క్షీర సాగర మధనం జరిపినపుడు వెంటనే అమృతం రాలేదు,మొదట వచ్చింది హాలాహలమే.ఒక గొప్ప ఫలితాన్ని ఆశించి ప్రయత్నం మొదలు పెట్టినపుడు వెంటనే అద్భుతాలు జరుగుతాయి అని ఆశించకూడదు.జనసేన, వ్యవస్థలో సమూల మార్పు కోసం అడుగు వేసింది,ఇది ఒక రోజులోనో,ఒక అయిదేళ్లలోనో అందుకునే లక్ష్యం కాదు.ఒక తరం పోరాడాల్సిన లక్ష్యం .అందుకు పదవులు ఒక సాధనం,ఎన్నికలు ఒక ప్రక్రియ.జనసేన పోటీ చేసిన మొదటి ఎన్నికల ఫలితం మనకి గరళాన్ని ఇచ్చింది.స్వీకరిద్దామ్.తప్పులు ఏమిటో తెలుసుకుంటున్నాము,ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహిస్తున్నాము,సూచనలు స్వీకరిస్తున్నాము.ఎలాంటి అవరోధాలు రానున్నాయో అర్దం చేసుకుంటున్నాము. ముందున్న కాలం చాలా క్లిష్టమైనది ,ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొబోతున్నాము. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి,ఇది శిక్ష కాదు,కేవలం పరీక్షా సమయం.అంతే,మరి ఈ పరీక్షా కాలాన్ని తట్టుకొని నిలబడాలంటే జనసైనికులుగా మనం సన్నద్దంగా ఉండాలి.మన జనసేన కోసం మనమూ కొన్ని భాద్యతలు స్వీకరించాలి. జనసైనికులుగా మన తక్షణ కర్తవ్యం ఏమిటో ఈ వ్యాసం లో తెలుసుకుందాం
1.మార్పు మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి
మనం మన వృత్తి రీత్యా సొంత నియోజకవర్గానికి దూరంగా మరో చోట ఉండాల్సి రావచ్చు,నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండలేక పోవచ్చు.మన పరిమితుల్లో,మనకున్న పరిధిలో మన ఇంట్లో వారితో సమయం కుదిరినప్పుడు రాజకీయాల పై చర్చ చేపట్టవచ్చు. రాజకీయాలకీ మనకీ ఏమీ సంబంధం లేదు అనుకోవాల్సిన పని లేదు.మన దైనందిన జీవితంలో జరిగే ప్రతీదీ రాజకీయాలతో ముడి పడి ఉన్నవే.కాబట్టి మనం సామాన్యులమ్ మనకెందుకు రాజకీయాలు అని అనుకోకుండా,ఇంట్లో వారితో వీలు చిక్కినప్పుడల్లా చర్చ చేపట్టవచ్చు.ఇతర పార్టీలకీ, జనసేనకి ఉన్న వ్యత్యాసం తెలపడం.వాళ్ళు చేసే అవకాశవాద రాజకీయాలు వంటి వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఇలాంటి రాజకీయాలకి భిన్నంగా జనసేన ఎలా ప్రత్యామ్నాయమో వివరించడం,జనసేన చేస్తున్న పోరాటాల గురించి తెలపడం.ఎవరు మంచి ఎవరు చెడో సవివరంగా తెలిసేలా చేయడం.
2.Organise – Educate – Agitate – వ్యవస్థీకరించు – చైతన్య పరుచు – ఉద్యమించు
అంబేడ్కర్ చెప్పిన సూత్రం ఇది. జన సైనికులుగా మనం ఒక సమూహంగా ఉన్నాము,ముందు మనం అంతా ఒక Organised wayలో నడవాలి,అది గ్రౌండ్ లెవెల్లో అయినా,సోషల్ మీడియాలో అయినా,ఎవరి దారి వారిది అన్నట్లు కాకుండా,ఒక నిర్దిష్ట ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. క్షేత్ర స్థాయిలో అయితే,వారానికోసారి సమీక్ష జరుపుకోవడం,చర్చలు చేపట్టడం.ప్రణాళికలు వేసుకోవడం వంటివి.సమస్యలు ఏమిటి ? నాయకులు ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి పరిష్కారం దిశగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏమిటి? ఎలా పరిష్కరింప చేయాలి అని పద్దతిలో ముందుకు వెళ్ళాలి. ఇది Organising
Educate – నాయకులు ఎన్నికల సమయ౦లో నియోజకవర్గంలో ఎన్నో హామీలు ఇచ్చి ఉంటారు,వాటిని వారు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో,తప్పింఛుకునేందుకు ఎలా కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారో, ప్రజలకి అర్దం అయ్యేలా చెప్పాలి.వారు నాడు చెప్పింది ఏమిటి – నేడు చేస్తుంది ఏమిటీ అని ప్రజలని చైతన్య పరచాలి.ఇలాంటి మాట దాటేసే రాజకీయాలకి జనసేన ఎలా ప్రత్యమ్న్యాయమో తెలియజేయాలి.ప్రజలని అయిదేళ్లకోసారి ఓట్లుగా మాత్రమే చూసే నాయకులకీ,మానవత్వంతో రాజకీయం చేసే జనసేనకి గల తేడాని వివరించాలి.తాత్కాలిక ఉపశమనాలు,స్వలకాలిక పధకాల వల్ల ప్రజలు ఎలా నష్టపోతున్నదీ ,భవిష్యత్త్ లో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది స్పష్టంగా తెలియజేయాలి – ఇది Educating,చైతన్య పరచడం
Agitate – పోరాటం
ప్రభుత్వ విధానాలు ప్రజారంజకంగా లేకుంటే,ప్రజలను ఇబ్బంది పెట్టె నిర్ణయాలు తీసుకుంటే,వాటికి ప్రజామోదం లేని పక్షంలో,ప్రభుత్వ నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకి నష్టం జరిగే పక్షంలో,జనసేన ఆ భాదితుల గొంతుక అవుతుంది. సేనాని ఆదేశానుసారం ఆ ప్రజా పోరాటాలు ఉంటాయి.నిరసనలు,దీక్షలు,కవాతులు ఇలా అవి ఏ రూపంలో ఉంటే అందుకు అనుగుణంగా నాయకుడి అడుగు జాడల్లో నడవడం మన భాద్యత.
మనం ముఖ్యంగా దృష్టి సారించవలసింది Organising & Educating మీద,పోరాటం నాయకుడు చూసుకుంటాడు,ఆ పోరాటానికి సేనని సమాయత్తం చేస్తాడు.గతంలో కూడా మనమెన్నో పోరాటాలు చేసినా,అవి సఫలీకృతం అయినా కూడా అవి ఎందుకు చేశాము,అనే విషయం సామాన్య ప్రజానీకానికి చేరలేదు.ఆ పొరపాటు ఈ సారి జరగకుండా చూసుకుందాం.
3.ప్రజలకీ – పార్టీకి మధ్య అనుసంధాన కర్తలుగా ఉండడం
అభిమానులుగా ఉన్న మనం జనసైనికులమ్ అయ్యాము,ఇప్పుడు పూర్తి స్థాయి కార్యకర్తలుగా మారాలి.స్థానికంగా ఉన్న సమస్యల్ని,స్థానిక జనసేన నేతల దృష్టికి తీసుకువెళ్లడం.వారు దాని పరిష్కారానికి చేసే పోరాటంలో మద్దతు ఇవ్వడం. ప్రజలు ఏం కోరుకుంటున్నారో,ఎలాంటి పరిష్కారం కావాలని అనుకుంటున్నారో నాయకులకి తెలిసేలా చేయాలి.స్థానిక నాయకుల చేత ఆ ప్రజలకి భరోసా ఇప్పించగలగాలి,ఎలాంటి సమస్య అయినా మీ పక్షాన జనసేన పోరాడుతుంది అని.అప్పుడే ప్రజలకి పూర్తి స్థాయి నమ్మకం కలుగుతుంది.జనసేన ప్రజలతో ఉంటుంది, ప్రజలలో ఉంటుంది అని రుజువు అవుతుంది.ఇలా చేయడం వల్ల స్థానికంగా నూతన నాయకత్వం కూడా సృష్టింపబడుతుంది. సంస్థాగతంగా పార్టీ కూడా బలపడుతుంది .ఒక వ్యవస్థీకృతమైన చానెల్ – కాడర్ – సెకండరీ లీడర్ షిప్ - లీడర్ – వంటివి ఏర్పడతాయి.
అలానే ఆ సమస్యల గురించి సామాజిక మాధ్యమాలలో చర్చ జరిగేలా చూడాలి,ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పది మందికీ తెలుస్తుంది.పబ్లిక్ ప్లాట్ఫాం కాబట్టి అందరి నుండి ప్రతిఘటన ఎదురవుతుంది అనే కారణం చేత అయినా అధికారులు స్పందిస్తారు.
ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి,ప్రజలు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, సమస్యలకి పరిష్కారాలు ఎలాంటివి అయితే బావుంటాయి, పార్టీ చేస్తున్న పోరాటాల గురించి ప్రజల స్పందన ఏమిటి అనేది ఎప్పటికప్పుడు పార్టీకి చేరేలా మనమే చొరవ తీసుకోవాలి.ఆ ఫీడ్ బాక్ మెకానిజం త్వరలో అందుబాటులోకి రావచ్చు పార్టీ తరఫు నుండి.
ఇలా ప్రజలకీ – పార్టీకీ మధ్య వారధిలా మారాల్సిన భాద్యత జనసైనికులుగా మనపై ఉంది.
4.నూతన పంధాలో పోరాటం
మనం చేస్తున్నది సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం పోరాటం.మనం కూడా ఇతర పార్టీలలా మూస ధోరణిలో కాకుండా,నూతన పంధాని ఎంచుకోవాలి.సమస్యల్ని ఎత్తిచూపేందుకు,నాయకుల వైఫల్యాల్ని ఎండగట్టేందుకు విభిన్నంగా ఆలోచించాలి,వారు ఇచ్చిన హామీలు వారు మాట తప్పిన వైనాల్ని ఫామ్ఫ్లెట్ ల రూపంలో ప్రచురించడం. ఫ్లెక్సిలు వేయించడం.లేదా సామూహిక సంతకాల సేకరణ,లేదా ఇది వరకు మన జనసైనికులు చేసినట్లుగా Red Revolution వంటి కార్యక్రమాలు ప్రజలలో ఆలోచనని రేకెత్తిస్తాయి.చైతన్య పరులని చేస్తాయి.ఇలా స్థానిక సమస్యల పై మనదైన శైలిలో స్పందించడం,పోరాడడం వల్ల సమస్య మూలాలు,వాటి తీవ్రత అందరికీ తెలుస్తాయి.ఎన్నికల సమయానికి ఆ నియోజకవర్గానికి ప్రత్యేక మానిఫెస్టో కూడా రూపొందించుకోవచ్చు,గత నాయకుల వైఫల్యాల్ని ఎండగడుతూ వాటిని మనం ఎలా పరిష్కరిస్తామో తెలుపుతూ.
5. Counter Mechanism
జనసేనాని తుంచేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతూనే ఉంటాయి.ఆనవసర ఆరోపణలతో జనసేన పై విషం కక్కుతూనే ఉంటారు.మన ఆత్మ స్థైర్యం దెబ్బ తీసేలా చర్యలు ఉంటూనే ఉంటాయి.అలా జరిగిన ప్రతీ సారి డీలా పడకుండా,జనసేన పై జరిగే విష ప్రచారాల్ని మనమే తిప్పి కొట్టాలి,ప్రతీ దానికి పవన్ కల్యాణ్ స్పందించాల్సిన అవసరం లేదు.తప్పుడు వార్తలు ప్రచురిస్తే,అది తప్పు అని నిరూపించాలి.అది సామాజిక మాధ్యమాలలో అవ్వచ్చు,బయట వారితో చర్చలలో అయినా అవ్వచ్చు.జనసేన కి unofficial spokes personగా మనమే మారాలి.
జనసేనకి రక్షణ వలయంగా మనమే నిలబడాలి.
6.ఎన్‌ఆర్‌ఐల సహాయ సహకారాల సద్వినియోగం
వృత్తి రీత్యా పరాయి దేశంలో నివసిస్తున్నా,మాతృ దేశానికి ఏదో చేయాలని,అది జనసేన ద్వారా జరగాలని కోరుకునే ప్రవాస భారతీయులు ఎందరో ఉన్నారు.ప్రత్యక్షంగా కాకపోయిన పరోక్షంగా అయిన జనసేన ద్వారా జనసేవ చేయాలనే ధృడ సంకల్పం వీరిలో ఉంది,అందుకే పార్టీకి నిధులు అందించడం మొదలు జనసైనికులు చేపడుతున్న సేవ కార్యక్రమాల దాకా అన్నిటిలో భాగస్వామ్యం అవుతున్నారు.వీరి సహాయాల్ని విస్తృతంగా వినియోగించుకోవాలి. నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని,అక్కడి ప్రజల్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి, లేదా మౌలిక వసతుల కల్పనకి నిధులు సేకరించి వారు స్థానిక కాడర్ తో,యువతతో కలిసి పనులు జరిగేలా చేసే frame work ని ఏర్పాటు చేసుకోవాలి.ప్రతీ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని,మోడల్ గ్రామంగా మార్చి జనసేన తీసుకురాబోయే మార్పు ఎలా ఉండబోతుందో మిగతా వారికి తెలిసేలా చేయాలి.
7. Optimum & Effective Utilization of Social Media - సామాజిక మాధ్యమాలని భాద్యతయుతంగా వినియోగించుకోవడం
సోషల్ మీడియాలో జనసైనికులు చాలా బలంగా ఉన్నారు,కానీ అది గ్రౌండ్ లెవెల్ లో రిఫ్లెక్ట్ అవ్వలేకపోయింది.ఈసారి సోషల్ మీడియాని మరింత విస్తృతంగా,భాద్యతయుతంగా వినియోగించుకుంటూ క్షేత్ర స్థాయికి అనుసంధానించుకుంటూ ముందుకు వెళ్ళాలి.అలా చేస్తే మెరుగైన ఫలితాల్ని రాబట్టవచ్చు.ప్రతీ నియోజకవర్గానికి ఒక మెయిన్ గ్రూప్ ఏర్పాటు చేస్కోని చర్చించుకోవడం,ఆ నియోజకవర్గానికి ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్లాన్ ఒఫ్ యాక్షన్ రూపొందించుకోవడం. నాయకుల వైఫల్యలు,అపరిష్కృత సమస్యలు వంటి వాటిని సృజనాత్మకంగా ఆలోచింపజేసేలా Memes,కార్టూన్స్ , వీడియో క్లిప్స్ వేసి ఆ నియోజకవర్గం సోషల్ మీడియాలో అంతా వైరల్ అయ్యేలా చేయడం.అలా వైరల్ అయ్యినవి నూట్రల్ వోటెర్స్ కి చేరేలా చేయడమ్.ఫేస్ బుక్,ట్విటర్ వంటి ప్లాట్ ఫార్మ్స్ లో ప్రతీ నియోజకవర్గానికి పేజ్ ని ఏర్పాటు చేసుకోవడం,స్థానికంగా ఉండే సమస్యలని ఆధారాలతో సహ ప్రపంచం ముందు ఉంచడం,నాయకుల వైఫల్యల్ని ఎండగట్టడం.నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ,జనసేనపై జరిపే కుట్రలను,నిరాధార ఆరోపణలను ఎప్పటికపుడు తిప్పికొడుతూ ఉండడం.అవకాశం ఉన్నప్పుడల్లా జనసేన సంబంధిత విషయాలను వాట్స్ఆప్ స్టేటస్ గానూ,ఫ్యామిలి గ్రూపులలోనూ షేర్ చేస్తూ ఉండడం.
ఇదీ రాజకీయం క్షేత్రం,ఇక్కడ వ్యూహాలు,ప్రతివ్యూహాలు,ఎత్తులూ,పైఎత్తులూ ఉంటాయి. సంధార్భానుసారం,సమయోచితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి..పరిస్థితులకి తగ్గట్లుగా మనల్ని మనం మెరుగుపరుచుకుంటో సాగాలి.
జనసైనికా ..మారు నిప్పు కణికగా ...కుటిల శక్తులన్నీటీ భస్మం చెయ్ రా
జనసైనికా ..కదులు రామదండులా ...ప్రజాస్వామ్య యుద్దానికి సిద్దం కారా
https://www.facebook.com/groups/910645505948545/
ఈ గ్రుప్ జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులకు నాయకత్వపు శిక్షణ ఇవ్వటానికి తయారుచేయబడింది. జనసైనికులు నాయకులుగా తాము, తమ కుటుంబం అభవృద్ది చెందుతూ, సమాజానికి దోహదం చేస్తారని ఆశిస్తున్నాం
To become thought leaders and influencers
Whoever is donating to JSP on a monthly basis, please join here - https://www.facebook.com/groups/296228067946477
https://sainikaswaram.wixsite.com/website/janasainiks-forum/new-ideas-for-janasena/weekend-politics-in-ap-for-cadre-building - any comments or improvements ?