ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం ప్రతీ పౌరుడి ప్రాధమిక హక్కు.ఒంటెద్దు పోకడలతో ఏకస్వామ్య నిర్ణయాలతో నియంతృత్వ వైఖరితో సాగే నాయకులని ప్రశ్నించాల్సిన అవసరం,అమాయక ప్రజలని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏకస్వామ్య విధానాలతో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ,మభ్య పెడుతూ మూడు రాజధానుల పేరుతో వికృత రాజకీయ క్రీడ ఆడుతున్న జగన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి సైనిక స్వరం నుండి కొన్ని ప్రశ్నలు.
1.నాడు అమరావతికి మద్దతునిచ్చి నేడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు?
2014లో విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును మేము స్వాగతిస్తున్నాం అని తెలిపి,అమరావతి రాజధానిగా శాసన సభలో ఆమోదం తెలిపింది మీరు కాదా?వచ్చే ఎన్నికల నాటికి ఎలా అయినా గెలిచి గద్దెనెక్కాలనే కోరికా,నమ్మకం మీకున్నాయి కదా నాటికే,మరి నాడే ఎందుకు అభ్యంతరం తెలపలేదు?మాకు అమరావతి వద్దు,మేము అధికారంలోకి వస్తే రాజధానిని ఖచ్చితంగా మారుస్తాం అని ఆరోజు ఎందుకు చెప్పలేదు? శాసన సభలో మీరు, తెలుగుదేశం వారు ఇరువురూ అంగీకరిస్తేనే కదా బిల్లు పాస్ అయ్యింది,రెండు పక్షాలూ ఒప్పుకున్నాయి,ఇక చిక్కుముడులు ఏమీ ఉండవూ అనుకొనే కదా ప్రజలు కూడా తమ భూములు ఇవ్వడానికి సిద్ధపడింది.మీరేందుకు వద్దని వారించలేదు రాజధాని ప్రాంత రైతులను?మీరు భూములు ఇవ్వడకండి,మేము అధికారంలోకి రాగానే రాజధానిని ఇక్కడ నుండి తరలిస్తామ్ అని ఎందుకు హెచ్చరించలేదు ? ప్రజలు భూములు ఇస్తుంటే చూస్తూ కూర్చున్నారు,వారిని నమ్మించారు,ఇవాల నమ్మించి తడి గుడ్డతో గొంతు కోస్తారా?
ప్రతి పక్షంలో ఉన్నన్ని రోజులూ అమరావతిలో అవకతవకలు ఉన్నాయి వాటిని సరిచేస్తాం అనే అన్నారు,కానీ తరలిస్తామ్ అనలేదు,రోడ్ల మీద పదవీ వ్యామోహ యాత్ర చేపట్టినప్పుడు కూడా ఏనాడూ పొరపాటున కూడా నోటి నుండి రాని మాట “అధికార వికేంద్రీకరణ””,రాజధాని తరలింపు,ఇవాళ అవే తారక మంత్రాలు ఎందుకయ్యాయి?ఎన్నికల ప్రచారం లో మీరు కానీ మీ నాయకులు కానీ ఎందుకు ఇప్పుడు చెబుతున్నా విషయాలు ప్రస్తావించలేదు?రాజధానిని మారుస్తాం అని నాడే ఎందుకు చెప్పలేదు?ఓడ దాటే దాకా ఓరి మల్లన్న,ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లు ప్రజల్ని చూస్తారా? పైగా మీ నాయకుల చేత అమరావతే రాజధానిగా ఉంటుంది,వైసీపీ రాజధానిని మార్చదు అనే ప్రకటనలూ చేపించారు,అమాయక ప్రజల్ని ఇంతలా నమ్మించి నయవంచన చేసిన ఘనులు మీరే కావచ్చు.ఇదేనా మాట తప్పను మడమ తిప్పను అనే మీ విధానం ?
2. ఎందుకు లీకులు ఇచ్చారు – మీరు చేస్తుంది ఇనసైడర్ ట్రేడింగ్ కాదా??
అమరావతిలో ఇనసైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది మీ ప్రధాన ఆరోపణ తెలుగుదేశం పైన,మరి ఇప్పుడు మీరు చేసింది ఏమిటి? ఎక్కడైనా నిష్ణాతులు,నిపుణులతో కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాత,నివేదిక ఇస్తుంది అన్నీ అంశాలనూ పరిశీలించి. కానీ అవేవీ లేకుండా ఎక్కడెక్కడ ఏ ఏ రాజధానులు వస్తాయో సభలో ప్రకటించాక అప్పుడు నామ మాత్రపు కమిటీలు వేయడం ఏమిటి? ఎవరి ప్రయోజనార్ధం ఇవన్నీ చేస్తున్నారు? ఒకరేమో విశాఖ రాజధాని అంటారు,మరికరు భీమిలి అంటారు,అంటే మీ అనుకూలురకు లభ్ది చేకూర్చడానికా లేక ప్రజల్ని ఆందోళనలోకి నెట్టడానికా ఈ లీకులు? నాడు తెలుగు దేశం ఏ తప్పిదం చేసింది అని మీరంటున్నారో నేడు మీరు చేస్తుంది కూడా అదే,స్వయంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికే కొన్ని వేల ఎకరాల భూమి ఉంది అని ఆరోపణలు వస్తున్నాయి,అవి నిజం కాదని రుజువు చేయగలరా? మీ పార్టీ నాయకులకి వారి బినామీలకి మీరు ప్రకటించిన రాజధాని ప్రాంతాలలో ఎవరెవరికి ఎంతెంత భూమి ఉందో ప్రజల ముందుంచే పారదర్శకత మీకుందా?
3.ఇంత హడావిడిగా ఎందుకు తరలిస్తున్నారు ?
ఐదేళ్ల పాటు పాలించమని అధికారం ఇచ్చారు ప్రజలు,కానీ మీరు వారి,వారి తరువాత తరాల భవితని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటుంతున్నారు. అటువంటి నిర్ణయాలు ఇంత హడావిడిగా తీసుకోవడం ఏమిటి? ఒక రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు,తరలింపు అంటే అది మామూలు విషయం కాదు,క్షుణ్ణంగా అధ్యయనం చేసి,ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి,ప్రజల సమ్మతి,తీసుకొని,ఎవరికీ నష్టం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసి,అప్పుడు చేపట్టాల్సిన ప్రక్రియని హడావిడిగా రోజుల వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారు? భాదిత పక్షాల బాధని అర్ధం చేసుకున్నారా? భవిష్యత్లో ఏర్పడే సమస్యల గురించి ఆలోచించారా? ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ ని ఉదాహరణగా చూపి విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నారు,ప్రజల్ని మభ్య పెడుతున్నారే తప్ప,అసలు అమరావతి నుండి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారో ఒక్క సహేతుక కారణం చెప్పగలరా? అభివృద్ది చెందిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడమే అభివృద్ది అని ఎలా అనుకుంటున్నారు? ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నారు? ఎవరి సలహాలు తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు? అసలు ప్రభుత్వం తరఫున ఈ రాజధాని తరలింపు,అధికార వికేంద్రీకరణ పై మీరు చేసిన్న హోమ్ వర్క్ ఏమిటి? అధికారం ఉంది కాబట్టి ఇష్టానుసారం ఏదైనా చేసేస్తారా?
4.అధికార వికేంద్రీకరణకి అభివృద్ది వికేంద్రీకరణకి తేడా తెలుసా అసలు? ఎందుకు ప్రజల్ని వంచిస్తున్నారు?
ప్రభుత్వాలు చేయాల్సింది అభివృద్ది వికేంద్రీకరణ,అది పక్కన పెట్టి అధికార వికేంద్రీకరణ చేసి ఇదే మీకు మహా ప్రసాదం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కర్నూలులో హై కోర్టు అన్నారు,హై కోర్టుకి బెంచ్ లు కూడా ఏర్పాటు చేస్తారు,కాబట్టి పూర్తిస్థాయి హై కోర్టు కార్యకలాపాలు జరగవు కర్నూలులో,ఇప్పుడు ఈ హై కోర్టు ఏర్పాటు,న్యాయ రాజధాని వల్ల రాయలసీమ వెనకబాటు తనం ఎలా అంతం అవుతుందో విజ్ఞులైన వైసీపీ నాయకులు తెలుపగలరా?హై కోర్టు ఏర్పాటు వల్ల సీమ ఎలా అభివృద్ది చెందుతుందో సీమ ప్రాంతానికే చెందిన ముఖ్య మంత్రి తెలుపగలరా??
శాసన రాజధాని వల్ల అమరావతి ఎలా అభివృద్ది అవుతుంది?? వివరించగలరా ??
5.ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా – ఇదే మీ తత్వమా??
న్యాయస్థానాల నుండి న్యాయమూర్తుల వరకూ,మేధావుల నుండి సామాన్యుల వరకూ అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా,ఇది సరైన నిర్ణయం కాదని చెబుతున్నా,కూడా వారి వాదన ఎందుకు వినిపించుకోరు? మీరు అనుకున్నదే సాగాలి,మీకనిపించిందే చేయాలి అనే ఈ ఒంటెద్దు పోకడలు దేనికి సంకేతం? వ్యతిరేకిస్తే ప్రజల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? ఇది తప్పని అంటే అభివృద్ది విరోధులు అని నిందలేస్తారా? మీకు నచ్చినట్లు శాసన సభలో ఆమోదించుకుంటారు మీ అధికారాలు ఉపయోగించుకొని,మీకు మండలిలో ఎదురు దెబ్బ తగలగానే మండలినే రద్దు చేస్తాం అంటారు,ఏమిటి ఈ విపరీత పోకడలు? ఎందుకింత అసహనం? ప్రజలకి మంచి చేయాలనుకునేవారి లక్షణమా ఇది? ఇదా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన తీరు? పాలకులకు ఉండాల్సిన సహనం ఇంతేనా? ఒక అడ్డంకి ఏర్పడితేనే మనస్సు నొచ్చుకుంది,మనస్సు గాయపడింది అని కబుర్లు చెబుతున్నారే,మరి మీరు చేస్తున్న వికృత విపరీత పోకడలకి అమరావతిలో రైతుల గుండెలు ఆగుతున్నాయి,వారివి ప్రాణాలు కాదా,వాళ్ళు మనుషులు కాదా,మీ నొచ్చుకున్న మనస్సుకు ఉన్నంత విలువ వాళ్ళ చావులకి లేదా?
అధికారం ఉంది కాబట్టి ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు అనుకోకండి,ఏదో ఓ రోజు మీరు చేస్తున్న ప్రతీ తప్పిదానికి మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుంది.
అసలు ఆ ప్రాంత ycp ఎమ్మెల్యే లకు ఈ విషయం ముందే తెలుసా??
తరువాత తెలిసీ పదవిని వదులుకోలేక,మళ్లీ పోటీ చేస్తే దిక్కు ఉండదని లేక జగన్ దగ్గర భయపడో మాకు వచ్చిన నష్టం ఏమీ లేదంటూ ఉంటున్నారా??
విశాఖ రాజధాని చేస్తే ఏ విధంగా ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ది చెందుతుంది??
రాయలసీమకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇస్తే టీ షాపులు,రెవెన్యూ దస్తావేజులు రాసేవారు తప్ప అనంతపురం కరువుకి ఏ రకంగా సమాధానం దొరుకుతుంది??
ఇవ్వన్నిటికి సమాధానం ఇవ్వాలి..
YSR తన కొడుక్కు, "దోపిడీ" పథకం ద్వారా సాక్షి, భారతి ఇచ్చాడు, తన అనుయాయులకు కూడా ఇలానే ఇచ్చాడు.
"దోపిడీ"తో పోలిస్తే, YS ఇతర పథకాల వల్ల జరిగే లబ్ది శూన్యంతో సమానం, కానీ దోపిడీ పథకం అందరికీ వర్తించదు.
ఈ దోపిడీ పథకంలో భాగమే, అమరావతి నుండి వైజాగ్ కు మార్పు.
అమరావతి నుండి వైజాగ్ కు రాజధానిని మార్చడానికి, HC అనే బిస్కెట్ RSకు, అసెంబ్లీ అనే బిస్కెట్ అమరావతికి చూపిస్తున్నారు వైజాగ్లో పెట్టాలనుకొన్నవి RSలో పెట్టగలరా? లేనప్పుడు మూడు రాజధానులు అనడం ఎందుకు? RSకు HC వచ్చేవరకు, వైజాగ్ కు తరలించకుండా ఉండగలరా? ఎందుకు ఉండలేరు?
అసలైన వికేంద్రీకరణ అంటే ఇది, ఏపీని 5 ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక సం సీఎంను ఎన్నుకోవాలి, ఆ సం రాష్ట్ర రాజధాని కూడా ఆప్రాంతంలోనే ఉండాలి.- jaglak laa memu alochinchalemaa?
ఐదుగురు డిప్యూటీ సీఎంలు 3 రాజధానులు 2.5సం మినిస్టర్లు సీఎం మాత్రం ఒకరే ఎందుకు? సిఎంను కూడా, ఒక్కొక్క సం ఒక ప్రాంతం నుండి ఎన్నుకోవచ్చుగా? తనవరకు వచ్చేసరికి YS జగన్ స్వార్థం బయట పడింది, మిగిలిన పదవులు, రాజధాని ప్రజలను విడగొట్టడానికి పావులు. 40yrs గా పులివెందుల mla, 30yrs గా కడప ఎంపీ వీడి కుటుంబం నుంచే. 2004-09 మధ్య 10కోట్ల నుండి 10,000కోట్లకు పెరిగిన ఆస్తి. వీడికంటే స్వార్దపరుడు, మోసగాడు ఉంటారా?