ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేవారే పాలకులు,..
ఆ పాలకులు తమ భాద్యతలను సరిగా నిర్వర్తించనపుడు,ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలోని ఇతర వ్యవస్థలకి ఉంటుంది. ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తిచూపేందుకు,అవకతవకలను ప్రశ్నించేందుకు పత్రికలకు,పౌర సమాజానికి హక్కు ఉంటుంది. జరుగుతున్న అవాస్తవాలను నిలదీసేందుకు,ప్రభుత్వం తీసుకుంటున్న, తీసుకోబోయే నిర్ణయాలకి భవిష్యత్ పర్యవసానాలు వివరించడంలో పత్రికలకి ప్రముఖ స్థానం ఉంటుంది. నాయకుల విధానాలను,ప్రభుత్వాల నియంతృత్వ పోకడలను నిలదీసే హక్కు,ప్రశ్నించే హక్కు రాజ్యాంగ కల్పించిన హక్కు,ప్రతీ భారతీయుడికి.
కానీ
నేటి పాలకులు,తమని ఎదురించేవారు, తామేమి చేసినా ఇదేమని ప్రశ్నించేవారు ఉండకూడదు అనే విధంగా పాలన సాగిస్తున్నారు . తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం,జారీ చేసిన జీవో 2430 (జీవో 938) ఉత్తర్వులు వివాదాస్పదం అవుతున్నాయి.
ఈ జీవో 2430 గత నేపధ్యం ఒకసారి తెలుసుకుందాం
నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారి తండ్రి 2007 లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మీడియాని నియంత్రించేందుకు జారీ చేసిన జీవోనే జీవో 938. అయితే ఆనాడు జర్నలిస్టు సంఘాల నుండి మేధావి వర్గం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి శాసన సభ సాక్షిగా నాటి మంత్రి రోశయ్య గారు ఇది కేవలం “ఉత్తుత్తి “ జీవో అని , అమలు చేయమని స్పష్టం చేశారు. నాటి నుండి ఈ జీవోని ఉత్తుత్తి జీవో గానే ప్రాచుర్యంలో ఉంది.
ఇపుడు 2014 నుండి 2019 వరకూ పత్రికా స్వేచ్చ,సోషల్ మీడియా నియంత్రణ పై వైకాపా అధ్యక్షులు జగన్ గారి వైఖరి,వారి పార్టీ నాయకుల వైఖరి చూద్దాం
తెలుగుదేశం విధానాలను ఎప్పటికప్పుడు తీవ్ర స్థాయిలో వీరుచుకుపడేది సాక్షీ మీడియా.. నాటి చంద్రబాబు ప్రభుత్వం కూడా సాక్షీ పై ఆంక్షలు విధించడంతో “పత్రికా స్వేచ్చకి సంకెళ్లా” అంటూ ప్రచారం చేసుకుంది. సోషల్ మీడియాలో తమ వారిపై కేసులు పెడితే సోషల్ మీడియాని నియంత్రించడం ఎవరి తరమూ కాదు అంటూ వైకాపా నాయకులు విమర్శలు గుప్పించారు.. సాక్షాత్తూ జగన్ మోహన్ గారే దీనిని ఖండించారు కూడా..
తీరా అధికార మార్పిడి జరిగి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం తాము చెప్పిన నీతులు తామే తప్పుతున్నారు.
సంఖ్యా బలం ఉన్నపటికీ కూడా తమ విధానలే ఎల్లకాలం కొనసాగాలని,తమని ప్రశ్నించే వారిని నియంత్రించాలనీ,తమ తప్పులు,ప్రజలకి చెరకూడదనే ఆలోచనతో జీవో 938 ని మళ్ళీ అమలులోకి తీసుకొచ్చింది వైకాపా ప్రభుత్వం.ప్రభుత్వ ప్రతిష్టకి భంగం కలిగేలా ఎటువంటి రాతలు రాసినా కేసులు వేసే అధికారం ఆయా శాఖలకి కల్పిస్తూ జీవో జారీ చేశారు.
తమని ఎదురించి ఎవరు ముందుకొచ్చినా వారిని ఇబ్బందులు పెట్టె చర్యలకి పూనుకుంది ప్రభుత్వం.
నేడు పత్రికా,టీవీ మీడియాకి సమాంతరంగా సోషల్ మీడియా విస్తరిస్తున్న రోజులు ఇవి. ప్రతీ పౌరుడూ తన గళాన్ని,బలంగా వినిపించే సాధనం సామాజిక మాధ్యమం. తన అభిప్రాయాల్ని తన ఆలోచనల్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించే వేదికగా సోషల్ మీడియా మారింది. దానికి నియంత్రణలు,నిర్బంధాలు పెట్టి ఆ గొంతుకల్ని అణిచివేయాలనుకోవడం పూర్తి అవివేక చర్య. ప్రజాస్వామ్యంలో ప్రజలాంను కేవలం ఎన్నికల్లో ఓట్లు వేసేవరకే పరిమితం చేసే దిశగా వెళుతున్నాయి ఈ చర్యలు. ప్రభుత్వ నిర్ణయాలలో ప్రజల అభిప్రాయం తెలపకుండా Participatory Democracy కి అవకాశం లేకుండా ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్చాకి సంకెళ్ళు వేస్తున్నాయి ప్రభుత్వాలు.
గత రెండు వారాలుగా ఈ జీవో గురించిన చర్చ జరుగుతూ ఉంది,నిన్నటి నుండి ఈ జీవో అమలులోకి వచ్చింది. మరి ఈ అపరిమిత పరిమితులు ఎందుకు ప్రభుత్వానికే పరిమితం చేశారో సామాన్య జనాలకి అర్దం అవ్వని ప్రశ్న. అధికార పార్టీగా చెలామణీ అవుతున సాక్షీ పత్రిక జనసేన పార్టీ మీద,జనసేనాని పవన్ కళ్యాణ్ మీదా దుర్భాశలతో చర్చలు,కార్యక్రమాలూ చేపడుతుంది. జనసైనికుల ఆత్మ స్థైర్యం దెబ్బ తినేలా కథనాలు చేపడుతుంది.ఇక ఎన్నికల సమయంలో సాక్షీ మీడియా చేసిన అసత్య కథానాలు పరాకాష్టకి చేరింది.. మరి తమ స్వంత మీడియాని నియంత్రించలేని అధికార పార్టీ వారు ఇతర మీడియాలపై ,సామాజిక మధ్యమాలపై మాత్రమ ఎందుకు నియంత్రణ విధించాలనుకుంటున్నారు?? నీతులు చెప్పేందుకే తప్ప పాటించేందుకు కదా??? నోటితో పొగిడి నొసటితో వెక్కిరించిన చందాన ఉంది అధికార పార్టీ వైఖరి. ప్రభుత్వ పరంగా తమకి వ్యతిరేకంగా ఎటువంటి వార్త కానీ,కథనం కానీ,పోస్టు కానీ ఉండకూడదు.. తమ పార్టీని,తమ ప్రభుత్వాన్ని ఎదురించేవారెవరైనా వారి ప్రతిష్టని, స్థాయిని,దిగజార్చే విధంగా అవాస్తవ ప్రచారాలు చేస్తూ ఉంటాయి అధికార పార్టీ పత్రికలు.. ఇదే నయా రాజకీయం కాబోలు
రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు భావ వ్యక్తీకరణ హక్కు – ఆ హక్కుల్ని కాలరాయడమ్ అంటే రాజ్యాంగాన్ని అగౌరవ పరిచినట్లే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్లే
Commenti