top of page
Writer's pictureSainika Swaram

ఓ జనసైనికుడి ఆత్మీయ లేఖ

ప్రియమైన జనసైనికులకు

            ఉభయ కుశలోపరి, జనసేన తో నా ప్రయాణాన్ని,నాకున్న ఎన్నో సందేహాలను మీతో పంచుకోడానికి ఇలా ఈ లేఖ రాస్తున్నాను..

ఆరోజు జూలై 7,వైజాగ్లో మా రూం లో ఉన్నా..

ఆ రోజే మా ఫ్రెండ్ పుట్టినరోజు,ఆ హడావిడిలో ఉన్నాం.వాడు భీభత్సమైన పవన్ కళ్యాణ్ అభిమాని.మేము కేకు అన్నీ సిద్దం చేస్తున్నాం,రేయ్!బీచ్ రోడ్డులో కవాతు ఉంది ఈరోజు జనసేన ది.వెళ్లాలి అనుకుంటున్నా,అందరం వెళదాం,వచ్చి ఇవన్నీ చుస్కుందాం అన్నాడు.మొదట మాకు ఆశక్తి లేకపోయినా పుట్టినరోజు అడిగాడు,సరదాగా ఉంటుంది అని ఒప్పుకున్నాం. ఆడుతూ పాడుతూ,సిరిపురం మీదుగా ఆంధ్ర యూనివర్సిటీ out-gate గుండా బీచ్ కి వెళ్లాం.

కరెక్టుగా బీచ్ రోడ్డులో అడుగు పెట్టేలోపు అటుగా ఒక పెద్ద జన సమూహం నడుచుకుంటూ వస్తుంది,ఎదురుగా పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు.ఆ ముఖ వచ్ఛస్సు,తిలకం,తెల్లటి పంచె,నల్లటి గడ్డం. అదే మొదటి సారి ఆయ్యన్ని చూడ్డం.అందరం ఇంక మాట ఆడకుండా పక్కన నడిచాం,ఒళ్ళు మరచి పరిగెత్తాం,నేను అలా ప్రవర్తించానా అని నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంటుంది.. నడుస్తూ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గరకి వెళ్ళాం,

ఇంచుమించుగా 2కి.మీ.అక్కడ స్టేజ్ వేశారు. జనసందోహం,ఒక వైపు సముద్ర ఘోష,మరో వైపు జనాల హడావిడి.ఇంతలో జువ్వుమంటు పైన ద్రోణులు.అదొక పండగ వాతావరణం.నాకు అప్పటివరకు రాజకీయాలు అంటే ఫలానా ఫలానా అని కేవలం general knowledge లానే పరిగణించాను కానీ,అంతగా ఎప్పుడు లీనం అవ్వలేదు.అందరిలానే, ఆ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడులే అనుకునే వాడిని.2014 ఎన్నికల్లో కూడా నేనేమీ అంతగా ఆశక్తి చూపించలేదు. ఆ జనాన్ని వాళ్ల అభిమానాన్ని చూసి ఒకింత నవ్వు వచ్చినా,లోలోపల ఎందుకు ఇంత పిచ్చెక్కిపోతున్నారు అనే ప్రశ్న ఉండేది.ఇంతలో హరి ప్రసాద్ గారు మాట్లాడి పవన్ కళ్యాణ్ కి మైకు ఇచ్చారు(నిజానికి ఆయన్ని మాట్లాడనివ్వలేదు).


ఉత్తరాంధ్ర:

నాకు ఈ ప్రాంతాన్ని ఒక ప్రణాళికగా కావాలనే వెనకబాటుకి గురి చేస్తున్నారు అని చాలా బలంగా ఉండేది.అది మాట్లాడే నాయకుడు ఎక్కడా కనపడలేదు.ఇక్కడ మనుషులని కేవలం ఓట్లుగా చూసేవాళ్లు తప్ప మనుషులుగా చూసిన రాజకీయ నాయకుడు లేడు.ఆయన మాటల్లో ఆయనకి ఈ ప్రాంతం మీద,ఇక్కడి కట్టుబాట్లు మీద,జానపదుల మీద ఎంత పట్టు ఉందో చూసి నిజంగా ఆశ్చర్యపోయాను.చుట్టు వస్తున్న సీఎం,సీఎం అరుపులు చాలా విరక్తి అనిపించాయి.ఆయన మాటలు అలా కుర్చీ వేసుకుని వినాలి అనిపించింది.అది ముగిసిపోకూడదు,అలా వెళ్తూనే ఉండాలి అనిపించింది.ఆయన "బాయ్ బాయే బంగారు రవనమ్మ" అని పాడుతుంటే గుండెలో ఏదో తెలియని ఆవేశం,ఆయన్ని వెళ్లి గట్టిగా పట్టుకుని ఏడవాలి అనిపించింది,మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి అనిపించింది,నిజానికి ఇప్పుడు రాష్ట్రమంతా చేతులనిండ పిడికెడు అన్నం తింటుంది అన్నా దానికి వందల మంది శ్రీకాకుళం రైతులు చేసిన ప్రాణ త్యాగమే కారణం.చరిత్ర చిరిగిపోయింది.మట్టిని మనిషిని నమ్ముకుని,ఆ మట్టి కోసం నక్సలైటుగా మారిన ఒక ప్రాంత ప్రజలు ఇప్పుడు సినిమాల వల్ల,కొంతమందికి ఉన్న మిడిమిడి జ్ఞానం వల్ల ఆబాసుల పాలు అవ్తున్నారు.ఇవన్నీ అతనికి బాగా అర్థం అయ్యాయి.ఆ విప్లవానికి,ఆ తిరుగుబాటుకు సరైన గౌరవం ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కడే! ప్రతి మాట ఆయన మనసులోంచి వచ్చిందే.చాలా మంది ఆయన సహనాన్ని కోల్పోతాడు అంటారు,మనసులో బాధ ఉంటే మొదట అవేదన వస్తుంది,ఆ ఆవేదనలోంచి ఆక్రోశం వస్తుంది.అప్పుడు ఆ నాయకుడు నిజమైన నాయకుడు అని చెప్పొచ్చు.


మీరు ఏ రోజైనా చంద్రబాబు గాని, జగన్ గాని ఒక ప్రాంతం వెనుకుబాటు గురించి మాట్లాడుతూ సహనం కోల్పోవడం చూసారా?? చూడరు.. ఎందుకంటే వాళ్ళు నిజమైన నటులు... ఇవన్నీ నేను అతనిలో గమనించా,ఒక వ్యక్తికి రాత్రింబవళ్ళు గొడ్డులా తిరిగి ఉద్ధానం అని శ్రీకాకుళం జిల్లాలోనే సగం మందికి తెలియని ప్రాంతాన్ని రాష్ట్రం,దేశం,ఖండాంతరాలు తెలిసేలా చేశాడు.ఆయనకి ఏం అవసరం?? అది అవసరం కాదు,నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం.కానీ ఓడిపోయాడు,ఎలా?

నిజానికి విశ్లేషణ ఒక వైపు నుంచి ఉండకూడదు,ఉంటే అది మనల్ని మనం మోసం చేస్కునట్టే.చాలా మంది ఇంత చేసినా శ్రీకాకుళం జనం ఓట్లు వెయ్యలేదు అని నిందలు మొదలుపెట్టారు.అది వాస్తవం కాదు.గాజువాకలో ఉన్న నాకు తెలిసిన చాలామంది ముందు రోజు వరకు జనసేనకి ఓటు వేస్తాం అని వైసీపీ కి ఓటు వేసి వచ్చినవాళ్ళు చాలామందే ఉన్నారు.అదొక మానసిక ఒత్తిడి,ఇవన్నీ జయించేలా జనానికి నమ్మకం ఇవ్వాలి.అన్నీ మెల్లగా కుదుట పడతాయి,సమయం పడుతుంది..రాజకీయాలు అంటే,కేవలం ఓటర్లు నాయకులే కాదు ఇంకా చాలా ఉంటాయి. తితలి తుఫాను అప్పుడు చంద్రబాబు ఎం చేశారు?? పక్క జిల్లాలో ఉన్న జగన్ కనీసం పలకరింపుకి వచ్చడా?? మరి వాళ్లకి ఉన్న భరోసా ఏంటి?? జనం...మేము రాజ్యాధికారులం,వస పరుచుకొగలం అనే నమ్మకం...2000/- నోటు ఏ మాయైన చేస్తుంది అనే నమ్మకం.. పవన్ కళ్యాణ్ కి కూడా భరోసా ఉంది.ఏంటి?? అది కూడా జనమే...వీళ్లు మోసపోతున్నారు,మార్చాలి.ఎప్పటికైనా వింటారు అనే నమ్మకం... కానీ ఆయన కేవలం జన్నాన్ని,అభిమానులని నమ్ముకున్నారు కాబట్టి ఓడిపోయాడు.ఆయన ఓడిపోయినా సరే ఈమధ్య #జనసేవ చూసి ఆయన ఓడిపోలేదు,ఆయనకి ఓటు వేసిన నేను కూడా ఓడిపోలేదు అని చాలా సార్లు నాకు నేను గర్వ పడుతూ చెప్పుకున్నాను...


ఇవన్నీ పక్కన పెడితే .... నాకు మీరున్నారు,మిమ్మల్ని నమ్ముకునే వచ్చా అని చాలా సార్లు అన్నారు పవన్ కళ్యాణ్,ఇప్పుడు ఆ "మీరు" గురించి కొంచెం మాట్లాడుకుందాం!!!


ఈ "మీరు"లో చాలా రకాలు ఉన్నారు:


1.మనకి రాజకీయాలు ఎందుకన్నా??వద్దు అని చెప్పలేం కానీ పరోక్షంగా వెనక్కి లాగుతూనే ఉంటాం. నువ్వు ట్విట్టర్లో ఎలాంటి సమస్య గురించి ప్రస్తావించు,కింద replies లో మా గొడవ మాది. #vakeelSaab, #10,024DaystoPowerstarBirthday. మేము మిమల్ని ఎవడు ఏమన్నా ఊరుకోము,బండ భూతులు తిడతాము,అది కూడా సినిమా వరకే. Conditions apply అన్నో! ఏదో మూడ్ బాగుండి trendspspk ఒక మంచి నిర్ణయం తీసుకుంటే,అబ్బే!మేము చాలా మందికి సమాధానం చెప్పాలి,కుదరదు.. మీరు వ్యక్తిని వ్యక్తిత్వం చూసి అభిమనిస్తున్నారా?? వేరే నటుల మీద అభిమానుల మీద అసూయతో ఇతన్ని వాడుకుంటున్నారా?? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా...



2.సలహాలు,సూచనలు:ఒక పార్టీలో ఉంటున్నప్పుడు,సలహాలు ఇవ్వడంలో అస్సలు తప్పు లేదు,అది మన హక్కు.కానీ,ఆ సలహాలు గౌరవబద్ధంగా ఉండాలి.ఇక్కడ వీళ్లిచ్చే సలహాల్లో సలహాలు కన్నా వ్యంగ్యం,వెటకారం,చులకనతనం ఎక్కువ ఉంటాయి.పార్టీ వీళ్ల భుజస్కందాల మీద మోస్తునట్టు.గడ్డం తీసేయన్న,నాకిష్టం లేదు అవ్వి RT చెయ్యకన్నా!  వీళ్లందరూ అతను పార్టీ పెట్టకపోతే ఏం చేసేవారో మరి!!


3.సినిమా అయినా,రాజకీయం అయిన మీతోనే మేము.వీళ్లకి ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము. సినిమా టికెట్లు ఎలా చించేవారో,అన్ని రాజకీయాలకు ఎదురొడ్డి ఎన్నికల ముందు చాలా తిరిగారు.సినిమాని ఎంత ప్రోత్సహిస్తారో,రాజకీయానికి అంటే కష్టపడతారు.



4.కేవలం రాజకీయం: సినిమాలు పెద్దగా చూడరు,తెలీదు.కానీ ఆయన మాటలు విని,అతను చేసిన సేవా కార్యక్రమాలు చూసి ఎక్కడో ఒక ఆశ,సమాజం బాగుపడుతుంది అని. emotional connection ఎక్కువ అతనితో.అతనికోసం తపిస్తారు.మంచోడు,బాగుండాలి ఎప్పటికీ అని వల్లమాలిన అభిమానం!

మొదటి రెండు కేటగిరీల్లో ఉన్నవాళ్లు తర్వాత రెండు కేటగిరీలోకి రావడానికి ప్రయత్నించాలి.ప్రయత్నించడం కాదు రావాలి!

ఎందుకంటే వచ్చే ఎన్నికలు అంత సులువు కాదు.బీభత్సమైన  రక్షస బలం ఉన్న కర్కోటకులుకి ఎదురుగా నిల్చుని పోరాడాలి.ఇప్పుడున్న సైన్యం చాలదు.అభిమాని అంటే మనం అభిమానించేవారు మనకి నచ్చినట్టు ఉండాలి అని కోరుకోకూడడు.మనకి ఎన్నో మధుర స్మృతులు ఇచ్చిన వ్యక్తికి కష్ట సుఖంలో భరోసా ఇచ్చేలా ఉండాలి..

ఈ మధ్య ఇది మారుతుంది..రాజకీయ అంశాల్లో ఎక్కువ శాతం బాగానే చర్చిస్తున్నారు.. ఇంకా ఇంకా అతని ఆశయ సాధనలో అతని ప్రతీ అభిమాని అతనికి తోడు ఉంటాడని ఉండాలని ఆశిస్తూ.ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు.ఈ ఉత్తరం అందిన వెంటనే ఆలోచించి తగిన జవాబు రాస్తారని విన్నపము..పెద్దవారికి నా నమస్కారాలు,చిన్నవారికి నా ముద్దులు.

  ఇట్లు,

  నిర్వాణ


1,255 views1 comment

Recent Posts

See All

1 Kommentar


013gvs
03. Aug. 2020

అవును సార్ మీ ఆత్మీయ లేఖ చాలా బాగుంది. నేను కూడా చాలా సార్లు చాలా మందికి చెప్పాను. మీరు అభిమానుల నుండి జనసైనికుల మారండి అని. కాని ఎవరు వినలేదు. సార్ నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. నా నంబర్ 6303393475. మీ జనసైనికుడు

Gefällt mir
bottom of page