జనసేన పార్టీ స్థాపించి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సంధర్భంగా ఈ ఆరేళ్ళ ప్రయాణంలో జనసేన సాధించిన విజయాలేమిటో ఓసారి చూద్దాం.
ఎన్నికల ఫలితాల పరంగా అయితే విజయాలేమీ లేవు ఇప్పటివరకూ,
ప్రజల తరఫున ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఎన్నో విజయాలు సాదించింది,నాటి ఉద్దానమ్ నుండి నేటి సుగాలీ ప్రీతి కేసు వరకూ...పోరాడడానికి పదవులు అక్కర్లేదు అని నిరూపించింది.ఇది మనందరికీ తెలిసిన విషయమే...
కానీ జనసేనకి మాత్రమే సొంతమైన విజయాలు ఏమిటీ?? ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి,నవ శక రాజకీయానికి నాంది పలికిన జనసేన తన తొలి అడుగుల్లో ఆ లక్ష్యం దిశగా ఎంతవరకూ వచ్చింది?
పరిశీలించి చూస్తే జనసేన సాధించిన విజయాలు ఆషామాషీవి ఏమీ కావు
1.రాజకీయ చైతన్యం
ఎంతో మంది యువతకి రాజకీయ చైతన్యం కలిగేలా చేసింది,సమాజం పట్ల బాధ్యత కలిగేలా మార్చింది.ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది.పాలకుల నిర్లక్ష్యానికి కొన్ని తరాలుగా సమాజం ఎలా భ్రష్టు పట్టిపోయిందో,తాత్కాలిక అవసరాలతో పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల వల్ల భవిష్యత్ తరాలు ఎలా నష్టపోతున్నాయో గ్రహించేలా చేసింది. ఈ కుళ్లుని కడగడానికి తమ పరిధిలో తాము కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన యువతకి కలిగించింది.స్వార్ధ రాజకీయ నాయకులు ఆడే వికృత క్రీడలో ప్రజలు ఎలా బలి అవుతున్నారో ఒక తరానికి తెలిసొచ్చింది.
2.Voice Of Unheard - బలహీనుల గళం
రాజకీయ పార్టీల సమావేశాలు అంటే,కేవలం నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు, ఖచ్చితంగా మాట తప్పే హామీలు,పర్యటనలు అంటే హడావిడిగా సాగే ఆర్భాటాల హోరు. కొన్ని దశబ్ధాలుగా రాజకీయాలు ఇలానే ఉన్నాయి. కానీ జనసేన పార్టీ ప్రజల గొంతుక అయ్యింది..అణచబడిన ప్రజలకి ఒక బలమైన గొంతుకని ఇచ్చింది.సమాజం చేత విస్మరించబడిన వర్గాలకి ఒక వేదికని ఇచ్చింది,వారి సమస్యలు వారి వెతలు,వేదనలూ, చెప్పుకునే ఒక ప్లాట్ఫాం ని తయారు చేసింది. ఇన్నేల్లైనా మా బతుకులు ఇంకా ఇలానే ఎందుకున్నాయి అని ఏళ్లుగా తమలో దాచుకున్న ఆవేదనని,కోపాన్ని ప్రభుత్వాల చేతకాని తనాన్ని నిలదీసేందుకు ఒక బలమైన వేదికని అందించింది.ప్రభుత్వాలు ప్రజల మెడ చిన్న చూసి విసిరే ముష్టి కాదు మాకు పాతిక సంవత్సరాల భవిష్యత్ కావాలి అని నిర్భయంగా నినదించే ధైర్యాన్ని ఇచ్చింది.
ఒక సామాన్య మధ్య తరగతి గృహిణి బయటకి వచ్చి సమాజం గురించి రాజకీయాల గురించి మాట్లాడే ధైర్యం ఏ పార్టీ ఇచ్చింది ఇదివరకు? జనసేన ఇచ్చిన ధైర్యం అది.
సమాజం చేత వెలి వేయబడ్డాము అనే భావనలో ఉన్న ఒక కులని చెందిన వ్యక్తి,ఇది మా దుర్ద్భర పరిస్తితి మా బతుకులు ఇవీ అని బయటకి వచ్చి ప్రపంచానికి తెలిసేలా చెప్పే వేదిక ఇచ్చింది జనసేన మాత్రమే.
ప్రజలని కేవలం ఓటర్లుగా మాత్రమే చూసే పార్టీలు ఉన్న ఈ కాలంలో ప్రజలని మనుషులుగా చూసిన ఏకైక పార్టీ జనసేన.
3.నవ శక రాజకీయం – యువ నాయకత్వం
పదవులు,అధికారమే లక్ష్యంగా అజెండాగా డబ్బులే అస్త్రాలుగా సాగే ఎన్నికల క్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే తమ అజెండాగా zero budget politics చేసి ఇరవై లక్షల ఓట్లు పొందడం అంత ఆషామాషీ విషయం కాదు..ఒక పెను మార్పుకి ఇది మొదటి అడుగు.
యువ నాయకులు అంటే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారే అనే అపోహని బద్దలు కొడుతూ సమాజం మీద భాద్యత ఉంటే చాలు మనలో ఎవరైనా నాయకులు అవ్వోచ్చు అని రుజువు చేసింది,ఒక సాధారణ రైతు,ఒక కండక్టర్ బిడ్డ,ఒక గృహిణి,ఒక విధ్యార్ధి నాయకుడు ఇలా ఎలాంటి రాజకీయ నేపధ్యం లేని వారినికూడా నాయకులుగా నిలబెట్టింది జనసేన.
ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల సమరంలో తలలు తెగిపడేలా హత్యా కాండ నడుస్తున్నా కూడా,ఘనత వహించిన రాజకీయ పార్టీలు,కాకలు తీరిన రాజకీయ నాయకులు కూడా దనుజఘన దాష్టీకానికి భయపడి తోకలు ముడుస్తుంటే,అతి సామాన్యులు,దిగువ మధ్య తరగతి కుటుంబాలకి చెందిన వ్యక్తులు జనసేన నుండి నిర్భయంగా పోటీ చేస్తున్నారు..నిజాయితీకి ఉన్న ధైర్యం అది..ఆ ధైర్యం జనసేన..
సమాజం చేత విస్మరించబడిన సమూహాల నుండి నాయకులని తయారు చేస్తాను అని చెప్పిన పవన్ కల్యాణ్ మాటకి,ఆ మాట నిలబెట్టుకుంది జనసేన అనడానికి ఇదే నిదర్శనం.
ఒక సుధీర్ఘ ప్రస్థానానికి నాయకులను మనలోనుంచే తయారు చేస్తుంది,సామాన్యులు అతి బలవంతులని ఢీకొట్టే అవకాశాన్ని ఇస్తుంది. ఇంతకు మించిన విజయం ఏముంటుంది?
సంప్రదాయ రాజకీయపార్టీలు మూకుమ్మడిగా భ్రష్టు పట్టించిన వ్యవస్థకి వైధ్యం చేయగలిగేది జనసేన మాత్రమే అని భరోసా ప్రజల్లో కలుగుతుంది,అది ఓటు రూపంలో మారేందుకు సమయం పట్టొచ్చెమో కానీ మార్పు తద్యం - అనివార్యం.
Comments