top of page
Writer's picture Tyler Durden

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పై ప్రభుత్వానికి “సైనిక స్వరం” ప్రశ్నావళి

Updated: Nov 26, 2019

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పోలవరం రివర్స్ టెండరింగ్ పై వాస్తవాలు వివరించేందుకు చిన్న ప్రయత్నం ఈ వ్యాసం.

అలాగే ఇది అతి పెద్ద విజయం అని గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీకి,అధికార మీడియాకి సైనికస్వరం నుండి కొన్ని ప్రశ్నల సమాహారం .


పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి.ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టు వల్ల ప్రజలకి ఒనగూరే లాభాలు అనేకం.ప్రజలకి ఇప్పటి వరకు పోలవరం ప్రోయోజనాలు అందలేదు కానీ,ప్రజా ప్రతినిధులకీ,పార్టీలకీ,నిర్మాణ సంస్థలకి మాత్రం వర ప్రదాయినిలా మారింది.ప్రభుత్వాలు మారడం,టెండర్లలో అవినీతి జరగడం,అరెరె ఆ పార్టీ వాళ్లే అంత దోచుకున్నారు, మనం అంతకుమించి దోచుకోవాలి అని మరో పార్టీ వాళ్ళు చూడడం .ఇదో నిరంతర ప్రక్రియలా మారింది.వెరసి ప్రజా ధనం వృధా అవుతుంది.


నాడు తెలుగు దేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రచార ఆర్భాటాల పేరుతో ప్రజా ధనం దోపిడీ చేసింది.తమ అనుకూలురకు కేటాయింపులు చేసి వ్యయం అధికంగా చూపించి రాచ మార్గాన దోపిడీ చేసింది. నేటి వైకాపా ప్రభుత్వం ఆదా పేరు చెప్పి అడ్డదారిలో దోచుకునే దిశగా సాగుతుంది.




తాజాగా వైకాపా ప్రభుత్వం ఊదర గొడుతున్నరివర్స్ టెండరింగ్లో మే”ఘా” విజయం వెనక ఉన్న వాస్తవాలు ఏమిటో ఓసారి చూద్దాం

.

రివర్స్ టెండరింగ్ – నయా నాటకం

అసలు ఇది రివర్స్ టెండరింగ్ ఏ కాదు.ఒకే ఒక్క సంస్థ టెండర్లు వేసింది ఆ సంస్థకే పట్టం కట్టారు.ఇది మా మాట కాదు.పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు చెప్పిన మాట.




ప్రశ్న 1

పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఏమిటి?అధికార పార్టీ ఘన చరిత్ర చూసి వెనకడుగు వేశారా?లేక ఇతర కారణాలా?ఒకే సంస్థ పాల్గొంటే దానిని కప్పిపుచ్చి అసలు జరగని రివర్స్ టెండరింగ్ జరిగింది అని,అది మే””ఘా” సక్సెస్ అని ఎందుకు ఊదర గొడుతున్నారు??


సాంకేతిక సామర్ధ్యం చూడకుండానే టెండర్లు కట్టబెట్టిన వైనం

టెక్నికల్ బిడ్,ఫైనాన్షియల్ బిడ్ అనేవి చూసి,నిర్మాణ సంస్థ శక్తి సామర్ధ్యాలు పరిశీలించి, వీరికున్న వనరులతో వారు ఇచ్చిన అంచనాలతో నిర్ణీత సమయంలోపు నిర్మాణం పూర్తి చేస్తారా అనేవి పరిశీలించి అప్పుడు కేటాయింపు అనేది జరుగుతుంది.కానీ ఇక్కడ టెక్నికల్ బిడ్ అనేది వేయక మునుపే టెండర్లు కట్టబెట్టారు అధికార పార్టీ వారు.


ప్రశ్న 2

సంస్థ సామర్ధ్యం ఎందుకు పరిశీలించలేదు? రేపు ఆలస్యం అయితే భాద్యులు ఎవరు?దీనిపై ప్రభుత్వం స్పందన ఏమిటి?


58 నెలలకి పెరిగిన కాల వ్యవధి

ఇప్పుడు 780 కోట్లు ఆదా అయ్యింది అని ప్రజలని నమ్మిస్తున్న అధికార మీడియా ఈ విషయం పై కూడా స్పష్టత ఇచ్చి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే బావుంటుంది.

మేఘా సంస్థ తమ నిర్మాణం కోసం కాల వ్యవధిని 58 నెలలకి పెంచింది,నవయుగ వారు 28 నెలలు అని తెలిపారు.అంటే గత అంచనాల కంటే రెండితలకి పైగానే .


ప్రశ్న 3

మరి కాలం తో పాటు పెరిగే ఖర్చులు ఎవరు భరిస్తారు???ఇప్పుడు 780 కోట్లు ఆదా అని ఊదరకొడుతుంది రేపు అంచనాలు పెరిగాయి అని చెప్పి వేల కోట్లలో స్వాహా చేసేందుకా??


నాడు చంద్రబాబు మిత్రులు – నేడు జగన్ రెడ్డి మిత్రులా??

వైకాపా వారు ప్రచురించిన పుస్తకం ఇది – Emperor of Corruption ,చంద్రబాబు అవినీతి చరిత్ర అని నాటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్ గారు ఆవిష్కరించిన పుస్తకంలోని 22వ పేజీలోని మాటల సారాంశం “ పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వర ప్రదాయిని,ఈ ప్రాజెక్టుని పూర్తి చేయకుండా పోలవరంలో అంతర్భాగం అయిన పట్టిసీమ అనే ప్రాజెక్టుని తీసుకొచ్చి తన దగ్గరి వారు అయిన మేఘా వారికి కట్టబెట్టారు








ప్రశ్న 4

అయ్యా,ఆ ఆరోపణలు చేసింది మీరు.మరి మీరు మళ్ళీ ఆయన అనుయాయీలకే ఎందుకు కట్టబెట్టారు,అదీ ఏక పక్షంగా,నిబంధనలు మీరి మరీ?? ఈ లెక్కన మీరు తెలుగు దేశం బీ – టీమ్ అనుకోవచ్చా?? లేక పట్టిసీమలో బాబే అంత అవినీతి చేస్తే పోలవరం ద్వారా మరింత దోచుకోవచ్చు అనుకున్నారా??



కోర్టులో ఉన్న కేసుకి వైకాపా ఇచ్చిన తీర్పు చెల్లుతుందా??

తమను అన్యాయంగా తప్పించారు అని నవయుగ సంస్థ హై కోర్టులో కేసు వేసింది .ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది,కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకూ అధికారికంగా ఎవరూ ఖరారు కానట్లు.


ప్రశ్న 5

కోర్టు తీర్పుని అనుసరించే నిర్మాణం ఎవరు చేపట్టాలి అనేది తేలుతుంది.కానీ ఇక్కడ అధికార పార్టీ మాత్రం మేఘాదే కాంట్రాక్టు అని తీర్పు ఇచ్చి సంబరాలు చేస్తుంది కూడా?ఎందుకు అంత తొందర ?ఈ విషయం అధికార మీడియాలో ఎందుకు ప్రస్తావించరు?


ప్రశ్న 6 - నష్టం భరించే వ్యాపార సంస్థలు ఉన్నాయా ??

ప్రభుత్వం ఇచ్చిన కొటేషన్ కంటే తక్కువకే పనులు పూర్తి చేస్తాం అంటున్నారు,అంటే నష్టం వస్తుంది అని తెలిసి మరీ టెండర్లు పొందారు.నష్టాన్ని భరించే వ్యాపార సంస్థలు ఉన్నాయా?మేఘా సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థా?లేక వ్యాపార సంస్థా??

ఎలా తగ్గించి ఇచ్చారు కొటేషన్?ఎక్కడ వ్యయం తగ్గిస్తారు,నాణ్యత విషయంలో రాజీ పడతారా?ఎలా ఖర్చుని తగ్గిస్తారు??


అసలు ఈ ప్రచార ఆర్భాటాల వెనకున్న ఆంతర్యం ఏమిటంటే...

అద్భుత విజయం,ముఖ్య మంత్రి దూర దృష్టి అని ప్రభుత్వం ఇంత ప్రచారం చేసుకోడానికి వెనక చాలా పెద్ద కుట్ర ఉంది.


రాష్ట్రంలో,ప్రజలలో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత,ప్రజా సమస్యల నుండి దృష్టి మరల్చేందుకే దీనిని ఘన విజయంగా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.


బోటు ప్రమాదం వంటి ఘోర సంఘటన జరిగి కనీసం ప్రయాణీకుల సంఖ్య,మృత దేహాల ఆచూకీ కూడా చెప్పలేని ప్రభుత్వ అసమర్ధతని కప్పిపుచ్చేందుకు ఇదో అస్త్రంలా దొరికింది.


యువత భవితతో చెలగాటం ఆడి,అస్మదీయులకే ఉద్యోగాలు వడ్డించిన గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇదో అవకాశంలా మారింది


తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుల నియామకం,వరద నిర్వాసితులని ఆడుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం వంటి వాటి నుండి ప్రజలను పూర్తిగా మళ్లించి తమ ప్రభుత్వం ఏదో ఘన కార్యం చేసినట్లు ప్రజలు భావించాలని అధికార పార్టీ,అధికార మీడియా తెరలేపిన బూటక నాటకం ఈ టెండర్ల కేటాయింపు ప్రక్రియ .


ప్రచారం కోసం,పేరు కోసం నాడు చంద్రబాబు ఎలా తహతహలాడారో,నేడు జగన్ రెడ్డి గారు కూడా అదే పంధాలో సాగుతున్నారు.తనకున్న మీడియా ద్వారా,తమకున్న బలగం ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియనివ్వకుండా చేస్తూ పక్క దారి పట్టిస్తున్నారు.



మే”ఘా” విజయ ప్రచార ఆర్భాటాల వెనక దాగున్న అసలు వాస్తవాల్ని ప్రజలకి చేరవేయాల్సిందిగా జనసైనికులకు మనవి చేస్తుంది సైనికస్వరం.

483 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page