ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఆవిర్భవించిన మన భారత దేశం మనకి కల్పించిన అతి గొప్ప ఆయుధం భావ వ్యక్తీకరణ స్వేచ్చ "Right to Expression" అంటే ఎవరైనా తన భావాలను ఇతరుల భావాలకు ఇబ్బంది కలగనంత వరకూ వ్యక్తీకరించవచ్చు.దీనిని మనం ఎంత వరకూ సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నాం అంటే బహుశా చాలా స్వల్పంగా అని చెప్పుకోవాలి. మనం మన భావ వ్యక్తీకరణలో ఎప్పుడూ కూడా ఇతరులను నిందించడం, గెలిచేయడంలో ముందు ఉన్నాం కానీ సహేతుకమైన విమర్శలు ఎంత వరకూ చేస్తున్నాం అనేది ఒకసారి పునః పరిశీలన చేసుకోవాలి.
భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు జనసేనకు ఇక్కడ ఏమిటి సంబంధం అనే ప్రశ్న ఇప్పటికే చాలా మందికి వచ్చి ఉండాలి.ఒకవేళ రాకున్నా కొంచెం ఓపిక చేసుకొని చదవడానికి ప్రయత్నించగలరు.
జనసేన ఆవిర్భవించింది మొదలు ఒక సినీ పవన్ కల్యాణ్ అభిమానిగా ఉన్న మనల్ని ఒక కార్యకర్తగా మలుచుకోవడానికి మన నాయకుడు మనకి ఇచ్చిన సమయం 5 సంవత్సరాలు. కానీ మనల్ని మనం మలచుకోవడంలో ఎంత సఫలం అయ్యాము అంటే చాలా స్వల్పం అని చెప్పేందుకు నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకేనేమో నేను పాతిక సంవత్సరాల సుధీర్గ రాజకీయం చేయడానికి వచ్చాను అని ఉటంకిస్తూ ఉంటాడు జనసేనాని.
మరే ఇతర పార్టీలలో లేనిది జనసేనలో ఉన్నది “అంతర్గత ప్రజాస్వామ్యం”. అంటే అట్టడుగున ఉన్న కార్యకర్త కూడా ఆధిస్థానం అది చేయాలి, ఇధి చేస్తే బావుంటుంది అని సహేతుకమైన, నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇచ్చే వెసులుబాటు ఉంది.కానీ దీన్ని మనం ఎంతవరకూ వినియోగించుకుంటున్నాం అంటే శూన్యం.
బహుశా చదువుకున్న,మరియు అధికంగా మేధో సంపద కలిగిన యువత కలిగిన పార్టీ అయి ఉండడం వల్ల కావచ్చు.
పార్టీ అంతర్గత వివరాలు కేవలం అంతర్గతంగానే ఉండాలి వాటిని బయటకి వ్యక్తీకరించకూడదు అలా చేయడం వల్ల, పార్టీకి చాలా అనర్ధాలు జరుగుతాయి,మరియు హేళనకి గురి కాబడతాం అని ఆలోచన లేని అతి మేధో సంపద కలిగిన కార్యకర్తలు కలిగిఉండడం కేవలం జనసేనకే చెల్లు.
ఇలా ఎన్ని చేసినా వారి తప్పుల నుండి వాళ్ళే నేర్చుకుంటారులే అని తండ్రి పాత్ర పోషిస్తున్నారు సేనాని. మనం ఎంత వరకు మన తప్పుల నుండి నేర్చుకున్నాం అని స్వీయ ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒకసారి.
అంతర్గత ప్రాజాస్వామ్యం – చేదు అనుభవాలు
అధినాయకుడు మనకి కలిగించిన అంతర్గత ప్రజస్వామ్యం వలన మనం పార్టీకి చేసిన,నేను గమనించిన మరియు నాకు అర్ధమైన కొన్ని నష్టాలు:
పార్టీ తీసుకున్న కొన్ని అంతర్గత నిర్ణయాలు బహిరంగ వేదికలైన Facebook,Twitter వంటి సామాజిక మాధ్యమాలలో ఉంచి అధినేత నిర్ణయాన్ని పలచన చేసి మిగిలిన పార్టీ వారిని మనల్ని విమర్శించే అవకాశం మనమే కల్పించడం
అధినాయకుడు లేదా తాను నియమించిన సభ్యులను గురించి లేక వారు చేసిన కొన్ని మీకు నచ్చని పనులను ఇవే సామాజిక మాధ్యమాలలో ఉంచి పరువు తీయడం
ఎన్నికలలో తాను నిలబెట్టిన నాయకులలో తనని చూసుకోమని చెప్పినప్పటికీ కూడా వారు తమకు నచ్చలేదు అని బహురంగ విమర్శలు చేస్తూ అధినాయకుడిని విమర్శలు చేయడం
తాను నాయకుడిగా మారినా మనం ఇంకా కార్యకర్తగా పరిపక్వత చెందకుండా ఇంకా తనలో అభిమాన కధానాయకుడిగా చూస్తూ తాను తల దువ్వినా తాను ఒక మాట అన్నా, సామాజిక స్పృహ లేని ఏవో ఎలెవషన్ తో కూడుకున్న పాటలతో హోరెత్తింపచేయడం
తన మీటింగ్ కి వెళ్ళి తాను ఏం చెప్తున్నది వినకపోగా అరుస్తూ సామాన్యుడికి కూడా తన ఆలోచనని,సందేశాన్ని చేరనివ్వకుండా చేయడం
పరిష్కారం
అధినేత తీసుకున్న ఏ నిర్ణయమైన అది పార్టీకి, ప్రజలకి మంచి జరుగుతుంది అని భావిస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్లాలి.ఒక వేళ అది మంచి చేయట్లేదు అని మీరు భావించినపుడు సహేతుకమైన కారణాలను లిఖితపూర్వకంగా ఉదహరిస్తూ అది అఃదినేతకి చేరే మార్గాలను అన్వేషించి అందేలా చేయాలి కానీ,సామాజిక మాధ్యమాల ద్వారా వాటిని కించపరుస్తూ ఏ ఎటువంటి రాతలు కానీ చర్యలు కానీ చేయకూడదు.
పార్టీ తీసుకున్న ఎటువంటి నిర్ణయంలో అయినా మీకు చిన్న లోపం కనిపిస్తే దానిని అధిగమించి,దానిని సరిపుచ్చేలా సమయస్పూర్తితో ముందుకి తీసుకువెళ్లాలి (అదే రాజకీయం అంటే).
ఉదాహరణ
ప్రధాన మంత్రి మోడి తిరుమల దర్శనార్ధం వచ్చినపుడు ముఖ్యమంత్రు హీదాలో మర్యాదపూర్వకంగా కలిసినపుడు ఆయన ఇచ్చిన పువ్వుని చూపిస్తూ వ్వారి పార్టీ కార్యకర్తలు చేసిన పోస్టులను గమనించగలరు.
ఒక ప్రధానిని పది నిమిషాలు ఎదురుచూసేలా చేసిన ముఖ్యమంత్రి గారు అనే విడియోలతో సదరు పార్టీ కార్యకర్తలు అదొక గొప్పగా సమర్ధించుకున్నారు.
ఇప్పుడు మనకున్న సమయంలో మనం మన పార్య్ని బలోపేతం చేసుకోవడం తో పాటుగా రాష్ట్రానికి సంబందించి అనేక విషయాలపై అవగాహన పెంచుకుంటూ ప్రభుత్వం చేసే పనులలో డొల్లతనాన్ని నిర్మాణాత్మకంగా విమర్శిస్తూ ముందుకు సాగితే బాగుంటుంది అని నా సూచన.
అధినాయకుడు ప్రసంగిస్తున్నపుడు అనవసరపు ఈలలు, కేకలతి హోఎత్తించకుండా ఆయన చెప్పే ప్రతీ అంశాన్ని ప్రజలకు చేరేలా మన ప్రయత్న లోపం లేకుండా కృషి చేయాలి.
చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను... ఒక కార్యకర్త ఎప్పుడూ కూడా "SERVANT TO LEADERSHIP"అనే నినాదాన్ని నమ్మి ముందుకు వెళ్లాలి. తద్వారా కార్యకర్తగా పార్టీతో పాటు సమాజనికీ మేలు చేసిన వాళ్ళం అవుతాము అని విన్నవించుకుంటూ.
ఇంత ఓపికతో ఇదంతా చదివిన మీ అందరికీ మనః పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.
-మీ జనసైనికుడు
Truly said 👍👍