top of page
Writer's pictureSainika Swaram

జన చైతన్యానికి - జన చేతనానికి జనసేన


పోరాటాలు,విప్లవాలు,ఉద్యమాలు "మార్పు" కోసం పుడతాయి. అది దశాబ్దాల దోపిడీ,దుర్మార్గం,చిన్నచూపు ఇలా ఏదైనా ఉద్యమానికి దారి తీయచ్చు. ఉద్యమం కోరేది మార్పు. ఆ మార్పు వస్తే తమ జీవితాలు బాగుపడతాయి అనే ఆశ ప్రజలది. ఒక ఉద్యమం పురుడుపోసుకోవాలి అంటే నడిపించే నాయకుడు ఎంత అవసరమో, వెనుక నడిచే ప్రజలు అంతే ముఖ్యం.

సామాజిక విప్లవం,సామాజిక మార్పు కోరుకునే వాళ్లు చాలా మంది ఉంటారు ,కానీ ముందుకి రారు,దానికి కారణాలు రాజకీయ ఒత్తిడి కావచ్చు,"మనకెందుకు లే" అనే అభిప్రాయం కావచ్చు.ఆశించిన మార్పు రావాలి అంటే నాయకుడికి అవగాహన తో పాటు చిత్తశుధ్ధి ఉండాలి - ప్రజలకి మార్పు మీద వాంచ తో పాటు చైతన్యం ఉండాలి. వ్యవస్థీక్రృతమైన మార్పు రావడానికి ప్రజా చైతన్యం అవసరం - ఆ చైతన్యాన్ని రగిలించేదే "జనసేన". మార్పు ప్రజల ద్వారానే రావాలి.

రాజకీయం ప్రజల జీవితాలలో ఓ భాగం. రాజకీయం అంటే సామాన్యుడి ద్రృష్టిలో పార్టీలు ,అధికార దాహం, కుట్రలు, డబ్బు. రాజకీయాలు సామాన్యుడి జీవితాన్ని అనుక్షణం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అది పిల్లల చదువు దగ్గర నుండి పెద్దల ఉద్యోగం వరకు. తమ జీవితాలని ఇంత ప్రభావితం చేస్తున్నా సామాన్య ప్రజానీకం ఎందుకు రాజకీయానికి దూరంగా ఉంటున్నాయ్?

రాజకీయం మారిస్తే తమ జీవితాలు మారుతాయ్ అని తెలిసీ ఎందుకు ఆ "మార్పు" కి ప్రయత్నించడం లేదు? పార్టీలు చేసేవి ఏంటో తెలుసు, వాళ్ల అబధ్ధపు హామీలు తెలుసు, రాజ్యాంగ విరుధ్ధమైన పనులు తెలుసు అయినా ఎందుకు "మార్పు" కి పూనుకోవడం లేదు? దీనికి సమాధానం రాజకీయ పార్టీలు ప్రజలని పాలనలో "భాగస్వామ్యులు" గా కాకుండా "ఓటర్లుగా" చూడడం ఒకటైతే ఓటర్ల పని కేవళం ఓటు వేయడమే అనుకుని అసలు ప్రశ్నించాలి అంటే భయపడే వ్యవస్థని తయారు చేశారు "రాజకీయ"నాయకులు.

రాజకీయమంటే కుటుంబ పాలన, రాజకీయం అంటే డబ్బు,అండ బలం.

వీటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు

సామాన్యుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సామాన్యుడికి అండగా సామాన్య ప్రజానీకానికి "చైతన్యం" కలిగించడానికి ,ప్రజలకి ధైర్యం ఇవ్వడానికి, రాజకీయం అంటే కుటుంబాలకే పరిమితం కాదు, డబ్బు అవసరం లేదు అని చాటిచెప్పింది "జనసేన".ప్రజల్లో చైతన్యం రావాలి అంటే ప్రజలు ప్రజాస్వామిక వ్యవస్థలో పాల్గొనాలి. అంటే కేవళం ఓటు వేసి ఆగిపోవడం కాదు. ఓటు వేసిన నేత అసలు చేసిన వాగ్ధానాలు నెరవేర్చాడా లేదా? అసలు చెప్పేవి చేసేవాటికి ఎంత వరకు పొంతన ఉంది? ఇవన్నీ ప్రశ్నించాల్సిన భాధ్యత ప్రజలది. నాయకులు కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, జవాబుదారీతనం గురించి అవగాహన కల్పించడానికి 10,00,000 మంది తో ధవలేశ్వరం మీద కవాతు నిర్వహించారు.! అసలు రాజకీయ జవాబుదారీ తనం గురించి మాట్లాడిన పార్టీలు ఉన్నాయా?

ప్రజలు - అవకాశాల కల్పన - మార్పు

సగటు పౌరుడు సామాజికంగా,రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి అంటే "అవకాశాల కల్పన" ముఖ్యం. సమానంగా అవకాశాలు కల్పిస్తేనే వ్యక్తి లో ఉన్న "ప్రతిభ" బయటపడుతుంది. రాజకీయంగా సమాన అవకాశాల కల్పన అంటే ఓటు హక్కు ఒక్కటే కాదు! ప్రధాన రాజకీయ పార్టీలు ఎంత మంది సామాన్యులకి రాజకీయంగా అవకాశాలు కల్పించాయి అన్నది ఇక్కడ చర్చ. సామాన్యుడు అంటే "విషయావగాహన" లేకుండా ఉండే వాళ్లు కాదు. ప్రతిభ ఉండీ పైకి రాలేని వాళ్ల గురించి. యువత లో ప్రతిభ కోకొల్లలు. కానీ ఆ యువతకి ప్రాధాన్యత ఎంత అనేది ప్రశ్న! ఇక్కడ యువత అంటే "వారసత్వ యువత" కానే కాదు. అతి సామాన్యులలో ప్రతిభ కలిగిన యువత అని. ఇక్కడ రాజకీయాల్లో ఎదుగుదల ఉండాలి అంటే అండ బలం ,అర్థ బలం ఉండాలి అనేది "ప్రామాణికం" గా పార్టీలు ప్రజలని నమ్మిస్తూ,ఒప్పించాయి. యువత లో ఉన్న ప్రతిభ బయటకి రావాలి అంటే అవకాశం కల్పించాలి. రాజకీయం కొన్ని కుటుంబాలకే అనే ప్రామాణికాన్ని తొలగించి "ప్రతిభ ఉన్న యువతకి" అవకాశం కల్పించింది జనసేన. ప్రజలు పడే భాధలు,సమస్యలు ప్రజలకే తెలుస్తాయి. ప్రతి సమస్యకి సమర్థవంతంగా పరిష్కారాలు చూపాలి అంటే నాయకులకి అవగాహన తో పాటు "చిత్తశుధ్ధి" ఉండాలి. ఇప్పుడున్న నాయకులకి ఆ రెండూ లేవు.కేవళం ఓట్ల కోసం హామీ ఇచ్చి మర్చిపోయే నాయకులే ఎక్కువ. ఇలాంటి సమయంలో ప్రజల్లోంచి నాయకులు రావాలి, వాళ్ల సమస్యలని వాళ్లే వేదిక మీద బాహాటంగా చెప్పేలా జనసేన శిబిరాలు ఏర్పాటు చేసారు. కొన్ని కుటుంబాలకి మాత్రమే రాజకీయాలు పరిమితం కాదు అని నిరూపించడానికే ఇది. జనసేన శిబిరాల ద్వారా యువతలో ఉన్న నాయకత్వ లక్షణాలని బయటకి తీసారు. అంతే కాకుండా 2019 లో దాదాపుగా 85% యువతకి అవకాశం కల్పించారు. ఓడినా గెలిచినా "మార్పు" కి పూనుకుంది "జనసేన". అవకాశం కల్పిస్తే నాయకత్వ లక్షణాలు,సమస్యకి పరిష్కారాలు, తద్వారా అభివ్రృధ్ధి. ఇక్కడ అవకాశం ఎంత ముఖ్యమో చిత్తశుధ్ధి అంతే ముఖ్యం.

సిధ్ధాంతాలు - సామాజిక సుస్థిరత

ఏ పార్టీకైనా, ఉద్యమానికైనా పోరాట పంధా కానీ అనుసరించాల్సిన విధానం కానీ , అసలు మనం చేసే దాని ద్వారా ఏం సాధించాలనుకుంటుంన్నాం , ఏం ఆశిస్తున్నాం అన్నది సిధ్ధాంతాల ద్వారా తెలుస్తుంది. పార్టీ సిధ్ధాంతాలు అంటే ఒక పార్టీ "అధికారం కోసమే" అనేది తప్ప అసలు దాని ఉద్దేశం ఏంటో కూడా తెలియని పరిస్థితి. అటువంటి సమయంలో జనసేన 6 సిధ్ధాంతాలు - కులాలని కలిపే ఆలోచనా విధానం

మతాల ప్రస్థావన లేని రాజకీయం

భాషల్ని గౌరవించే సాంప్రదాయం

సంస్క్రతులని కాపాడే సమాజం

ప్రాంతీయతని విస్మరించని జాతీయ వాదం

అవినీతి మీద రాజీ లేని పోరాటం.

సిధ్ధాంతాలు చెప్పడానికి బానేఉంటాయి,కానీ చేతల్లో ఎంత వరకు చేసి చూపిస్తున్నారు అన్నది ప్రశ్న. సిధ్ధాంతాల అమలు ఎలా ఉందో తెలియాలి అంటే ఆ పార్టీ అనుసరించిన విధి విధానాలని చూడాలి.


మొదటిది కులాలని కలిపే ఆలోచనా విధానం - భారత రాజకీయ వ్యవస్థలో కులాలని విడదీయలేని పరిస్థితి. కాబట్టి కులాలని ఓటు బాంకు గా వాడకుండా, అన్నిటిని సమానంగా చూడడమే లక్ష్యం. కులాలు,వర్గాల మధ్య ఉండే భయాలని,గొడవలని తగ్గించడమే లక్ష్యం. దాని దిశ గానే సమాజాన్ని ఏకం చేయడమే జనసేన లక్ష్యం!

ఇతర నాయకుల్లాగ మత్ర్యకారులకి ,ఎస్టీ లకి గొడవలు పెట్టడం

కాపులకి,బి.సి లకి గొడవలు పెట్టి రాజకీయ లబ్ది పొందడం జనసేన చేయదు కులాల వారీగా విభజించడం కాదు అన్ని కులాలు ఒకటే!

అందరూ సమానమే అందుకే అందరికీ ఒకటే హాస్టల్. వాళ్ల కులం వాళ్లు 5%మే ఉన్నా 50% సీట్లు ఇస్తారు!

అధికార ప్రతిపక్ష నాయకులు,నేతలు!

5% ఉన్నవాళ్లకి 50% అవసరమా?

అన్ని కులాలకి సమాన ప్రాధాన్యత కల్పించడం అవసరం! ప్రాతినిధ్యం కల్పిస్తేనే అందరికీ సమాన అభివ్రుధ్ధి!

మతాల ప్రస్థావన లేని రాజకీయం -

మతాలని అడ్డుపెట్టుకుని ఓటు బాంకు రాజకీయాలు చేయడం కాకుండా సమాన అవకాశాలు కల్పించడం. మతాలని అడ్డుపెట్టి తాయిలాలు ఇచ్చి మభ్యపెట్టే రాజకీయం అసలే చేయదు.

భాషలని గౌరవించే సాంప్రదాయం -

భాష ,సంస్క్రతి ప్రజలని కలుపుతాయి.

భారతదేశంలో తొలి రాష్ట్రాలు బాషా ప్రయుక్త రాష్ట్రాలు. ప్రతి భాషకి ఆ ప్రాంత ప్రజలకి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. తల్లి భాష విలువని ఆ భాష ఔన్నత్యాన్ని తరువాతి తరాలకి చేరేలా చూడడం. భారత ఉపఖండం లో వందల భాషలు ఉన్నాయి, ఏ ప్రాంతం వాళ్లు ఆ భాషని కాపాడుకుంటూ వస్తారు.

జనసేన "మన నది - మన నుడి" ఇందులో రెండు సిధ్ధాంతాలు ఉన్నాయి.

మన నుడి - అమ్మ భాషని కాపాడుకోవడం. ఆంగ్ల మాధ్యమం ఎంత ముఖ్యమో ,తెలుగు కూడా అంతే ముఖ్యం.ఆంగ్లం మోజులో తల్లి భాషని మరువకూడదు. దానికి అనుగుణంగానే అనేక గ్రంధాలయాల ఆధునీకరణకి సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు పవన్. ఇది భాషకి ఇచ్చే గౌరవం.

సంస్క్రతులని కాపాడే సమాజం -

మనిషి జీవితం ఆ సంఘం యోక్క సంస్క్రతి సాంప్రదాయాల మీద ఆధారపడిఉంటాయి. సంస్క్రతి ప్రజలకి నేర్పే విలువలు అమూల్యం.సంస్క్రతి ప్రజలని ఏకం చేస్తుంది. మన భాషని పరిరక్షించుకోవడం ఎంత అవసరమో, సంస్క్రతిని కూడా అదే విధంగా పరిరక్షించుకోవాలి. నేటి సంస్క్రతిని రేపటి తరాలకి అందేలా ,దాని ఔన్నత్యాన్ని తరువాతి తరాలకి చేరవేసేలా క్రృషి చేస్తుంది.

ప్రాంతీయతని విస్మరించని జాతీయ వాదం

- ప్రాంతీయ వాదం ద్వారా మనకి రావాల్సిన హక్కులని,ప్రాంతీయ ప్రతిపత్తిని కోరుతూనే దేశ సమగ్రతనీ కోరుకుంటాం. ప్రాంతీయ మరియు దేశీయ వ్యవహారాల మీద సమతుల్యత పాటిస్తుంది. ప్రత్యేక హోదా విషయం లో ప్రాంతీయ సమస్యలని లేవనెత్తింది. ప్రాంతీయ సమస్యలని,భావాలని విస్మరించకుండా జాతీయ స్థాయిలో ముందుకి వెళ్తుంది. ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు చేసినా!హక్కుల విషయంలో ఎవరు అన్యాయం చేసినా జనసేన ముందు స్పందిస్తుంది. ఉత్తరాది "నాయకులు" దక్షినాది వారి మీద చేసిన వ్యాఖ్యలని ఖండించింది.నిధుల పంపకం దగ్గర నుంచి ఇతర విషయాల కోసం ప్రాంతీయంగా ఏకం అయ్యి పోరాడుతుంది.

అవినీతి మీద రాజీ లేని పోరాటం -

అవినీతి అనేక స్థాయిల్లో ఉంది. ఎమ్మార్వో ఆఫీసు నుంచి వేల కోట్లు కాంట్రాక్ట్ ల వరకు!

చిన్న సర్టిఫికేట్ నుండి పెద్ద పెద్ద పనుల వరకు!ఇలా ప్రతిచోటా అవినీతి మయం చేసేసారు నాయకులు!సాగునీటి ప్రాజెక్టుల్లో వాటాలు!దొంగతనంగా కాంట్రాక్ట్ లు!సంక్షేమ పధకాలలో ఇలా ప్రతి దాంట్లో నాయకుల అవినీతి.

అవినీతిని తగ్గించాలి అంటే ముందు తగ్గించాలి అనే "చిత్తశుద్ది" నాయకుల్లో ఉండాలి. నాయకుల్లో చిత్తశుద్ది లేనిదో అది అసాధ్యం. ఎప్పుడైతే అవినీతిని తగ్గిస్తామో అప్పుడే అనగారిన వర్గాలకి న్యాయం జరుగుతుంది!

అంబేడ్కర్ కోరుకున్న సమాన సమాజాభివ్రుధ్ధి,ఆర్థికంగా సామాజికంగా సాధ్యం! అవినీతిని తగ్గించడం అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు,నిరంతర ప్రక్రియ.ప్రతి వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతిని తరిమేస్తేనే అభివ్రుధ్ధి సాధ్యం.వివిధ స్థాయిల్లో అవినీతి ని అరికట్టాలి అంటే ఒకటి స్పష్టం. జనం చైతన్యవంతులు కావాలి. అవినీతిని అంతం చేయాలంటే

Social Consciousness ఉంటే ఎది ఎప్పుడు అవసరం అని తెలిస్తే చాలు!

ప్రజలు భాధ్యతగా అవినీతిని పెంచకుండా,లంచం అడిగినప్పుడు అధికరాని అడినప్పుడే అవినీతి తగ్గించడం సాధ్యం.ప్రజల ఎప్పుడైతే సామాజికంగా జాగ్రృతం అవుతారో అప్పుడే సాధ్యం. జనసేన పోరాట యాత్రలో ఇసుక అక్రమాల దగ్గర నుండి మైనింగ్,రాజధాని వరకు అవినీతిని లేవనెత్తారు జనసేనాని.

"పర్యావరణాన్ని పరిరక్షించే అభివ్రుధ్ధి ప్రస్థానం" -

అభివ్రృద్ధి వళ్ల పర్యావరణం దెబ్బతినడం అనివార్యం. కాకపోతే ఆ అభివ్రుద్ధి వళ్ల కలిగే నష్టాన్ని తగ్గించడం మాత్రం మన చేతిలో ఉంది. ప్రభుత్వాలు,ప్రైవేటు వ్యక్తులు అడ్డగోలుగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. ఉదాహరణకి ఇసుక తవ్వకం - ఇసుక నిర్మాణ రంగానికి అవసరం. అలా అని ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వడం వళ్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది,దాని పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయి.

అమరావతి లో ఇసుక దోపిడీ నుంచి వంతాడ,బాక్సైట్ మైనింగ్ ,డంపింగ్ సమస్యలు, నదీ కాలుష్యం ఇలాంటి విషయాల మీద జనసేన పోరాటం చేసింది చేస్తుంది కూడా. నదులే జీవనాధారం.దీనికి అనుగుణంగా మన నది - మన నుడి లో నదుల పరిరక్షణ భాద్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చింది. నదుల పరిరక్షణ కూడా ముఖ్యం... ఎల్.జి పాలిమర్స్ సంస్థ విషయం లో కూడా జనసేన పోరాడుతుంది.

ఇలా చేసే ప్రతి పనిలో సిధ్ధాంతాలకి అనుగుణంగా,వాటిని అనుసరిస్తూ ముందుకి వెళ్తుంది జనసేన.

మీడియా - దాడులు - ప్రతిస్పందన

ప్రజలకి సమాచరాన్ని చేరవేయాల్సిన మీడియా (కొన్ని) అది తప్ప వ్యక్తులని,వ్యక్తుల కుటుంబాలని, లక్ష్యంగా చేసుకుని నడిపిన కార్యక్రమాలు తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. దీన్ని బట్టి అసలు మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించే పనిని ఆపి కొందరి ఆంకాంక్షల కోసం పనిచేస్తున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. కాకపోతే ప్రజలు దానిని ఏ విధంగా స్వీకరిస్తున్నారు అన్నదీ ముఖ్యం. మీడియా దాడుల ద్వారా తెలిసింది - ఒకడిని ఎదగనివ్వకుండా చేయడానికి ఎం చేయడానికైనా "వర్గ మీడియా" సంస్థల సిధ్ధం అనేది స్పష్టం.

జనసేన పోరాట యాత్ర - విజయాలు

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రాజధాని భూ సమీకరణ దగ్గర నుంచి ఇసుక సమస్య వరకు పవన్ గెలుపు,ఓటమి తో సంబంధం లేకుండా "సమస్యల పరిష్కారం" ,ప్రజల ఆకాంక్షలు పరిగణ లోకి తీసుకుని జనసేన ముందుకి సాగుతూనే ఉంది. ఉధ్ధానం కిడ్నీ సమస్య నుంచి సుగాలి ప్రీతి కేసు వరకు కూడా సమస్యని ఇతర పార్టీల్లాగా సాగతీయకుండా పరిష్కారం ధ్యేయంగా ముందుకి సాగింది ప్రయాణం. సమస్యకి పరిష్కారం దొరకాలి అంటే ప్రజలకి-ప్రభుత్వాలకి చర్చలు జరగాలి. ప్రజా ఆంకాంక్షల మేరకు మాత్రమే ప్రభుత్వం నడవాలి. ప్రజలు ఇదే కోరుకుంటున్నారు అంటూ మెజారిటీ ఇచ్చినంతమాత్రాన అదే సరైంది అనే ఆలోచన పోవాలి. తెదేపా ప్రభుత్వం ఉన్నంత కాలం ఇసుక,అవినీతి,రాజధాని పేరుతో అక్రమాలు, దోపిడీ ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు లెక్కలేనన్ని సమస్యలని లేవనెత్తారు పవన్. లేవనెత్తిన అంశాలు అన్నిటిని ఈ వ్యాఖ్యానం లో రాయలేం.సంక్షిప్తంగా ప్రభుత్వాలు భాధ్యత విస్మరించినప్పుడు

2016 లో బిజేపి ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా కోసం వ్యతిరేకించిన విధానం కానీ, 2018-19 లో తెదేపా అవినీతి అక్రమాల గురించి కానీ పవన్ స్పష్టంగా నిర్మొహమాటంగా లేవనెత్తారు.అదే వైసిపి పాలనలోను కొనసాగుతుంది.కానీ లక్షల కోట్ల అవినీతి అని అప్పట్లో ఆరోపించిన వైసిపి ఇప్పుడు ఆ ఆరోపణల మీద విచారణ ఎందుకు చేయడం లేదు!?.అనేది అసలు ప్రశ్న.

ఓటమి చిత్తశుధ్ధి ని తగ్గిస్తుందా!?

భారీ ఓటమి చవిచూసాక కూడా ప్రజలకి సేవ చేయాలి అనే తపన,చిత్తశుధ్ధి ఉంది కాబట్టే ఎమ్మెల్యే లేకపోయినా లక్షలాది భవన నిర్మాణ రంగ కార్మికులకి అండగా నిలిచారు. 151 ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ పేరుతో చేసిన వంచన ని లేవనెత్తారు.రాజధాని తరలింపు, ఇసుక,ఆంగ్ల మాద్యమం,సుగాలి ప్రీతి హత్య కేసు,టిటిడి భూములు, ఇలా ప్రతి సమస్యని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ సూచనలు అందిస్తూ ముందుకి సాగుతోంది జనసేన.

ఒకటి స్పష్టం. మార్పు కావాలి అని కోరుకుంటుంది కాబట్టి ఓటమి,గెలుపుల ప్రభావం జనసేన మీద లేదు. ప్రజలకి సేవ చేయాలి,చైతన్యం తేవాలి, అన్న ఉద్దేశం తో ఉన్నంతవరకూ ఏ శక్తి ఆపలేదు ఓటమి తో సహా. విప్లవం లో ప్రజల భూమిక కీలకం. ప్రజలని భాగస్వాములని చేయాలంటే ప్రజలతో అన్ని స్థాయిల్లో మమేకం అవ్వాలి . జనసేన అదే చేస్తుంది. పవన్ రాజకీయ జవాబుదారీతనం గురించి మాట్లాడారే కానీ "సిగ్గుపడే" విధంగా మాట్లాడలేదు. పవన్ "నాణ్యమైన విద్య"అందిస్తాం అన్నారే కానీ మాధ్యమం మారిస్తే బ్రతుకులు మారిపోతాయ్ అని చెప్పలేదు. సామాన్యులకి అవకాశం ఇచ్చారే కానీ "రాజకీయ వారసత్వాన్ని" కానీ డబ్బుని కానీ చూసి సీట్లు ఇవ్వలేదు. ఆడవాళ్లకి రక్షణ,ఒక వేదిక కల్పించారే కానీ అఘాయిత్యాలకి పాల్పడలేదు. ప్రజలని ఆలోజింపచేసేలా ఆయన ప్రసంగాలు ఉన్నాయే కానీ ఎదుటివారిని "దూషించే" విధంగా ఉండదు.

జనసేన ఓడిపోయి ఉండచ్చు. పవన్ ఓడిపోయి ఉండచ్చు కానీ ఎందుకు ఓడాడు ,కారణాలు ఏమిటి అన్నది పవన్ కంటే ప్రజలు ఆలోచించాలి. మార్పుకి బీజం ఆ ఆలోచనలు. ఓటమి ద్వారా ప్రజల్లో ఆలోచనని రేకెత్తించినా, జనసేన ఓడినా అనుకున్న లక్ష్యాన్ని చేరినట్టే.

1,995 views2 comments

Recent Posts

See All

2 commentaires


santhiraja38
08 juin 2020

చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేది దొమ్మరి గుడిసెలు (బీజేపీ )

J'aime

kanumuripirati
kanumuripirati
08 juin 2020

ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా మూల సిద్ధాంతాల పై ఒక సింహావలోకనం బాగుంది.

J'aime
bottom of page