ఆంధ్ర ప్రదేశ్లో శాసన మండలి రద్దు దాదాపు ఖాయమైనట్లే,ఈ సంధర్భంగా అసలు శాసన మండలి ఎందుకు,వాటి అధికారాలు ఏమిటి,సమకాలీన రాజకీయ వ్యవస్థలో మండలి వ్యవస్థ ఎలా రూపాంతరం చెందింది అనేవి విశ్లేసించుకుందాం సవివరంగా ఈ వ్యాసంలో
భారత రాజ్యాంగం శాసన వ్యవస్థకి రెండు సభలు,ఎగువ సభ దిగువ సభ ఉండొచ్చు అనే అవకాశాన్ని కల్పించింది.అందుకే రాజ్య సభ - లోక్ సభ ,శాసన మండలి – శాసన సభ అని రెండు సభలు ఏర్పాటు చేసుకున్నాం .
దిగువ సభల్లో ప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడతారు ప్రత్యక్షంగా,ఎగువ సభల్లో పరోక్ష పద్దతిలో ఎన్నుకోబడతారు,సాహిత్యం,కళా,విద్యా సంబంధ విషయాల్లో ప్రావీణ్యత,సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులను నామినేట్ చేసే అవకాశమూ ఇచ్చింది రాజ్యాంగం.
మేధావులు,నిష్ణాతులు,నిపుణులు,పలు రంగాల్లో విశేషంగా రాణించినవారు,సమాజం పట్ల విపరీతమైన అవగాహన ఉన్నవారు శాసన మండలి లో ఉండాలి అని,ఒక వేళ శాసన సభ ఏదైనా తొందరపాటు నిర్ణయం కానీ,లేదా సరైన సమీక్ష జరపకుండా ఏదైనా బిల్లును కానీ పంపితే,దానిలోని లోటు పాట్లు సవరించి,తప్పొప్పులు వివరించి తగిన సూచనలు చేసే భాద్యతాయుత స్థానం ఎగువ సభది.అందుకే దీనిని పెద్దల సభ అంటారు.కొన్ని సార్లు దిగువ సభలో సరైన చర్చ జరగనపుడు ఎగువ సభలో విస్తృత చర్చలు జరిగిన సంధర్భాలు అనేకం.
అధికారాల విషయంలో ఎగువ సభకి అనేక పరిమితులు ఉన్నాయి,కేవలం బిల్లును తిప్పిపంపడం,తాత్కాలికంగా నిలుపుదల చేయడమే తప్ప అంతిమంగా పై చేయి దిగువ సభదే.పరిమిత అధికారాలు ఉన్నప్పటికీ ఎగువ సభకి ఎప్పటికప్పుడు ఒక checks and balance గా వ్యవహరించే అవకాశం ఉంది పెద్దల సభకి.
కానీ మారుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల ఎగువ సభ వ్యవస్థ ఆరో వేలిగా మారుతుంది అన్న అపవాదు మూటగట్టుకుంది.మేధావి వర్గం తో ఉండాల్సిన సభ,రాజకీయ నిరుద్యోగులకి నిలయంగా మారింది. పార్టీలు తమ నాయకులను సంతృప్తి పరిచే ఒక సాధనంలా మారింది.క్రమక్రమంగా మేధావుల ప్రాతినిధ్యం తగ్గి రాజకీయ నాయకుల ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది.శాసన సభకీ శాసన మండలికీ తేడా లేకుండా చేశారు సంప్రదాయ రాజకీయ నాయకులు తమ స్వార్ధ రాజకీయ లభ్ది కోసం.రాజకీయ నాయకుల పంతాలకు మండలి బలి అవుతూ వస్తుంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వద్దామ్.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నుండి 1985వరకూ మండలి వ్యవస్థ ఉంది.నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి మండలిలో తగిన బలమ్మ్ లేకపోవడం వల్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను తిప్పిపంపేది.దీనితో అసహనం చెందిన రామారావు,తమ ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపడుతుంది అనే కారణం చెప్పి,అనవసర ఖర్చు,ఆరో వేలిగా వ్యవహరిస్తూ ప్రజలచే ఎన్నుకోబడిన సభ చేసే తీర్మానాలను గౌరవించడం లేదు అంటూ తన వాదన వినిపించి మండలిని రద్దు చేశారు.
2004లో అధికారంలోకి వచ్చిన తరువాత,కాంగ్రెస్ పార్టీ మండలిని పునరుద్దరించింది.తమ అనుకూలురకి,పార్టీ అసంతృప్తులకి, పదవులు ఇచ్చేందుకు.నాటి నుండి నేటి వరకూ మండలి కొనపాగుతూ వస్తుంది.
ఇప్పుడు తన నిర్ణయాలకు మండలి అడ్డుగా ఉందనే కారణం చెప్పి మండలినే రద్దు చేసేందుకు పూనుకున్నాడు జగన్ రెడ్డి.
మండలి వ్యవస్థను కలుషితం చేసింది ఈ నాయకులే.. మండలిని తమ స్వార్ధ అవసరాలకు వాడుకున్నదీ ఈ నాయకులే...తమకి అనుకూలం అయితే ఏర్పాటు చేస్తున్నారు,పెద్దల సభ అని కీర్తిస్తున్నారు....తమకి అడ్డంకిగా మారితే రద్దు చేస్తున్నారు,ఆరో వేలు అని అనవసరం అని అంటున్నారు.
డెబ్బై ఏళ్లుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ బతుకున్న రాజకీయ వ్యవస్థ ఇది,ఈ మండలి రద్దు వల్ల సామాన్యుడికి జరిగే నష్టం కానీ మేలు కానీ లేదు.కాకపోతే నాయకుల వికృత నియంతృత్వ పోకడలు ప్రజలకి తెలుస్తున్నాయి అంతే.
ఎన్టీఆర్: మండలి వద్దు
YSR: మండలి కావాలి
జగన్: మండలి వద్దు
CBN: మండలి కావాలి
YS, నారా కుటుంబాలది అవకాశవాదం.