ఎన్నో ఊహలు మరెన్నో ఆశలతో కొత్త సంవత్సరం/దశాబ్దంలోనికి అడుగిడుతున్న ఈ తరుణంలో ఒకసారి ఈ దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజకీయ, భౌతిక మార్పులు వాటి నుండి మనం నేర్చుకున్న పాఠాలను నెమరువేసుకుందాం.
ఈ దశాబ్దం(2010-2019)లో జరిగిన విషయాలను గురించి చేసేముందు ఒకసారి పూర్వ దశాబ్దపు చివరిలో జరిగిన రాజకీయ మార్పులను ఒకసారి పునరః చరణం చేసుకుందాం. 2009వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 శాసనసభ స్థానాలకు గాను 154 స్థానాలను కైవసం చేసుకుని కీ. శే శ్రీ Y.S రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్రాన్ని ఒక కుదుపుకు కుదిపిన వార్త శ్రీ YSR గారి మరణం, దాని చుట్టూ జరిగిన రాజకీయం. YSR గారి మరణానంతరం ఒక్కసారిగా రాజకీయ అనిశ్చితి ఏర్పడిన తరుణంలో శ్రీ కొణిజేటి రోశయ్యగారు ముఖ్యమంత్రిగా బాధ్యతులు స్వీకరించారు. అప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్షయంగా TRSను స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పోరాడుతున్న కెసిఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ నవంబర్ 29, 2009న తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేయాలి అని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. సుమారు 11 రోజుల పాటు సాగిన ఈ దీక్షకు తెలంగాణలోని విద్యార్థి, ఉద్యోగ,మేధావి సంఘాల నుండి మద్దతు లభించినది. KCR గారి ఆరోగ్యం క్షీణించడంతో పాటు రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కొందరు మేధావులను దీక్ష విరమణకు రాయభారాన్ని పంపగా అది విఫలం కావడంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య గారి ఆధ్వర్యంలో అఖిల పక్షం ఏర్పడడం మరియు ఆ అఖిల పక్షం తెలంగాణ ఏర్పాటుకు ఏకగ్రీవంగా తీర్మానించడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా పలు సమావేశాల అనంతరం డిసెంబర్ 9,2009 న సుమారు అర్ధరాతి ప్రాంతంలో "తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు" ప్రకటించారు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ చిదంబరంగారు.
ఈ ప్రకటనతో తెలంగాణ ప్రాంతంలో సంబరాలు చేసుకోగా సీమాంధ్రలో నిరసనలు మిన్నంటాయి. సీమాంధ్ర ప్రాంత నిరసనలు మరియు ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన పై పునరాలోచనలో పడింది. దీనితో తెలంగాణా ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించి 15 రోజులు కూడా గడవక ముందే డిసెంబర్ 23,2009న "అందరితో అభిప్రాయలు తీసుకుంటాం" అని మరో ప్రకటన చేయించింది. దీనితో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యలమాల నడుమ నూతన సంవత్సరం మరియు దశాబ్దంలోకి అడుగిడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
ఈ నిరసనలు మరియు ఆందోళనల నడుమ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించవల్సిందిగా కేంద్ర హోంశాఖ జస్టిస్. B.N. శ్రీ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఐదుగురి సభ్యుల కమిటీని ఫిబ్రవరి 3,2010న ఏర్పాటు చేయడం జరిగినది. ఒకవైపు ఈ అధ్యయనం జరుగుతుండగా ఇరు ప్రాంతాలలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఒక వైపు ఇరు ప్రాంతాల నిరసనలు శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు జారుతుండగా మరొక వైపు సెప్టెంబర్ 2న తన తండ్రి అకాల మృత్యువుకు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న మరియు అనారోగ్యానికి గురై చనిపోయిన వారి కుటుంబాల పరామర్శించేందుకు "ఓదార్పు యాత్ర"కు పూనుకున్నారు శ్రీ Y.S. జగన్ మోహన్ రెడ్డి గారు. ఈ ఓదార్పు యాత్రకు అప్పటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు Y.S.R గారి అభిమానులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారికి భ్రమరథం పట్టగా ఈ ఓదార్పు యాత్ర శ్రీ Y.S. జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయ శక్తిగా మరల్చింది అని పలువురు అభివర్ణించారు కూడా. ఇలా కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పు యాత్రను ఆపేసి ఎవరైతే మరణించారో వారి కుటుంబాలను ఒక చోట చేర్చి అందరికి ఒకేసారి తాను చేయదలచిన సహాయాన్ని చేయవలసిందిగా కోరగా, ఆ సూచనను బేఖాతరు చేస్తూ ముందుకు సాగడం జరిగింది. ఇది ఇలా ఉండగా Y.S.R మరణానంతరం అనూహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన శ్రీ కొణిజేటి రోశయ్య గారు అనారోగ్య కారణాల రీత్యా నవంబర్ 24,2010లో రాజీనామా సమర్పించడం నవంబర్ 25,2010న శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం చెకచెకా జరిగిపోయి.
ఈ సందర్భంలో తాను చేస్తున్న ఓదార్పు యాత్రకు అనుమతి నిరాకరించడంతో తాను, తన తండ్రి మరణానంతరం ఏకగ్రీవంగా పులివెందుల నుండి ఎన్నికైన తన తల్లిని తమ తమ లోక్ సభ మరియు శాసన సభ సభ్యత్వాలకు మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలకు నవంబర్ 29,2010న రాజీనామా చేయడం జరిగింది. దీనికి మరెన్నో కారణాలు ఉన్నాయని అప్పటి మీడియా ఎన్నో కధనాలు ప్రచారంలోకి తీసుకొచ్చినది కూడా. రాజీనామా అనంతరం డిసెంబర్ 7,2010న మరో 45రోజులలో తనో కొత్త పార్టీ పరారభిచనున్నట్టు పులివెందులలో ప్రకటించారు.
రాజకీయ పార్టీల పరిస్థితి ఇలా ఉండగా ఫిబ్రవరిలో నియమించబడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తనకు నిర్ధేశించిన సమయంకంటే ముందుగానే డిసెంబర్ 10,2010న సుమారు 460 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర హోంశాఖకు అందించడం జరిగినది. ఈ నివేదిక అనేక విషయాలను గురించి వివరించడంతో పాటు తెలంగాణ విభజన గురించి 6 సూచనలను(Options) సూచించడం జరిగినది. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.
• అప్పటి యధాతధ స్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉంచడం.
• పంజాబ్-హర్యానా-చండీఘర్ తరహాలో విభజించడం.
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రాయల తెలంగాణ - సీమాంధ్రగా విభజించి హైదరాబాద్ ని రాయల తెలంగాణకు రాజధానిగా ప్రకటించడం.
• హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా నిర్ణయిస్తూ గుంటూరు జిల్లా ను వయా నల్గొండ, రాయలసీమను వయా మహబూబ్ నగర్ ద్వారా అనుసంధానించాలి.
• సీమాంధ్ర తెలంగాణగా విభజించి హైదరాబాద్ ని తెలంగాణ రాజధానిగా నిర్ణయిస్తూ సీమాంధ్రకు వేరొక కొత్త రాజధానిని ప్రతిపాదించాలి.(ఇది తప్పని సరి పరిస్థితులలో పరిగణలోనికి తీసుకోవాలి)
• ఉమ్మడి రాష్ట్రాన్ని యధాతధంగా ఉంచి తెలంగాణాకు ప్రత్యేక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తూ రాజకీయ, సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి కృషి చేయాలి.
ఈ ప్రతిపాదనలతో ఒక్కసారిగా సీమాంధ్ర, తెలంగాణాలో మరోసారి నిరసనల అగ్గి రాజేశాయి. హైదరాబాద్ తో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తమకు ప్రకటించాలి అని తెలంగాణాలో, లేదు ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిరసనలు మరింత తీవ్రం అయ్యాయి. ఒకవేళ విభజించాల్సిన పరిస్థితి ఉత్పన్నం ఐతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ రాష్ట్ర విభజన చేయాలి అని నిరసనలు సరికొత్త నినాదాలు మిన్నంటాయి.
కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా అనంతరం శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు ముందే ప్రకటించిన విధంగా 2011, మార్చ్ 12న వైస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించి ఉపఎన్నికలకు వెళ్లి మళ్ళీ మెజార్టీతో తమ స్థానాలను నిలుపుకున్నారు. ఇలా 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ప్రయాణం ప్రారంభంకాగా మరొక పార్టీ తన ప్రస్థానాన్ని ముగించడం గమనార్హం. 2008లో "ప్రేమే లక్ష్యం-సేవే మార్గం", "సామాజిక న్యాయం" అన్న నినాదంతో సుమారు మూడు దశాబ్ధాలు సినీ జీవితాన్ని ముగించుకుని ఒక సరికొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన శ్రీ చిరంజీవి గారు 2009 ఎలెక్షన్లలో తాను నమ్మిన సామాజిక న్యాయానికి కట్టుబడి 294 శాసనసభ స్థానాలకు గాను సుమారు 100కు పైగా బడుగు బలహీన వర్గాలకు కేటాయించి బరిలోకి దిగినప్పటికీ సీట్లు అమ్ముకున్నాడు అనే అపవాదుతో కేవలం 18 స్థానాలకు మాత్రమే గెలుపొంది శాసనసభలోకి అడుపెట్టడం జరిగింది. ప్రస్తుత రాజకీయాలను మార్చాలి అని పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తూ వారియుక్క జీవితాలలో సామజిక, రాజకీయ, ఆర్ధిక అభివృద్ధితో ముందుకు సాగాలి అనే ఆశయంతో స్థాపించిన పార్టీని రాజకీయ కుటిల పన్నాగాల నడుమున నడపలేక, సంప్రదాయ రాజకీయాలు చేయలేక అనేక ఒత్తిళ్లకు తలొగ్గి ఫిబ్రవరి 06, 2011న ప్రజారాజ్యం పార్టీను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసి తాను స్థాపించిన YSR కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన అనంతరం. 2012లో సుమారు 18మంది YSR గారి అభిమానించే MLA లు తమ పదవులకు మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేసి YSR కాంగ్రెస్ పార్టీలో చేరగా అప్పుడు జరిగిన ఉపఎన్నికలలో 18 మందికిగాను 15 మదిని గెలిపించుకొనెను. ఓడిపోయిన ముగ్గురులో అప్పట్లో ప్రజలకు సుపరిచితులు శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ మరియు కొండా సురేఖ వంటి వారు ఉండడం గమనార్హం.
2011-12 లో ఇటు తెలంగాణ అటు సీమాంధ్రలలో నిరసనలతో అట్టుడికింది అని చెప్పవచ్చు. తెలంగాణాలో సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, దండి మార్చ్ తరహాలో తెలంగాణ మార్చ్ లతో కదం తొక్కగా. మరొకవైపు రాష్ట్రము సమైక్యంగానే ఉంచాలి అంటూ అటు సీమాంధ్రలో ఇదే తరహా నిరసనలు వెల్లువెత్తయి. ఇలా నిరసనల పర్వం కొనసాగుతున్న తరుణంలో 2012 డిసెంబర్, 27న అప్పటి హోంశాఖ మంత్రి శ్రీ సుశీల్ కుమార్ షిండే గారి నేతృత్వంలో రాష్ట్రంలోని 8రాజకీయ పార్టీలతో ఒక సమేవేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉదేశిస్తూ హోం మంత్రివర్యులు ఇదే ఆఖరి సమావేశం కావచ్చు అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలను తమ ఆలోచనలను, సూచనలను రాష్ట్రవిభజన పట్ల వ్యక్తపరచవల్సిందిగా కోరగా MIM మరియు సిపిఐ(M) మాత్రం విభజనకు వ్యతిరేకంగా మరియు మిగిలిన పార్టీలలో YSRCP తటస్థంగా మరియు టీడీపీ ఏమి తేల్చుకోలేక తన రెండు కళ్ళ వైఖరిని వ్యక్తం చేసింది.
2013లో నిరసనలను తీవ్రతరం చేస్తూ తమ వాణిని వినిపించేందుకు జాతీయ రహదారుల దిగ్భంధం, చలో అసెంబ్లీ, వంట వార్పూ వంటి కార్యక్రమాలు ఉధృతం చేయగా తెలంగాణ పౌరసమాజం కూడా వీరికి తోడుగా నిలబడడం అద్భుత ఘట్టంగా పరిగణించబడుతుంది.
ఈ నిరసనల నడుమ జులై 2013 ప్రథమార్ధంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ విభాగ కాంగ్రెస్ వ్యవహార ఇంచార్జ్ శ్రీ దిగ్విజయ్ సింగ్ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ N. కిరణ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ. దామోదర రాజనరసింహ మరియు ఆంధ్రప్రదేశ్ P.C.C అధ్యక్షులు శ్రీ బొత్స సత్యనారాయణ గార్లను విభజన మరియు ఉమ్మడి రాష్ట్రము వాళ్ళ ప్రయోజనాలు, నష్టాలు మరియు తదనంతర పరిణామాల పై ఒక పూర్తిస్థాయి నివేదిక కోరగా వారు సమర్పించడం జరిగింది. తరువాత జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తెలంగాణ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తపరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడంతో తెలంగాణ ప్రాంత ప్రజలలో హర్షతి రేఖాలు, సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు ఒకేసారి చోటుచేసుకున్నాయి.
ఈ నిరసనల నడుమ సెప్టెంబర్ 7,2013 సీమాంధ్రలోని సుమారు 70వేల పైగా ఉద్యోగులు సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట హైదరాబాద్ L.B స్టేడియంలో ఒక భారీ భహిరంగ సభ నిర్వహించి అత్యంత ఉధ్రిక్త పరిస్థుతులలో కూడా విజయవంతం చేసుకున్నారు.
అక్టోబర్ నెలలో కేంద్ర కాబినెట్ తెలంగాణ విభజనకు ఆమోదం తెలిపి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న మరియు విభజనవల్ల కలిగే సమస్యల గురించి అద్యయనం చేసి. డిసెంబర్ 6, 2013న డ్రాఫ్ట్ బిల్ ను రాష్ట్రపతికి పంపగా దాన్ని పరిశీలించి రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కోరగా, రాష్ట్ర శాసనసభ ఆ బిల్లుకు సుమారు 9000 సవరణలు ప్రతిపాదిస్తూ తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి సవరణలను కేంద్రకి పంపడం చకచకా జరిగిపోయి. ఫిబ్రవరి 13,2014న కొన్ని సవరణలతో కూడిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగా సీమాంధ్ర ప్రాంత నాయకులూ వ్యతిరేక నినాదాలు మరియు తెలంగాణ ప్రతినిధుల అనుకూల నినాదాల నడుమ మరియు లగడపాటి రాజగోపాల్ లాంటి వారు పెప్పర్ స్ప్రే తో సభలో చేసిన హల్చల్ మధ్య ఆమోదం పొందడం, ఫిబ్రవరి 18 రాజ్యసభలో ప్రవేశపెట్టగా అరుణ్ జైట్లీ మరియు వెంకయ్య నాయుడుగార్ల అభ్యంతరాల మేరకు అప్పటి
ప్రధానమంత్రి Dr. మన్మోహాన్ సింగ్ గారు విభాజిత ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన జిల్లాలు ఐన ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలకు బుందేల్ఖండ్ లేక KBK తరహా ప్యాకేజీ తో పాటు 5సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ప్రకటనతో ఎటువంటి సవరణలు లేకుండా కేవలం ప్రకటనతో రాజ్యసభలో కూడా బిల్ ఆమోదంపొందింది.
ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్ రాష్ట్రపతి ఆమోద ముద్ర పడి మార్చ్ 1, 2014న గెజెట్గా వెలువడింది. మార్చ్ 4, 2014న కేంద్రం జూన్ 2 ను తెలంగాణ అవతరణ దినోత్సవంగా ప్రకటిస్తూ బిల్ లో పేర్కొన్న విధంగా 10 సంవత్సరాలు హైదరాబాద్ తెలంగాణా విభాజిత ఆంధ్రప్రదేశ్ లకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కానీ హైదరాబాద్ ఆదాయం మరియు పరిపాలన పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో ఉంటుంది అంటూ స్పష్టతనిచ్చినది.
తెలంగాణ మాలి విడత ఉద్యమంలో TJAC, KCR మరియు ఇతరులు ఎంత ముఖ్యమో ఓ.యూ విద్యార్థులు, విద్యార్థి JAC కూడా అంతే ముఖమైన పాత్రా పోషించాయి అని చెప్పడంలో బహుశా ఎవరికీ ఎటువంటి సందేహాలు ఉండవేమో. ఇంత మంది గురించి చెప్పుకుని తన ప్రాణాన్ని సైతం తృణ ప్రాయంగా అర్పించిన తెలంగాణ కల తన బలిదానంతో ఐన రావాలి అని మొదటి ప్రాణాన్ని అర్పించిన ఓ.యూ విద్యార్థి శ్రీకాంతా చారిని మర్చిపోతే చాల పెద్ద తప్పు చేసిన వారము అవుతాము.
మరోవైపు రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచేందుకు అటు సీమాంధ్ర ప్రాంత నాయకులూ, ఉద్యోగులు, విద్యార్థులు వారిస్థాయిల్లో వారు తెలంగాణ విభజన నినాదానికి ధీటుగా సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించడంలో చేసిన కృషి నిజంగా హర్షణీయం.మరియు సమైక్యాంధ్ర కోసం చిత్తూరు జిల్లాకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కోటయ్య(పేరు కరెక్ట్ గా గుర్తు లేదు తప్పు ఐతే సరి చేయగలరు) ఆత్మబలిదానం చేసుకుని తాను ఊపిరి వదులుతూ ఉద్యమానికి ఊపిరులూదాడు.
రాష్ట్ర విభజన ప్రక్రియ ఇలా సాగగా మరొకవైపు రాష్ట్రంలో ఇతర పార్టీల రాజకీయం గురించి ఒకసారి చూద్దాము. తెలంగాణ సీమాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా నడుస్తున్న సమయంలో ప్రజలలోని ప్రభుత్వ వ్యతిరేకతను తనకు ప్రయోజనంగా మలచుకోవడానికి టీడీపీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు తన 63వ ఏట అక్టోబర్ 2, 2012న "వస్తున్న మీకోసం" అంటూ పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 120రోజులు, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలలో 13 జిల్లాలను చుడుతూ 2500KM లకు పైగా సాగిన పాదయాత్ర ఇచ్చాపురంలో ముగిసినది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వొచ్చి తన సొంత పార్టీతో ప్రజలలోకి వెళ్తున్న శ్రీ Y.S. జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి బ్రతికున్నపుడు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టినవారికి ప్రభుత్వం నుండి మేళ్ళు చేకూర్చాడు అని అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు ఆర్జించాడు అని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులూ శ్రీ శంకర్ రావు గారు రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాయగా దానిని పరిగణలోనికి తీసుకుని విచారిస్తున్న సమయంలో ఎర్రన్నాయుడుతో పాటు మరో ఇద్దరు టీడీపీ నాయకులు కూడా మరికొన్ని ఆరోపణలు చేస్తూ ఆ కేసులలో ఇంప్లీట్ కావడం జరిగింది. దీనితో విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆరోపణలో నిజానిజాలను గురించి CBIకు బాధ్యతను అప్పగించగా కేసు విచారణ నిమిత్తమై మే 27, 2012న హాజరు కావాల్సిందిగా కోరడంతో హాజరైన శ్రీ Y.S. జగన్ గారిని మరుసటి రోజు మే 28, న అదుపులోనికి తీసుకుని CBI స్పెషల్ కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ ఆదేశించిన కోర్ట్. తదనంతరం శ్రీ Y.S. జగన్ మరియు తన వ్యాపార సంస్థలకు చార్టెడ్ అకౌంటెంటుగా పనిచేసిన విజయ సాయి రెడ్డిని కూడా విచారణకు హాజరైన తరువాత వారిని సహా నిందితుడిగా రిమాండ్ చేయడంతో పాటు శ్రీ Y.S.R గారి హయాంలో మంత్రులుగా పని చేసిన కొందరు ప్రజాప్రతినిధులను మరియు రాష్ట్రస్థాయి అధికారులను విచారణ నిమిత్తం పిలిచి కొందరిని విచారణ అనంతరం వదిలి వేయగా మరికొందరును తమ రిమాండ్లోని తీసుకుని విచారణ చేస్తూ కొందరిని కొన్ని నెలల తరువాత బెయిల్ పై విడుదల కాగా శ్రీ Y.S. జగన్ గారి పై 12 CBI చార్జిషీట్లు మరియు 2 ED(Enforcement Directorate) చార్జిషీట్లు దాఖలు చేయగా సుమారు 16 నెలల జైలులో గడిపి బెయిల్ పై విడుదలై ప్రతి శుక్రువారం CBI ప్రత్యేక కోర్టులో హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
తాను కారాగారవాసంలో ఉన్నప్పుడు పార్టీలో నిస్తేజం అలుముకున్న సమయంలో పార్టీలో పూర్తిగా జవసత్వాలు నింపు మరింత ముందుకు నడిపేందుకు శ్రీ Y.S.జగన్ గారు తన సోదరి ఐన శ్రీమతి షర్మిల గారిని చేయవల్సిన కారేచ్ఛరణను వివరించగా శ్రీమతి షర్మిల గారు తన సోదరుడు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చేందుకు "మరో ప్రజా ప్రస్థానం" పేరుతో సుమారు 10నెలల పాటు 14 జిల్లాల మీదగా సుదీర్ఘమైన పాదయాత్రను నిర్వహించి తన శక్తివంచన లేకుండా ప్రయతించారు.
సవరణలతో కూడిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోక్ సభలో ప్రవేశపెట్టిన అనంతరం తన నిరసనను తెలియచేస్తూ ఉమ్మడి రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన రాజీనామాను ఫిబ్రవరి 14, 2014న గవర్నర్ కు అందించి విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీకి తనతో పాటు పూర్తి స్థాయిలో నిలబెట్టడానికి ప్రయతించగా తాను కూడా గెలవని పరిస్థితులలో రాజకీయాలనుండి దూరంగా ఉంటూ వచ్చారు కాగా మరల 2018లో తిరిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొవడం కొసమెరుపు.
రాష్ట్ర విభజన అనంతరం సినీపరిశ్రమలో అగ్రభాగాన ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరిని ఆశ్చర్యపరుస్తూ "జనసేన" అనే పార్టీని ప్రకటించి తన ఆలోచనలను ఆ సభ ద్వారా వ్యక్తపరిచారు. తాను సంప్రదాయ రాజకీయాలు చేయడానికి రాలేదు అని నాయకులు చేసిన తప్పులకు ఇరుప్రాంత ప్రజలు వారి భవిష్యత్తు కొన్ని తరాల వెనక్కి నెట్టబడినది అని మరియు ఆంధ్రప్రదేశ్ విభజన చాల దుర్భరంగా జరిగింది అని విభజన ప్రక్రియపై తన ఆలోచనలను పూర్తిగా వివరిస్తూనే తెలంగాణ పై తన ప్రేమను చాటుతూ తాను తెలంగాణ విభజనకు వ్యతిరేకం కాదు కానీ జరిగిన ప్రక్రియ సరిగా జరగలేదు అని తన స్పష్టమైన వైఖరి తెలియచేసారు. అప్పటికే తన అన్నగారైన శ్రీ చిరంజీవిగారు ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసారు తిను కూడా ఎక్కువ కాలం రాజకీయం చేయరు అనే అపవాదు ఉన్నప్పటికీ తాను ఒకటి లేక రెండు ఎన్నికలకు రాలేదు అని 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి వోచాను అని స్పష్టతను తన మొదటి పార్టీ ప్రకటించే సభలోనే ఇచ్చేయడం జరిగినది. తన ఆలోచనలను మరియు తన పార్టీ సిదంతాలను పూర్తిగా వివరిస్తూ సాగిన ప్రసంగంలో తన అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కారించారు అని చెప్పవొచ్చు. తాను 2014లో పార్టీ పెట్టినప్పటికీ రాబోవు ఎన్నికలలో పోటీ చేసి ఓట్లను చీల్చే ఉద్దెశం తనకు లేదు అని, కానీ రాబోవు ఎన్నికలలో తాను తన పార్టీ పూర్తిస్థాయిలో పోటీకి దిగుతున్నట్టు చెప్పుకొచ్చారు. తన పార్టీ ప్రకటన వేదిక నుండే రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీసిన కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలి అని పిలుపునిస్తూ "కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్" అనే నినదించారు.
తాను పార్టీ పెట్టిన అనంతరం BJP ప్రధానమంత్రి అభ్యర్థి శ్రీ నరేంద్రమోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపికి తన మద్దతు ప్రకటించగా అప్పటికే NDA కూటమిలో ఉంటూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తున్న TDP తమకు పవన్ కళ్యాణ్ మద్దతు కోరగా మిత్ర ధర్మాన్ని పాటిస్తూ 2014 ఎన్నికలలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో NDA కూటమి సభ్యుల గెలుపుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం గెలుపునకు కీలక భూమిక పోషించారు.
విభాజిత ఆంధ్రప్రదేశ్ కు 2014లో జరిగిన సాధారణ ఎన్నికలలో అనుభవం ఉన్న నాయకతంతో రాష్టం అభివృద్ధి చెందుతుంది అని ఆకాక్షిస్తు తెలుగు దేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి నాయకత్వాన్ని 103 స్థానాలు కట్టపెట్టి అధికార పీఠంపై కుర్చోపెట్టగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారు మరియు సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి పోటీ చేసిన ఆ స్థానంలో కూడా కనీసం డిపాసిట్లు కూడా దక్కించుకొని పరిస్థితికి పడిపోయింది. ఓటమి ఊహించిన కాంగ్రెస్ పార్టీకి ఇంతటి పరాభవం ఊహకు కూడా అందని ఓటమిగా అభివర్ణించారు విశ్లేషకులు.
గెలుపోయిందిన అనంతరం విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేలాగా తనకు ఉన్న పరిచయాలతో పావులు కదిపారు. అనంతరం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో అక్కడినుండి పరిపాలనను కొనసాగిస్తున్న తరుణంలో అక్టోబర్ నెలలో హుద్ హుద్ తుఫాను విశాఖ పట్టణంతో పాటు జిల్లాలో చాలా చోట్ల భీభత్సన్ని సృష్ట్టించిన సందర్భంలో తన అనుభవాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ అత్యంత త్వరితగతిన పూర్తిస్థాయిలో వ్యవస్థలను పునరుద్ధరించి క్రైసిస్ మానేజ్మెంట్లో తనకి తానే సాటి అనిపించుకున్నారో లేదో మరుసటి సంవత్రం పూర్తిగా చేదు అనుభవంగా మారింది శ్రీ చంద్రబాబు గారి జీవితంలో అని చెప్పవొచ్చేమో.
అంత సాఫీగా సాగుతుంది అనుకుంటున్నా తరుణంలో 2015లో తెలంగాణాలో ఓటుకు నోటు కేసు, గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట వలన సుమారు 29 మంది మరణం తన రాజకీయ జీవితంలో ఒక మచ్చగా ఉంటాయని అభివర్ణిస్తుంటారు నిపుణులు.
2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనంతరం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అని సూచించేదానికే కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ శివరామకృష్ణన్ (రిటైర్డ్ ఐఏఎస్) వారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పటు చేయగా దాని నివేదికను పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రి నారాయణగారి ఆధ్వర్యంలో మరొక కమిటీ నియమించబడినది, ఆ కమిటీ సిఫార్సుల మేరకు విజయవాడ గుంటూరు మధ్య కల సుమారు 29 గ్రామాలలోనుండి 33 ఎకరాల సాగు భూమిని తీసుకోవడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ లేక శివరామకృష్ణన్ కమిటీ కానీ ఈ స్థలంలో రాజధాని నిర్ణయం సరికాదు అని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా అదే ప్రదేశంలో రాజధాని ఉండాలి అంటూ శాసనసభలో తీర్మానించి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగినది. అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారిచే శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం అక్కడ జరిగిన నిర్మాణాలలో ఎంతో అవినీతి జరిగింది నాసిరకం నిర్మాణాలకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు అని అనేక విమర్శలు రాగా వాటిని నిజం చేస్తూ సచివాలయం మరియు అసెంబ్లీలో పలు ఛాంబర్లలో చిన్నపాటి వర్షానికి కూడా నీరు కారడం నిరూపించింది. పైగా కట్టినవన్ని తాత్కాలిక భవనాలు పూర్తిస్థాయి నగర నిర్మాణం మరియు శాశ్వత భవనాలు ఎలా ఉంటాయో అనేక గ్రాఫిక్కుల ద్వారా తన భజన మీడియాను ఉపయోగించుకుని కేవలం తనకు తన పార్టీకి అనుకూలంగా వార్తలు రాస్తూ ప్రతిపక్షాన్ని మరియు తనను ఎదిరించిన వారిని తన అనుకూల మీడియా ఛానళ్ల ద్వారా పూర్తిగా తిట్టిస్తూ "కేవలం ఆత్మ స్తుతి పర నింద" అనే సూత్రాన్ని తూచా తప్పకుండ పాటిస్తూ ఇసుక, గనులు, జన్మభూమి కమిటీల ద్వారా పూర్వం అవినీతికి ఎంతో కొంత దూరం ఉంటూ అభివృద్ధి చేయాలి అని ప్రయత్నిస్తూ 2004 కి ముందు చుసిన చంద్ర బాబు గారికి పూర్తి భిన్నంగా తనని తాను ఆవిష్కరించుకుంటూ ముందు ప్రత్యేక హోదా లేకపోయినా పర్లేదు అదేం సంజీవిని కాదు ప్రత్యేక ప్యాకేజి ఐనా పర్లేదు హోదా కంటే ప్యాకేజీ అద్భుతం అంటూ BJP తో ఉన్నన్ని రోజులు పొగిడి తర్వాత హోదా కోసం రాజీనామా చేసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైసీపీకి ఎక్కడ మైలేజ్ వెళ్తుందో అని చివరి సంవత్సరం NDA నుండి రాజీనామా, అవిశ్వాసం అంటూ అప్పటివరకు నవనిర్మాణ దీక్షల పేరిట విభజించిన కాంగ్రెస్ ని తిడుతూ సాగిన పెట్టిన సభలు హుటాహుటిన BJPకి వ్యతిరేకంగా ధర్మపోరాట దీక్ష అంటూ చంద్రబాబు గారు తన పేరును U-Turn బాబుగా ప్రతిపక్షాలకు చులకన కావడం జరిగింది. చంద్రబాబుగారి స్థాయిని మరింత దిగజార్చిన సందర్భం పప్రతిపక్షం నుండి 23 మంది MLAలను తమ పార్టీలోకి తీసుకుని వారిలో కొందరికి మంత్రి పదవులనుసైతం కట్టబెట్టి వారిపై ప్రతిపక్షం వారు వారి పార్టీ గుర్తుపై నెగ్గి వేరొక పార్టీలోకి వెళ్లిన వారిపై అనర్హత వేటు వేయమని స్పీకర్ గారికి లేఖలు సమర్పించినప్పటికీ స్పీకర్ విచక్షణ అధికారాలు అంటూ మరెన్నో కారణాలు చేయించి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు మరొకవైపు తిరిగి వారితోనే విమర్శలు గుప్పించేలా ప్రోత్సహించడం. ఈ చర్యలతో మాన్య మాజీ ముఖ్యమంత్రివర్యులు తమ స్థాయిని అతఃపాతాళంలోకి దిగజార్చుకున్నారు. వారి హయాంలో జరిగిన మరికొన్ని సంఘటనలు హుద్ హుద్ సమయంలో ఎంతో సంయమనంతో అత్యంత తక్కువ సమయంలోనే పూర్వస్థితిని పునరుద్ధరించడానికి ప్రయతించిన ముఖ్యమంత్రి గారు తితిలి తుఫాను సందర్భంగా అతలాకుతలమైన సందర్భంలో అక్కడ పునరావాస చర్యలు తీసుకోకుండా ఎక్కువగా ప్రచారం పట్ల తమ దృష్టిని ఉంచిన సందర్భంలో వారు పడిన ఇక్కట్లు అన్ని ఇన్ని కావు.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తన ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే 2014లో 67స్థానాలతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన వైసీపీ వీలు కుదిరినప్పుడల్లా తన వాణిని వినిపించడం చేస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేము కేవలం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలం అని ప్రకటించిన సందర్భంలో వీలైనంతవరకు తన నిరసన గళాన్ని వినిపిస్తూ విద్యాలయాలలో అనేక అవగాహన కార్యక్రమం అంటూనే ప్యాకేజిని ఒప్పుకున్నా టీడీపీని తిట్టిస్తూ సాగించడం జరిగింది. ఒకానొక సందర్భంలో విశాఖపట్టణంలో జరిగే నిరసన కార్యక్రమానికి వోచిన జగన్ మోహన్ రెడ్డి గారిని విమానాశ్రయంలోనే ఆపేసి వెనక్కి పంపించదలచిన పోలీస్ సిబ్బందితో ఒకింత తన అసహనాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఒక్కొక్కరిగా తన పార్టీనుండి 23మందిని అధికార పార్టీలోకి తీసుకుని వారితోనే తిట్టిస్తున్న సందర్భంలో మరియు శాసనసభలో వారి పార్టీలో తమ పార్టీకి సరైన సమయం కేటాయించడంలేదు అని ఈ తీరుకు నిరసిస్తూ అసెంబ్లీని పూర్తిగా Boycott చేస్తూ తాము ప్రజల మధ్యనే తేల్చుకుంటాము అంటూ "ప్రజా సంకల్ప యాత్ర" పేరుతో సుమారు సంవత్సరం పాటు 3000కిలోమీటర్లకు పైగా జరిగిన ఈ యాత్రలో ప్రజాసమస్యలను తెలుసుకుంటూ వాటికి తాను ప్రభుత్వంలోకి వోచిన తర్వాత వాటికి పరిష్కారిస్తాం అని వాగ్దానాలు చేస్తూ ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా వేడుకుంటూ సాగిన ఈ యాత్రలో తదనంతరం తమ మానిఫెస్టోను ప్రకటించి ఎన్నికలలోకి వెళ్లడం జరిగింది. దీనితో పాటు తాను ప్రతి శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావడానికి వెళ్తున్న తరుణంలో విశాఖపట్టణం నుండి వెళ్తున్న తరుణంలో తనపై జరిగిన కోడి కత్తితోటి దాడి ఒకింత ప్రజలలో మరియు వారి పార్టీ కార్యకర్తలలో భయాందోళనలకు గురిచేశాయి.
ఇక తృతీయ ప్రత్యామ్న్యాయంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జనసేన సమస్య ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటూ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. దశాబ్దాలుగా ఎంతో నరకయాతనను అనుభవిస్తున్న సమాజానికి తెలియని ఉద్దానం కిడ్నీ సమస్యను ఎత్తుకుని విదేశాల నుండి వైద్య ప్రతినిధుల బృందంతో ఇక్కడ అనేక పరీక్షలు నిర్వహించి కారణాలను అన్వేషిస్తూ తక్షణం వారికి అందవలసిన వైద్య సదుపాయాలను అందించాలి అని డిమాండ్ చేస్తూ ఒకరోజు నిరాహార దీక్షతో ప్రభుత్వంలో చలనాన్ని తెచ్చి వారికి డయాలసిస్ కేంద్రాలు దగ్గరలో ఏర్పాటు చేయించి అక్కడకు వెళ్లేందుకు వీరి ప్రయాణంలో సబ్సిడీ అందేలా అనేక చర్యలకు పూనుకున్నారు. ఒక తుందూరు ఆక్వా ఫుడ్ పార్క్, పోలవరం నిర్వాసితుల సమస్య, అమరావతి రైతుల భూములకు సరైన పరిహారంకోసం ఉద్యమం ఇలా అనేకం చేస్తూ. ప్రభుత్వంలో జరిగే తప్పులను సరిచేసుకోవాల్సిందిగా కోరుతూ. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తాము అని ప్రకటించిన తరువాత వెంటనే వాటిని పాచిపోయిన లడ్డులతో పోలుస్తూ ప్యాకేజీ ఇచ్చిన మరియు ఎటువంటి చర్చ లేకుండా దానికి ఆమోదిచిన రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేవలం విమర్శలు మాత్రమే కాదు సమస్యకు తగిన పరిష్కారాలను సూచిస్తూ సాగిన ప్రయాణంలో 2018లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పలు మార్లు చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు తన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతితో పాటు తన పుత్రుడు లోకేష్ అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు తమ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదానే ఇవ్వాలి అని గళమెత్తారు. అప్పటి మొదలు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎదగడుతూనే వస్తున్నారు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాన్ని నమ్మని ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఆధారాలతో నిరూపించడంతో ప్రభత్వ పై ప్రజలలో వ్యతిరేకత బలంగా పెరగడం ప్రారంభం ఐనది ఇది గమనించిన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు మరియు తమ ఆస్థాన మీడియా సంస్థలతో పవన్ కళ్యాణ్ గారిపై పుంఖాను పుంఖాలుగా వ్యతిరేక వార్తలు రాయడం మొదలెట్టారు.
ఇలాంటి తరుణంలో ఎన్నికలకు నగారా మోగేసమయం ఆసన్నం ఐనప్పుడు జనసేన తాను ముందు నుండి చెప్తున్నట్టు కమ్యూనిస్ట్ పార్టీలతో పాటి BSP పార్టీని కూడా కలుపుకుని ఎన్నికల్లోకి వెళ్లగా, అధికార పార్టీ 5సంవత్సరాలలో సుమారు 4 సం. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా చివరి సంవత్సరంలో ఒక్కసారిగా అన్ని అమలు చేస్తే తమపై ఉన్న ప్రజావ్యతిరేకత పోతుంది అని అపోహపడి ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలకు ప్రజా ధనాన్ని పప్పు బెల్లాలలా ఖర్చు చేయడం ప్రారంభించింది.
మరోవైపు ప్రతిపక్షం ఈసారి ఎన్నికలలో గెలవడమే లక్ష్యంగా అప్పటికే ప్రఖ్యాతగాంచిన ప్రశాంత్ కిషోర్ అనే ఒక రాజకీయ వ్యూహకర్తను ఏర్పరుచుకుని తన సలహాలు సూచనలతో సుమారు రెండు సంవత్సరాల నుండి తమ వ్యూహాలను ప్రారంభించింది అందులో ఒకటి ప్రజా సంకల్ప యాత్ర. ఒకవైపు అధికార పక్షం తన మీడియాను ప్రచారం కోసం ఉపయోగించుకోగా మరోవైపు ప్రతిపక్షం రాజకీయ వ్యూహకర్త తన సంస్థ ద్వారా సామాజిక మాధ్యమాలు మరియు ఆయన వ్యూహాలతో ముందుకు సాగింది.
ఇలాంటి తరుణంలో 2019 ఎన్నికల నగారా మోగింది ప్రజల ఎందరో వ్యూహాలను తలకిందులు చేస్తూ వైసీపీ 151 స్థానాలతో అధికారం చేజిక్కించుకోగా టీడీపీ 23 స్థానాలకు పరిమితమై అనూహ్యం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం పరాజయం పాలై కేవలం ఒక్క రాజోలు నియోజకవర్గంలో గెలుపొంది ఒక్క సీటుతో తన ఖాతాను తెరిచింది. ఐనప్పటికీ ప్రభుత్వానికి 100రోజులు ఏమి విమర్శించమని ఎందుకంటే ఏ కొత్త పార్టీ ఐనా కుదురుకుని పాలన గాడిలో పెట్టడానికి ఆమాత్రం సమయం ఇవ్వాలి అనే ఆలోచనతో తమ పార్టీ నిర్మాణం మరియు ఓటమి కారణాల గురించి చర్చించేందుకు పార్టీ వివిధ సభ్యులతో సమావేశాలలో మునిగిపోయారు. 2019 మే 30న అధికారంలోకి ఒచ్చిన వెంటనే ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతలతో పాలనా ప్రారంభించింది. పైగా కరకట్ట పై ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం అని చెప్పి నేటికీ సుమారు 7నెలలు కావొస్తున్నా ఒక్క ఇటుక కూడా కదిలించలేదు అంటే దీనివెనుక వారి ఆలోచనలు ఏంటి అనేది సమాజమే నిర్ణయించుకోవాలి. తరువాత వరదల్లో సహాయక చర్యలు మానేసి అధికార ప్రతిపక్షాలు డ్రోన్ రాజకీయాలు చేయడం, తదుపరి ఇసుక కొరత. ఇసుక కొరతతో సుమారు భావన నిర్మాణ రంగం మాత్రమే కాకుండా దాని అనుబంధంగా ఉన్న సుమారు 42 రంగాలు 39 వేల కార్మికులు వారి కుటుంబాలు రోడ్డున పడిన పట్టించుకోకుండా వారికి పట్టెడు అన్నం పెట్టె కనీస బాధ్యత తీసుకోకపోగా ఎదురు విమర్శలు ఇలాంటి తరుణంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో రెండు రోజుల పాటు జనసేన ఆధ్వర్యంలో ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి తమ వల్ల ఐనంత పాట్టేడు అన్నం పెట్టె ప్రయత్నం చేసారు. భవన నిర్మాణ కార్మికులకు వారి కుటుంబాలకు అండగా ఉండేదుకు లాంగ్ మార్చ్ చేసి సమస్య తీవరతను ప్రభుత్వానికి తెలియచేయడంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 5లక్షల పరిహారం ప్రకటించి అందించవల్సిందిగా డిమాండ్ చేస్తూ తక్షణం కొరతను నివారించేందుకు తక్షణ చర్యలకు ఉపక్రమించావాల్సిందిగా కోరుకున్నారు, ఫలితంగా ఇసుక వారోత్సవాలు. అనేక కారణాల రీత్యా నిత్యావసర సరుకులు అందుబాటులో లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్న సామాన్యుడు ఒకవైపు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక కుదేలైన రైతన్న మరోవైపు వారికి తక్షణ సాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ రైతులకు సంగీభావంగా చలో కాకినాడకు పిలుపునివ్వగా అప్పటివరకు రూపాయి చెల్లించని ప్రభుత్వంలో కదిలిక వోచి సుమారు 300కోట్లు విడుదల చేసినట్టు వినికిడి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదవ దేవాలయాల ప్రాగణాలలో లేక పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారాలు బోధనలు, మాత మార్పిడులు పట్ల అనేక ఆరోపణలు వెల్లువెత్తయి. వీటి గురించి పక్కన పెడితే ఈ ప్రభుత్వం కేవలం సంక్షేమ కార్యక్రమాలేకే ప్రజా ధనాన్ని వినియోగిస్తూ సంపద సృష్టించే మార్గాలకు (అభివృద్ధి కార్యక్రమాలకు) నీళ్లొదిలేసి అప్పులలో ఉన్న రాష్ట్రమని వోచిన 7నెలల కాలంలో సుమారు 70వేల కోట్ల కొత్త అప్పులతో కేవలం సంక్షేమం చేస్తే అభివృద్ధి చెందక వెనిజులా దేశం పరిస్థితి వస్తుందేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రాష్ట్రము అగ్రస్థానంలో వెలుగొందాలి అంటే అభివృద్ధి మరియు సంక్షేమం జోడు గుర్రాల సవారీ సమానంగా పోవాలి. ఏది ఎక్కువైనా రాష్ట్ర ఎదుగుదలకు ప్రమాదం. ఇన్ని సమస్యలతో ఏడునెలల సావాసం చేస్తున్న ప్రజలు ప్రశాంతంగా, ఆనందంగా ఎక్కడ కొత్త సంవత్సరంలోకి మరియు కొత్త దశాబ్దంలోకి అడుగుపెడతారో అని అనుకున్నారో ఏమో అధికార పక్షంలో ఉన్నవారు శాసనసభ శీతాకాల సమావేశాల చివర్లో తాము పూర్వ ప్రభుత్వం అనుకున్నట్టు రాజధాని నిర్మించలేము అని అక్కడ అవినీతి అవకతవకలు జరిగాయి అని పాలనావికేంద్రీకణ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అని అప్పటికే అభివృద్ధి వికేంద్రీకరణ మరియు రాజధాని అంశాల గురించి అధ్యాయనానికి G.N.Rao కమిటీ వేసాము అని చెప్తూనే సౌత్ ఆఫ్రికా దేశంలోలా లెజిస్లేటివ్ కాపిటల్ ఒక చోట, జ్యూడిషియల్ కాపిటల్ ఒకచోట మరియు ఎక్సిక్యూటివ్ కాపిటల్ మరొక చోట ఉండొచ్చు అని ప్రకటించి ప్రాతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రకటన స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించేలోపే మునిసిపల్ శాఖా మాత్యులు అనేక అనుమానాలు అయోమయంలు స్టూష్టించే ప్రయత్నామ్ చేసారు. ముఖ్యమంత్రి గారి ప్రకటన అనంతరం తమ నివేదికను ప్రభుత్వానికి అందించిన G.N రావు గారి ఆధ్వర్యంలోని కమిటీ ముఖ్యమంత్రిగారి ప్రకటనకు అనుకుణంగా ఉండడం గమనార్హం. దీనితో ఒక్కసారిగా రాజధాని ప్రాంతంలో పెల్లుబికిన ఆందోళను రోజు రోజుకు మిన్నంట సాగాయి. ఈ తరుణంలో సమావేశమైన మంత్రివర్గం G.N.Rao కమిటీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ మరొక నివేదిక "బోస్టన్ కన్సుల్టేన్సీ గ్రూప్"నుండి రావలసింది ఉన్నందున రెండు కమిటీల నివేదికను పూర్తి అధ్యయనం కోసం మరో హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరుణంలో రైతులకు మద్దతుగా అన్ని పార్టీలు తమ వాణిని వినిపిస్తూనే ఆయా పార్టీ వేరే ప్రాంత ప్రతినిధులు కొందరు 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతితున్న తరుణంలో ఇప్పటికే జనసేన ఏకైక MLA శ్రీ రాపాక గారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించగా డిసెంబర్ 30,2019న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని స్థాయిల నాయకుల సమావేశం నిర్వహించి తమ ఆలోచనను నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ రాజధాని ఎక్కడన్నా ఒకే ప్రదేశంలో ఉండాలి అది ఏదైనా కానీ విశాఖపట్టణం, అమరావతి, లేక కర్నూల్ ఐనా తమకు పర్లేదు అంటూ కానీ అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దగ్గర ఉంచాలి అని డిమాండ్ చేస్తూ 31, డిసెంబర్ 2019న రాజధాని ప్రాంత రైతులను కలవడానికి వెళ్తుండగా అక్కడ వారి సమస్యలు తెలుసుకుని మాట్లాడిన అనంతరం అధికార పార్టీ నాయకుల వ్యక్తిగత విమర్శలతో మరియు రాజధాని ఎక్కడ అనే అయోమయంతో రాష్ట్రంలో అన్ని ప్రాంత ప్రజలు మరియు తమ ప్రాంతానికి ప్రకటించిన రాజధాని రాదని లేక ఉన్న రాజధాని మరెక్కడికో పోతుంది అనే భయంతో నూతన సంవత్సరం మరియు నూతన దశాబ్శంలోనికి అడుగిడుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఆయావత్ ప్రజానీకానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకంక్షలు.
Wish You All A Very Happy New Year And Decade. J J
Commentaires