top of page
Writer's pictureSainika Swaram

తాకట్టులో ఆంధ్రప్రదేశ్ - దొరికితే అప్పులు,దొరక్కపోతే ఆస్తుల అమ్మకాలు

ఎన్నికలు ముగిశాయి. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.కనీవినీ ఎరుగని రీతిలో 151 మంది ఎమ్మెల్యేలు,22మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు.

టీడీపీ చేసిన అరాచకాలు,అన్యాయాలు,అవినీతిని చూసి ప్రజలు వైసీపీ కి పట్టం కట్టారు.మరి వైసీపీ ప్రభుత్వ పనితీరు మాత్రం జనరంజంగా లేదు.గత మూడు,నాలుగు నెలలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దుస్థితిలో ఉంది. ఇప్పటికే ఒకసారి ఓవర్ డ్రాఫ్ట్ లోకి కూడా వెళ్ళింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేని దుస్థితి.ఇక కాంట్రాక్ట్,ఔట్సర్శింగ్ ఉద్యోగుల జీతాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం ఉద్యోగాలు,పార్టీ కార్యకర్తలను వాలంటీర్లు గా నియమించిన వారికి జీతాలు ఇవ్వడానికి,ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాలు అమలు చేయడానికి ఆర్థిక వనరులు లేక ప్రభుత్వ భూములు అమ్మి వాళ్లకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి.


రాష్ట్రం ఈ దుస్థితికి వెళ్ళడానికి కారణాల్లో టీడీపీ పాత్ర కూడా ఉంది.


ఆర్థిక వ్యవస్థ మరీ ఇంతలా దిగాజారి పోవడానికి,పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకు పోవడానికి,కొత్త పెట్టుబడులు రాకపోవడానికి గల కారణాలు ఎంటో కాస్త విశ్లషణాత్మకంగా చర్చిద్దాం.

వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయి.


1.ఇసక :


ఒక ప్రకృతి వనరు. గత టీడీపీ ప్రభుత్వం ఇసకను ఉచితం చేశారు. కానీ ఉచితం పేరు మీద పక్క రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేశారు. నదులను, వాగులను,వంకలను ఏవి వదలకుండా దోచినంత దోచుకున్నారు. ఆ ఇసకే టీడీపీ పతనానికి ఒక కారణం అయింది. టీడీపీ అవినీతి నుండి కాపాడతారు అని 151 మంది ఎమ్మెల్యే లను గెలిపిస్తే. వీళ్ళు ఉచితంగా ఇసక దొరక్కుండా,ఇసక తవ్వనివ్వకుండా చేశారు. సుష్పష్టమైన విధివిధానాలు పెట్టీ పాలసీ తీసుకురావడం చాలా ఆలస్యం చేశారు.నేటికీ ఇసక దొరకడం లేదు. దాని ప్రభావం నేరుగా 35 లక్షలు పైగా రోజువారీ కూలి మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికుల పైన పడింది. రాష్ట్రం మొత్తం నిర్మాణాలు ఆగిపోయాయి. ఇసక లేకుంటే నిర్మాణాలు ఎలా జరుగుతాయి? దాని ప్రభావం దాదాపు సిమెంట్,ఇనుము,ఉక్కు లాంటి పెద్ద పెద్ద వ్యాపారాల మీద పడింది. నిర్మాణాలు లేక వాటిని కొనడం ఆపేశారు దాంతో రాష్ట్రం ఆర్థికంగా కూడా కొన్ని వందల, వేల కోట్లు నష్టపోయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇసక మీద దాదాపు 40 రకాల పరిశ్రమలు, కార్మికులు ఆధారపడి ఉన్నారు. ఈ కార్మికులు అందరూ దాదాపు 80 లక్షల నుండి కోటి మంది ఉన్నారు. ఉదాహరణకు 30 లక్షల మంది రోజు వారి కూలి ఒకరికి 300 అనుకుంటే 30లక్షలుx300=90 కోట్లు. ఈ కార్మికులు అందరూ రోజుకూలి మీద బతుకుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. ఏ రోజుకు ఆరోజు ఖర్చు పెడతారు. ఆ లెక్కన 30 లక్షల మంది కార్మికులు కేవలం ఒకరోజు పెట్టే ఖర్చు దాదాపు 90 కోట్లు.అదే నెలకు ఎంత?ఐదు నెలలకు ఎంత ఉంటుంది?ఇది కేవలం ఒక చిన్న అంచనా అంతే. పని లేక డబ్బులు లేక కొనుగోలు చెయ్యక ప్రభుత్వానికి ఆదాయం గండి పడింది. అదే కోటి మందికి లెక్క వేస్తే ఎంత ఉంటుంది. ఇదంతా ఒకవైపు అంటే దాని అనుబంధ రంగాల్లో వ్యాపారాలు జరగక ఎన్ని వేల కోట్లు నష్టం వచ్చుంటుంది? ఇదంతా ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపించింది.కాబట్టే గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆదాయం 16% నుండి 5% పడిపోయింది.ప్రజలకు కొనుగోలు శక్తి ఉంటేనే ఏ దేశానికైనా, రాష్ట్రానికి అయిన టాక్స్ ల రూపంలో ఆదాయాలు వచ్చేది,వైసీపీ ప్రభుత్వం నిర్ణయాల వలన అసలు ప్రజలకు సంపాదించుకునే అవకాశాన్ని లేకుండా చేశారు.మరి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టగలరు? ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? కేవలం ఇదంతా ప్రభుత్వం వైఫల్యం. సరైన మార్గదర్శకాలు జారీ చెయ్యకుండా,ఇసకను అనునూయల చేతుల్లో పెట్టడానికి ఆలస్యం చేశారు. ఇప్పటికీ ఇసక దొరకడం లేదు. దాదాపు 50 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా గాని వైసీపీ నాయకులు అక్రమంగా పక్క రాష్ట్ర లకు తరలిస్తున్నఇటీవల టీవీ ఛానెల్స్ కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.


2.రాజధాని పై నిలకడలేనితనం:


ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి రాజధాని మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. రాజధాని మార్చడానికి అవకాశముందని,రాజధానిగా ఉండడానికి ఆ ప్రాంతం అనుకూలం కాదని మీనిస్టర్లు,ఎమ్మెల్యే లు వరుస ప్రెస్ మీట్లు పెట్టీ మరీ చెప్పారు. వీటిని బలపరుస్తూ బడ్జెట్ లో రాజధానికి కేవలం 60 కోట్లు మాత్రమే కేటాయించారు. దాని కారణంగా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింది. విజయవాడ రాష్ట్రంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే నగరం,అలాంటి నగరంలోనే రెవెన్యూ ఆదాయాలు పడిపోయాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..అలాంటి అనాలోచిత ప్రకటనల వలన రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది,రిజిస్ట్రేషన్ల ఆగిపోయి ప్రభుత్వానికి ఆదాయానికి గండి పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలు అయిపోయింది.


3.ఆలోచన లేని పాలసీలు/విధానాలు:


రాజధాని మీద ఎప్పుడైతే నీలి నీడలు కమ్ముకున్నాయో అప్పటి నుండి ఒక్కో ఒక్కో కంపెనీ పెట్టుబడులు వెనక్కు తీసుకెళిపోతున్నాయి. ప్రపంచ బ్యాంక్,ఆసియన్ బ్యాంక్ లు ఆర్థిక సహకారాన్ని ఉపసంహరణ చేయడం,PPA ల పైన అనవసర రాద్దంతాలు,కేంద్రం వద్దు అంటున్నా వినకుండా రద్దు చెయ్యడం,నియంతల వ్యవహరించడం, రివర్స్ తెండేరింగ్ అని ఆల్రెడీ అప్పగించిన కంపెనీల నుండి అనునూయలకు అప్ప చెప్పడం. ఇలాంటివి అన్ని విదేశీ,స్వదేశీ వ్యాపార సంస్థలను ఆలోచింప చేశాయి. అభద్రత,నిలకడ లేని చోట వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టవు. నమ్మకం లేని ప్రభుత్వంతో MoU జరపరు. కాబట్టే ఇంతవరకు ఒక కంపెనీ కూడా సుముఖత చూపలేదు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల్లో స్థానికులకు 75% ఇవ్వాలి అనడం అతి పెద్ద తప్పు. దాని వలన పెట్టుబడులు రావు. వచ్చినవి కూడా తిరిగి వెళ్లిపోతున్నాయి,చాలా కంపెనీలు వెళ్లిపోయాయి. గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం, వాళ్ళ కట్టడాలు కూల్చడం ఇవన్నీ ఆలోచింప చేస్తాయి. సింగపూర్ ప్రభుత్వం, ఆదాని గ్రూప్,రిలయన్స్ సంస్థ,ఆసియా పల్ప్ &పేపర్ పరిశ్రమ,దుబాయ్ లులు సంస్థ ఇలాంటి ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు వెనక్కు తీసుకున్నాయి.ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యమే.


4.అనవసర ఖర్చులు:


నేను రూపాయి సీఎం,ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకుంటాను అని చెప్పిన సీఎం గారు ఎన్నికలకు ఆర్నెల్లు ముందు గృహ ప్రవేశం చేసిన తన ప్రైవేట్ ఇంటికి కిటికీలకు,బాత్రూం లకు,ప్రహరీ గోడలకు,రోడ్డు తదితర వాటి కోసం 16 కోట్ల ప్రజాధనాన్ని సాంక్షన్ చేసుకున్నారు. అసలే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం దానికి తోడు ఇలాంటి ఖర్చులు. కేవలం రేషన్ బియ్యం కవర్ల కోసం 750 కోట్లు పెట్టారు దేనికి ఇవన్నీ? ఎన్నికలకు ముందు పార్టీ కోసం పని చేసిన వాళ్ళను క్రమంగా ప్రభుత్వ పదవులు కట్టబెట్టడం వాళ్లకు కేబినెట్ హోదా ఇవ్వడం. ఐఏఎస్ అయ్యి అంత్యంత అనుభవం ఉన్న CS గారికేమో 2 లక్షలు కూడా జీతాలు ఉండవు కానీ ఏమి తెలియని వాళ్లకు కేబినెట్ హోదాలు నెలకు 4 లక్షల జీతాలు. ఇది వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చులు. ప్రభుత్వ పథకాలు సంబంధించి ప్రకటనలు రాష్ట్రం వరకే ఇస్తారు కానీ ఈ సీఎం గారు మాత్రం తెలంగాణ ఎడిషన్ సాక్షి పేపర్లో ప్రకటనలు ఇవ్వడం,దోచుకోడానికి అదొక మార్గం. విజయవాడలో ఎమ్మెల్యే లు ఉండే ఇళ్లకు బాడుగ నెలకు అక్షరాల లక్ష రూపాయలు. వ్యక్తిగత పర్యటనలకు ప్రభుత్వం సొమ్ము ఖర్చు చెయ్యడం.

అసలే కష్టాల్లో ఉన్నాం అని యే ఒక్కరైనా ఆలోచించారా?దాదాపు ప్రతి ఎమ్మెల్యే స్వంత వ్యాపారాలు చేస్తున్నారు. ఇలా గత ప్రభుత్వానికి యే మాత్రం తీసిపోకుండా ఈ ప్రభుత్వం కూడా నడుస్తోంది.


5.ఓటు బ్యాంక్ కోసం పనికి రాని పథకాలు:


ఎన్నికలకు ముందే ప్రజలను ఆకర్షించడానికి ఏవేవో లబ్ది చేర్చే పథకాలను ప్రకటించారు.45 ఏళ్లకు పెన్షన్,ఆడవాళ్ళకు 75 వేలు ఇవ్వడం లాంటివి ఎందుకు ఇస్తారో కూడా చెప్పడం లేదు. రాష్ట్రం మొత్తం దాదాపు 4.5 లక్షల వాలంటీర్లు నెలకు 8 వేల జీతాలు ఇచ్చి తమ సొంత పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారు. అసలు దేనికి ఉపయోగం లేని వాలంటీర్లకు బడ్జెట్ లో దాదాపు 1500 కోట్లు కేటాయించారు కానీ రాజధానికి మాత్రం 60 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది ఏమి తెలుపుతోంది అంటే రాజధాని,రాష్ర్ట భవిష్యత్తు కంటే ఎలాగైనా సరే తమ పార్టీ అధికారంలో ఉండాలి. ఆటో వాళ్లకు 10 వేలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు,పెన్షన్ నెమ్మదిగా పెంచుకుంటూ 3000 చేస్తాం అన్నారు,యే రాష్ట్రం లోని సామాజిక పెన్షన్ లు ఇంతేసి ఇవ్వడం లేదు. కేవలం తమ లబ్ది కోసం హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయడానికి ఎక్కువ వడ్డీకి అప్పులు చెయ్యడం,అప్పులు కుదరకపోతే ఆస్తులు అమ్మడం. ఇదే ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలిసినది. పాస్టర్ లకు జీతాలు ఇవ్వడాలు, జేరుసెలం వెళ్ళడానికి చేసే ఆర్థిక సహాయాన్ని 20 వేలు పెంచుతూ G.O వదిలారు. కంచం నిండా పెడతాము,కంచాన్ని తెచ్చుకోండి అని చెప్పారు ఈరోజు అక్కడా,ఇక్కడా అడుక్కొచ్చి ప్రజల పళ్ళెం లో పెడుతున్నారు. మరి రేపటి సంగతి ఎంటి?ఇంకా అమ్మఒడి,కాలేజ్ పిల్లలకు 20 వేలు లాంటివి ఉన్నాయి. వాటికి డబ్బులు ఎక్కడ నుండి తెస్తారు? మళ్లీ అప్పులో,ఆస్తులు(ప్రభుత్వ) అమ్మడాలో చెయ్యాలి. ఇలా ఎంతకాలం? రోజు రోజుకు పరిస్థితి దిగజారుతూనే ఉంది. పథకాలు అన్నీ అమలు చెయ్యడానికి చాలా డబ్బు కావాలి ఎక్కడ నుండి తెస్తారు? ఇవేమీ ఆలోచించకుండా ఓట్లేసి గెలిపించారు.


6.సీఎం గారి ప్రొఫైల్:


సీఎం గారు 31 కేసుల్లో నిందితుడు. దేశ విదేశాలలో సూట్ కేస్ కంపెనీలు పెట్టారు,న్యాయ చట్టం లోకి ఈయన గారి కేసులు పాఠాలు పెట్టారు అంటే పరిస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు. క్విడ్ ప్రో కో ల ద్వారా అవినీతి చేశారని సీబీఐ, ఈడి శాఖలే చెప్తున్నాయి. ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి,దానికి అదనంగా 60 లక్షలు ఖర్చు.ఈయన్ను నమ్ముకుని కంపెనీలు ఎలా వస్తాయి? రేపటి రోజున సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే? దీర్ఘకలంపాటు బెయిల్ మీద ఉన్న నిందితులను అందరి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టుకు చెప్పారు,మరి బెయిల్ రద్దు అయితే వైసీపీ అధ్యక్షుడు జైలుకు వెళ్ళక తప్పలేదు. ప్రభుత్వం నిలబడుతుందా?సీఎం గారే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే రాష్ర్టంలో పెట్టుబడులు ఎలా వస్తాయి?ఆర్థిక నేరాల్లో విదేశాల నుండి భారత ప్రభుత్వానికి నోటీసులు ఇప్పించిన చరిత్ర పెట్టుకుని పెట్టుబడులు రమ్మంటే ఎలా వస్తాయి? ఒక స్థిర ప్రభుత్వం లేని రాష్ట్రానికి పెట్టుబడులు రావు. ఎవరైనా మన రాష్ర్టంలో,దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకం ఉండాలి,కానీ ఆ నమ్మకం ఈరోజు వైసీపీ ప్రభుత్వం మీద లేదు. ఇంట్లో ఆదాయం తక్కువ ఉన్నప్పుడు ఖర్చులు కూడా తగ్గించి పెట్టుకుంటాం,అదేంటో గత టీడీపీ ప్రభుత్వం ఎలా దుబారా చేశిందో,ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా దుబారా చేస్తోంది,కానీ విధానాలలో కాస్త తేడా అంతే.


ప్రజలకు కావలసింది ప్రభుత్వం ఇచ్చే తాయిలాలు,పనికి రాని పథకాలు కాదు. ఉద్యోగాలు,వాటికి సరిపడ్డ నైపుణ్యం అందించే మంచి కళాశాలలు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి,జనాలు కొనుగోలు శక్తి పెరుగుతుంది. రాష్ట్రానికి పన్నులు వస్తాయి. ఇవేమీ ఆలోచించకుండా హామీలు ఇవ్వడం,ప్రజలను సోమరిపోతులను చెయ్యడం. ఓట్ల కోసం అనవసర హామీలు ఇవ్వడం,వాటిని నెరవేర్చడానికి అయితే తాకట్టు పెట్టడం లేదా ఆస్తులు అమ్మడం

589 views0 comments

Comments


bottom of page