స్వచ్చమైన ప్రకృతికి జీవ వైవిధ్యానికి నిలయం నల్లమల అడవులు.
ఈ అడవులు అనేక రకాల జీవజాతులకు,సహజ వనరులకు, ఎర్రచందనం వంటి వృక్షాలకి,ఔషధ సంపదకు నెలవుగా విలసిల్లుతున్నది. అంతే కాకుండా పెద్ద పులులకు సురక్షిత స్తావరంగా ఉన్నది. ఒక రకంగా నల్లమల అడవిని తెలంగాణ అమెజాన్ గా పిలుస్తారు.. ఈ అటవీ ప్రాంతంలో అనేక మంది కోయ జాతులు, గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. ప్రకృతికి నిలయమైన ఈ అడవిపై మైనింగ్ మాఫియా పడగ విప్పింది. పర్యావరణాన్ని రక్షించే ఈ నల్లమల అడవిలో కాలుష్యం అలముకుంది
యురేనియం తవ్వకాల వలన"అణు ధార్మికత " వల్ల కోల్పోయేది ఆకుపచ్చటి అడవి, ఆదివాసీ గిరిజనుల మనుగడ &ఆరోగ్యం వన్యమృగాల ఉనికి.
గాలి &నీరు కలుషితం అవుతుంది.
దీని వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. దీని నుండి వచ్చే వ్యర్దాల వలన చెరువులు, బోర్లలో ఉండే జలాలు కలుషితమవుతున్నాయి.. కలుషితమయ్యే నీటిని అక్కడ ప్రజలు తాగడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.
ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో బోర్ డ్రిల్లింగ్ చేయతలపెట్టిన ప్రాంతాలు పెద్ద పులులు తిరిగే కోర్ ఏరియా గా పేర్కొంటారు.. ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తే పెద్ద పులుల మనుగడకు కూడా ప్రమాదమే. వాస్తవానికి డ్రిల్లింగ్ చేయ తలపెట్టిన ప్రాంతాలు కృష్ణానది, డిండి ప్రాజెక్ట్ కాల్వలకు ఆనుకుని ఉంటాయి. బోర్ డ్రిల్లింగ్ వల్ల సహజ అడవి దెబ్బతింటుంది. దీనికి ఖచ్చితంగా వారు Forest Conservation Act కింద అనుమతి తీసుకోవాల్సిందే. బోర్ డ్రిల్లింగ్ వల్ల అభ్యరణ్యాన్ని ఆనుకుని ప్రవహించే కృష్ణానది సైతం విషతుల్యంగా మారే ప్రమాదముంది..
మన దేశంలో యురేనియం నిల్వలు సగానికి పైగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 1,22,570 టన్నుల నిల్వలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 15,731 టన్నుల నిల్వలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లోని కడప జిల్లా, వేముల మండలం , M తుమ్మపల్లి లో భారత యురేనియం సంస్థ ( UCIL ) జరుపుతున్న తవ్వకాలు, నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ కర్మాగారం స్థానిక ప్రజలకి పెను విషాదాన్ని కలిగిస్తున్నాయి.ఈ పరిశ్రమకి 2007 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అసాధారణ స్థాయిలో నిర్లక్ష్యం.
అక్కడ బోర్లలోని pollution control Board చేయించిన పరీక్షలో తేలిన అంశాలు. అణుశక్తి నియంత్రణ మండలి ప్రకారం తాగునీటిలో 60 ppb (parts per billion) కంటే మించరాదు. కానీ ఇక్కడ 690 ppb నుండి 4000 ppb వరకు ఉంది. ఇది జీవ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఇక్కడ నీటిలో అధిక క్షరత్వం,కాఠిన్యం, మెగ్నీషియం, సల్ఫేట్, నికెల్ , క్రోమియం వంటి వాటితో పాటు అధిక మొత్తంలో ఘన వ్యర్దాలున్నాయి.. అక్కడ బోర్ల నీటిలో వుండే మూలకాలు కింది విదంగా ఉన్నాయి.
లీటర్ నీటికి ఉండాల్సిన పరిమితులు మూలకం ఉండాల్సిన ప్రస్తుతం పరిమితి grams.లో ఉన్నది ◆క్రోమియం ౼ 0.05 0.10 ◆నికెల్. ౼ 0.02 011 ◆సల్ఫేట్లు. ౼ 200 909 ◆అధిక క్షారత్వం ౼ 200 604 ◆కాఠిన్యం. ౼ 200 292 ◆ఘన వ్యర్థాలు ౼ 500 2,045
వివరాల ప్రకారం పై విధంగా ఉన్నాయి.
◆అక్కడ రైతుల చెప్తున్న వివరాల ప్రకారం యురేనియం మైనింగ్ వల్ల దాని వల్ల కలిగే పర్యవసానాలు కింది విధంగా ఉన్నాయి.
◆ భూగర్భ కాలుష్యం వల్ల మా భూములు సాగుచేసుకోలేక పోతున్నాం. ◆ ఇది వరకు అరటి తోటలు బాగా వేసేవాళ్ళు.అది ఇప్పుడు యురేనియం మైనింగ్ వల్ల నీరు విషతుల్యమై పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. ◆ ఒకప్పుడు లక్షల్లో ఆదాయం వచ్చిన పొలాలు ఇప్పుడు బీడు భూములుగా మారుతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ◆ నీరు విషతుల్యం కావడం వలన నేల సారం బాగా దెబ్బతిని తర్వాత వేసే పంటలు ఎదుగుదల లేకుండా దిగుబడి తగ్గుతుంది.
యురేనియం కాలుష్యం వల్ల వచ్చే అనర్థాలు.
◆ యురేనియం గాఢత ఎక్కువ ఉన్న నీరు మనుషులకే కాదు జంతువులు తాగడానికి కూడా పనికిరాదు.. మనుషులకి మూత్రపిండాలు దెబ్బతింటాయి.నపుంసకత్వం సంభవిస్తుంది. చర్మవ్యాధులు వస్తాయి. ◆ నీటిలో ఘన పదార్థాలు కరిగి ఉండటం వల్ల దాన్ని తాగితే మూత్రపిండాలు పాడైపోతాయి. ◆ నీటిలో వుండే అధిక క్షారత్వం వలన దాన్ని ఉపయోగించిన భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. నేల గట్టిపడి మొక్కలని పెరగనివ్వదు. ◆ క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఆ భూమిలో పెరిగిన మొక్కలు పోషకాలను సరిగా తీసుకోలేవు. ◆ యురేనియం కలిగిన నీళ్ల వలన చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు సంభవిస్తాయి.
దుష్ప్రభావాలు.
◆ 1940 లో హిరోషిమా, నాగసాకి ల మీద అణుబాంబు ప్రభావం వల్ల ఇప్పటికి అక్కడ జనం కొలుకోలేదు. ◆ 1980 లో రష్యాలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది. ◆ ఈ యురేనియం రేడియేషన్ 4,5 వేల సంవత్సరాలైన ఉంటుంది. ◆ యురేనియం శుద్ధి వలన విషం వెదజల్లబడుతుంది. దీని ప్రభావం 50 నుండి 60 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది.
ఇప్పటికైన అధికారులు మేల్కొని యురేనియం మైనింగ్ ని తక్షణమే ఆపాలి.
Comments