తాత్కాలిక తాయిలాలతో ప్రజలను సోమరిపోతులను చేస్తూ ఎప్పటికప్పుడు ఏమారుస్తూ ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకొని పబ్బం గడుపుకునే ఫక్తు సాంప్రదాయ రాజకీయ పార్టీలకి, ప్రజలని చైతన్య పరుస్తూ,వారి హక్కుల్ని గుర్తు చేస్తూ సిద్దాంత పరమైన విధానాలతో రాజకీయమ్ చేసే పార్టీలు పరమ విరోధులు. ఇటువంటివారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తుద ముట్టించాలనే ఆరాటం ఉంటుంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ జనసేన పార్టీపై అవలంబిస్తున్న విధానాలు ఒక ఉదాహరణ .
ఎన్నికలు ముగుసి ఏడు నెలలు కావస్తుంది.కనీ వినీ ఎరగని ఆధిక్యంతో అధికార స్థానాన్ని కైవసం చేసుకుంది వైసీపీ.ఇంతటి ఘన విజయం స్వయం కృషి ఫలితమే అయితే కేవలం ఒకేఒక్క సీటు వచ్చిన జనసేనని కనీసం పరిగణలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు.కానీ మొదటి రోజు నుండీ వైసీపీ నాయకత్వం మొదలుకొని కార్యకర్తల వరకూ జనసేన లక్ష్యంగా తీవ్రమైన దాడులు చేస్తూ వస్తున్నారు.వారి లక్ష్యం ఒక్కటే, ప్రజలకి ప్రత్యామ్నాయం ఉండరాదు అని.ఎల్లకాలం తమ దోపిడీ విధానాలే కొనసాగాలి అని.అందుకోసం ఎంతకైనా తెగించే ఘనులు వైసీపీ వారు.జనసేన లక్ష్యంగా చేసుకొని వారు వేసుకున్న ప్రణాళికలు బహుశా జనసేన కూడా తమ మీద తాము అంతగా రూపొందించుకొని ఉండదు.
వైసీపీ సామ ధాన భేద దండోపాయాలను ఉపయోగించి మరీ జనసేన విచ్ఛిన్నానికి కుట్ర పన్నుతుంది.జనసేన పార్టీని జనసైనికులని అష్ట దిగ్భందన దాడి చేస్తూ తన శిఖండి రాజకీయం మొదలు పెట్టింది.
మొదటగా
కీర్తి – జనసేనకి ఉన్న మంచి పేరుని,జనసేనాని పవన్ కల్యాణ్ కి ఉన్న మంచి పేరుపై బురద జల్లడం
ఎన్నికల ఫలితాలు వెలివడిన నాటి నుండి నేటి వరకూ జనసేన పై బురద జల్లే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది.ఫలితాలు ముగిశాక ఘోర పరాభవం, ఇక పార్టీ మనుగడ ఉండదూ అని,ప్రజల్లోకి వస్తే తెలుగుదేశం బీ టీం అని,ప్రజల పక్షాన పోరాడితే పనికిరాని పోరాటాలనీ బురద జల్లుతూనే వస్తుంది.అవాస్తవ కథనాలని తమ అనుకూల మీడియాతో ప్రసారం చేయిస్తూ, విష ప్రచారం చేస్తూ సాధ్యమైనంతగా జనసేన చేస్తున్న మంచిని ప్రజల్లోకి వెళ్లకుండా ఆపుతుంది.
వాస్తవాలని చూపకుండా ఉంటూ నిజాల్ని దాయడం ఒక ఎత్తు అయితే,జనసేనాని చేసే ప్రసంగాలకు వక్ర భాష్యం చెబుతూ, విపరీతార్ధాలు తీస్తూ అసలు భావం వెనక్కి నెట్టి లేని అర్ధాన్ని తీసుకొచ్చి దానిపై అనవసర చర్చలూ,రాద్ధాంతాలూ చేస్తూ ప్రజల్లో జనసేనాని పై వ్యతిరేకత తెప్పించడం కోసం అహో రాత్రాలు కష్టపడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలలోని హిందూత్వం అంశం పైనా,అత్యాచార నేరస్తులకి కేనింగ్ తరహా శిక్షల పైనా,తెలుగు మాధ్యమ రద్దు పై పవన్ కల్యాణ్ వైఖరి పైనా వైసీపీ ప్రచారం చేసిన విపరీత వికృత అర్ధాలే ఇందుకు తార్కాణం.
ఎన్నికల్లో ఓటమి చెందినా పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో ఉన్న మంచి పేరు ఏనాటికైనా తమకి తీవ్ర ఇబ్బంది కలిగించవచ్చని భావించే సేనానిపై బురదజల్లుతూ వెళుతుంది వైసీపీ.
బలం పై దెబ్బ కొట్టి బలహీనుల్ని చేయడం
ఇతర పార్టీల బలం వచ్చిపోయే నాయకుల మీద,వారు తెచ్చి పెట్టె కోట్ల రూపాయిల డబ్బు మీద ఆధారపడి ఉంటుంది.కానీ జనసేన బలం నిస్వార్ధంతో సమాజంలో మార్పుని కాంక్షింస్తూ జనసేనాని అడుగుజాడల్లో నడిచే జనసైనికుల్లో ఉంటుంది.ఇది జగమెరిగిన సత్యం,జగనెరిగిన వాస్తవం అందుకే ఆ బలాన్ని దెబ్బ కొట్టేందుకు సిద్దమైంది వైసీపీ,జనసైనికుల ఆత్మ స్థైర్యం దెబ్బతినెలా పదే పదే తమ నాయకుల చేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకరమైన రీతిలో విమర్శలు చేయిస్తూ దానికి ప్రతిగా ఎవరైనా జనసైనికులు స్పందిస్తే వారిపై చట్టపరమైన కేసులంటూ వారిని ఇబ్బందుల పాలు చేస్తుంది.ప్రభుత్వ అసమర్ధతని, నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించినా కూడా అధికారముందనే అహంభావంతో వారిని కేసుల్లో ఇరికిస్తూ తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇది ఒక రకమైన దాడి.
రక్తపాత రాజకీయాలు వైసీపీకి కొత్తేమ్ కాదు,తమకి ఎదురించి ఎవరు నిలిచినా వారిపై ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగట్టే ఘనులు వైసీపీవారు.గ్రామ స్థాయిలో వైసీపీ ఆగడాలను నిలదీసే వారిపై ప్రత్యక్ష దాడులకి దిగుతూ ఒకవైపు,బెదిరిస్తూ ,హెచ్చరికలు జారీ చేస్తూ మరోవైపు తమకి ఎవరూ ఎదురు నిలవకుండా చేస్తుంది.
జనసైనికుల భావోద్వేగాలతో చెలగాటం
జనసేన కార్యకర్తలు ఎక్కువగా యువతే.వీరి ఆత్మస్థైర్యం దెబ్బ తీయడమే ప్రధాన లక్ష్యంగా వైసీపీ అనుకూల మీడియా,వెబ్ పోర్టల్స్ పని చేస్తూ ఉన్నాయి.ప్రభుత్వ అసమర్ధతని వెలుగులోకి తీస్తూ,ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపుతున్న జనసైనికుల దృష్టిని మరల్చి వారిని మానసికంగా బలహీనుల్ని చేయడమే వారి ప్రాణాళిక. అందుకనుగుణంగా జనసైనికుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసేలా పవన్ పై వక్తిత్వ హననం చేసే కథనాలు, చర్చలూ, పవన్ కల్యాణ్ ప్రసంగాలను ఫాబ్రికేట్ చేయడం,అవాస్తవాలను ప్రచారం చేయడం చేస్తున్నారు. జనసైనికులు వెనువెంటనే వాటికి ప్రతి విమర్శలు చేస్తూ లేదా వాస్తవాలను వివరిస్తూ వెళుతున్నారు.అప్పటి వరకూ ప్రభుత్వ అసమర్ధతపైన దాడి చేస్తూ వస్తున్న జనసైనికులు ఈ విష ప్రచారాల వల్ల స్వీయ రక్షణ చర్యలు చేపడుతూ ఉన్నారు.ఒక రకంగా సేనాని పై వస్తున్న అవాస్తవాలను తిప్పికొడుతున్నా కూడా తాము చేసే పని నుండి దృష్టి మరల్చబడ్డారు. ఆ రకంగా వైసీపీ పాచిక పారినట్లే .
శ్రేణులని భయాందోళనలోకి నెట్టడం
సామ ధాన బేధ దండోపాయాలను ఉపయోగించైనా జనసేన శ్రేణులని భయ భ్రాంతులకి గురిచేయాలని వైసీపీ బలంగా నిర్ణయించుకుంది.సభ జరిగితే వాటికి అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూ,సరైన రక్షణ చర్యలు చేపట్టకుండా ఇబ్బందులు కలిగిస్తూ ఒక వైపు,మరోవైపు ఒక సభ జరిగినా లేదా జనసేన ప్రత్యక్ష పోరాటం ఏవైనా జరిగిన వెంటనే వాటి తాలూకా పాజిటివిటీని ఎక్కువ సేపు ఉంచకుండా ఏదో ఒక విష ప్రచారంతోనో,లేదా వైసీపీ నాయకుల దిగజారుడు విమర్శలతో ముందుకొస్తుంది.ఆ నాయకుడు వెళ్లిపోతున్నాడు,ఈ ఎమ్యెల్యే పార్టీ మారతాడు,జనసేన ఖాళీ అవుతుంది,ఫలానా పార్టీలో విలీనం అవుతుంది, పవన్ సినిమాలు మొదలవబోతున్నాయి,అంటూ ఎప్పటికప్పుడు జనసేన శ్రేణులని ఏదో ఒక ఆందోళనలోకి నెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.వీటి తాలూకా నిజానిజాలను చర్చించుకుంటూనో,వీటిపై వివరణ కోరుతూనో,వీటిని ఖండించమని నాయకులని,పార్టీని కోరుతూ జనసైనికులు నిమగ్నమైపోతున్నారు.
డబ్బు తనకున్న కోటానుకోట్ల డబ్బుతో వైసీపీ ఏ స్థాయిలో జనసేనపై దుష్ప్రచారం చేస్తుందో,పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులనే ఎలా లోబరుచుకుందో తాజాగా జరిగిన సంఘటనలే రుజువు.రాబోవు రోజుల్లో ఇలాంటివి మరిన్ని జరిగే అవకాశం ఉంది.
ఒకదాని వెంట మరొక దాడి చేస్తూ జనసేన శ్రేణులు,జనసైనికుల ఆత్మస్థైర్యం దెబ్బ తీస్తూ వారిని మానసికంగా కుంగదీస్తూ వారిలో లేని భయాన్ని చొప్పించడమే వైసీపీ లక్ష్యం,తద్వారా జనసేన ఉనికినే ప్రశ్నార్ధకం చేసే విదంగా వైసీపీ జనసేనపై అష్టదిగ్భందన దాడికి దిగింది.
ఈ వ్యూహాలకి ప్రతి వ్యూహాలు రచిస్తూ, అన్నిటినీ ఎదుర్కుంటూ, ఎదురునిలవడం ఎలా అనేది జనసైనికులుగా మనమే ఆలోచన చేసి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలి. దానికితగిన మీ సలహాలు సూచనలు కిందనున్న కామెంట్ విభాగంలో తెలియజేయండి.
At present Janasena & party leader Pawan kalyan going in right direction, responding to the present problems in the state.
I suggest Pawan to focus his fight on Special Category Status for AP to win the hearts of AP people.
ఎదురు దాడి అవసరం.
విడాకులు అంటే, మతం మారడం, విడాకులు తీసుకోవడం వ్యక్తిగతం అనాలి.
పవన్ నాయుడు - హిందూ కులాల మధ్య చిచ్చు పెట్టడం ఆపు జగన్ ప్రొటెస్టెంట్ అనాలి.
ముగ్గురు భార్యలు అన్న జగన్ పై పరునష్ట దావా వేసుంటే ఇంకొకరు అనాలంటే బయపడేవారు. Pk కి ఎప్పుడూ ఒకరే భార్య.
పార్టీలకు కొమ్ముకాసే anchor లతో టీవీ చర్చలు నిరూపయోగం. 99tv, మరేదైనా టీవీలలో, జనసేనపై ఆరోపణలకు ఎదురుదాడి, మన ఉద్దేశాలు చెప్తూ, తరచూ exclusive జనసేన అరగంట కార్యక్రమాలు ఉత్తమం.
సర్.. కొన్ని సూచనలు..
రోజు పార్టీ యాక్టివిటీస్ కనిపించాలి. అది జరగట్లేదు. ముఖ్యమైన సమయాల్లో జనసేన మనుషులు వాయిస్ వినిపించడంలేదు.
అందుకని..
1.అన్ని స్థాయిల్లో కమిటీలు త్వరగా వేయండి. మహిళా, యువజన, రైతు, కార్మిక, వైద్య విభాగాలు.. వాటికి అధ్యక్షుల్ని పెట్టండి.
2 నేషనల్, స్టేట్ ఇష్యూస్ వచ్చినప్పుడు నిరసనలు తెలియజేయమనండి.
3.నియోజకవర్గ ఇన్చార్జి లు స్తబ్దుగా ఉంటున్నారు. వారిని యాక్టివేట్ చేయండి. గ్రామాల్లో తిరగమనండి.
4 యువతికి ట్రైనింగ్ క్లాస్ లు పెట్టి పార్టీ సిద్ధాంతాలు, రాజ్యాంగ హక్కులు వంటివి బోధించింది
5. అధినేత రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేయాలి. వారంలో నాలుగు రోజులు షెడ్యూల్.
ఒక రోజు ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి.
ఒకరోజు పార్టీ నిర్మాణంపై దృష్టి, నియోజకవర్గ , జిల్లా అధ్యక్షులతో సమీక్ష.
ఒకరోజు కరెంట్ అఫైర్స్ పై చర్చా గోష్ఠి
ఒకరోజు పూర్తిగా కార్యకర్తలకు పూర్తిగా అందుబాటులో ఉండాలి
జగన్ ఫ్యాన్స్ కంటే pk ఫ్యాన్స్ ఎక్కువ సోషల్ మీడియాలో.
facebookలో రీచ్ ఎక్కువ
everyweek ప్రజాసమస్యలపై బలంగా ట్రెండ్ చేయాలి.
వ
మనకి ముందు పార్టీ నుంచి విషప్రచారాన్ని అతి తక్కువ సమయంలో తిప్పి కొట్టగల సామర్థ్యం ఉన్న సాంకేతిక నిపుణులు చాలా అవసరం అలాగే లీగల్ గా వెళ్ళటానికి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా పక్కా సాక్ష్యాల తో అతి చిన్న fake or morphed పోస్టులను కూడా సైబర్ సెల్ కి కంప్లైంట్ చేసి అవసరమైతే ఆ తప్పు స్థాయినిబట్టి అరెస్టు కూడా చేయించే టట్టు ఒక్క చాలా (highly influential) పెద్ద లీగల్ గా లాయర్ ని గాని లీగల్ టీం ఉండాలి....
ప్రతి చిన్న విషయానికి జనసైనికులు తమ ఉనికిని దేశం పట్ల ఉన్న తన భక్తిని పార్టీ పట్ల ఉన్న బాధ్యత చేసుకోవాల్సిన అవసరం లేదు (చిరంజీవి గారు ఎదో అన్నారు, నాగబాబు గారు ఎలా ఉన్నారు, పార్టీలో నుంచి వాళ్ళ వెళ్తున్నారు) ఇటువంటి చిల్లర మాటలకి ప్రశ్నించే వాడికి వాదించే వారికి మీరు రు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు...