే ఈయనే పదవిలో ఉండాలి,కాబట్టి ఈయనకే ఓటు వేస్తాం అని ప్రజలు అనుకునేలా చేసేందుకే ఈ పధకం.కానీ ఇక్కడ బలి అవుతుంది ఎవరూ? పైన చెప్పిన సమస్యలు ఉన్న బడులకి వెళ్లి అరకొర సదుపాయాల మధ్య నాణ్యత లేని విద్యని అభ్యసించి భవిష్యత్ ని కోల్పోయే ఒక బాలుడు/బాలిక కి నష్టం.ఇలాంటి వాళ్లు కొన్ని లక్షలు.

పైన పేర్కొన్న పధకం కేవలం ఉధారణ మాత్రమే.ఇలాంటి పధకాలే అన్నీ. ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల చేత నడవబడుతున్నవి ప్రభుత్వాలు,ప్రజల మీద ఆధారపడి ఉన్నాయి ప్రభుత్వాలు కానీ మన రాజకీయ నాయకులు ఎంతటి దుస్తితికి దిగజార్చారు అంటే.ప్రజలే ప్రభుత్వాల మీద ఆధార పడి బ్రతుకుతున్నారు, మా ప్రభుత్వం లేకపోతె అసలు ప్రజలకి బ్రతకడమే కష్టం అన్నంతగా దిగజార్చారు.అడక్కుండానే అకౌంటులో డబ్బులు వేస్తారు – అన్నది జాలి గుండె అని అనుకోవాలి .ఇచ్చేది నీ రెక్కల కష్టమే – వాళ్ళ ఆస్తి నుండి ఇవ్వట్లేదు అని మర్చిపోతావు అక్కడ .బయటకి వెళితే గుడి నుండి బడి దాకా,శౌచాలయం నుండి కార్యాలయాల దాక ఆ పార్టీ రంగులే కనపడాలి,ఎక్కడ నువ్వు ఆ పార్టీని మర్చిపోతావేమో అని భయం,బలవంతంగా అయినా నీ మీద రుద్దుతారు.రోడ్డు మీదకి వస్తే వాళ్ళ పార్టీ నాయకుల విగ్రహాలే కనపడాలి,నువ్వే దేవుడివి నువ్వు లేకపోతె నాలాంటి బలహీనుడు బ్రతకలేడు అని నీకు అనిపించేలా చేసేందుకు,ఎక్కడ నువ్వు ఆ పార్టీ పరంపర్యాన్ని మర్చిపోతావో, ఎక్కడ సానుభూతి రాకుండా పోతుందో అని వాళ్ళ అభద్రత. ప్రతీ ప్రభుత్వ పధకానికి వారి నాయకుల పేర్లే ఉండాలి,అయ్యో నిజంగా ప్రజల కోసం ఇన్ని చేస్తున్నాడా, అసలు ఈయన్ని మించిన మహనీయుడు దయార్ద హృదయుడు ఈ భూమండలంలోనే లేడు అని నీకు అనిపించేలా చేయాలి కదా . ఈ పార్టీ మళ్ళీ గెలవకుంటే ఈయన పేరు మీద ఉన్న పధకాలు ఏవీ ఉండవేమో అని అమాయక ప్రజలు అనుకోవాలి కదా,పైగా నిద్రలో కూడా మర్చిపోడానికి లేకుండా ఆలోచనల్లో కూడా వీళ్ళ పార్టీ,వీళ్ళ నాయకుడు,వీళ్ళ రంగులు తప్ప మరేవీ రిజిస్టర్ అవ్వకుండా ఉండాలి కాబట్టి పదే పదే అవే ప్రజలపై బలవంతంగా రుద్దుతూ ఉంటారు.


వాస్తవం ఏమంటే మనం అధికారం ఇచ్చింది మనకోసం పని చేయమని,ఓట్లు కొనుక్కోడానికి సొంత ఆస్తి తగలేస్కున్నావు,ఇప్పుడైనా ఇంటి పట్టున ఉండి కోట్లు వెనకేసుకో అని కాదు.మన సమస్యలు తీర్చమని ఎన్నుకున్నాం, అధికారం లేక రోడ్ల మీద నడుస్తూ అల్లల్లాడిపోయావు,పల్లకీలో నువ్ కూర్చో మా భుజల మీద మోస్తూ మా పిల్లల భవితని తొక్కుతూ నిన్ను భరిస్తాం అని కాదు.





అనుకోని ఆపద, కరోనా వంటిది వస్తే,నాలుగు రోజులలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టె దౌర్భాగ్య స్థితికి రావడానికి కారణం ఏమిటి? పోనీ ఇప్పుడు ఈ ప్రజాకర్షక పధకాలకి మళ్ళీ డబ్బులు రావాలంటే ఆ భారం ఎవరి పైన పడుతుంది.మళ్ళీ సామాన్య ప్రజల పైనే.భారం ప్రజలది,భాద్యత ప్రజలకి,ప్రచారం అధికారం పార్టీలకి.




సంపద సృష్టించాల్సిన ప్రభుత్వాలు వాటిపైన కనీస శ్రద్ధ వహించకపోగా,ఆస్తులు అమ్మి హామీ నేరేవేర్చే దౌర్భాగ్య పరిస్థితి తీసుకురావడమేమిటి?? అధికారంలోకి రావడానికి అమలు చేయలేనన్ని హామీలు ఇవ్వడం దేనికి? ఆ హామీలు,అవేవీ రాభోయే తరాలకి కనీసం ఉపయోగపడేవి కాదు సుమా,కేవలం తాత్కాలిక ప్రయోజనాలు,రాజకీయ లభ్ది పొందేవే.అలాంటి హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వ ఆస్తులు అమ్మడాలు.వీళ్ళకి ఐదేళ్ళు జాగ్రత్తగా చూసుకోమని అద్దెకిస్తే ఏడాదికే రంగులేసి ఇల్లు అమ్మకానికి పెట్టినట్టు ఉంది ప్రభుత్వ వైఖరి.అడవులు కొట్టేసి హౌసింగ్ సొసైటీలు కడతాం.ఆస్తులు అమ్మేసి నవ రత్నాలు అమలు చేస్తాం,అప్పులు తెచ్చేసి అర చేతిలో వైకుంటం చూపిస్తాం.వీటి కోసం కాదు ప్రభుత్వాలని ఎన్నుకునేది.

ఇన్ని సంక్షోభాలకి తావిస్తూ అమలు పరిచే పధకాలు సంక్షేమ పధకాలా?

కానే కాదు ఈ పార్టీలు మళ్ళీ అధికారంలోకి రావడానికి వేస్కునే పధకాలు,ప్రణాలికలు.

877 views1 comment

Recent Posts

See All

Comments


nirvaana08
May 21, 2020

మనవల్ల కానీ హామీలు ఇచ్చేయడం...వచ్చాక ఆస్తులు అమ్మేయడం...ఆస్తులు అమ్మైనా మాట మీద నిలబడ్డాడు,మాట తప్పడు మాడం తిప్పడు అనే taglines వేసుకుని ప్రచారం చేసుకోడం...


జగనన్న రక్తం లోనే ఉంది😎

Like
bottom of page