top of page
Writer's pictureSainika Swaram

మాధ్యమాల రద్దు కాదు మధ్యే మార్గం కావాలి ఆంగ్లం ఉండాలి - తెలుగు గెలవాలి


ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ బోధనకు వ్యతిరేకం అని భావించే వారు దయచేసి చదవడం ప్రారంభింకండి. ఆ విధానానికి వ్యతిరేకం కాదు కానీ ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమం కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను


గురు బ్రహ్మ|| గురు విష్ణు|| గురుదేవో మహేశ్వరః|| గురు సాక్షాత్ పరబ్రహ్మ|| తస్మై శ్రీ గురవేనమః||


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో త్రి భాష విద్యావిధానం నడుస్తూ ఉంది. త్రి భాషసూత్ర విద్యా విధానం దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం మరియు ఆధునిక భారతీయ భాష (ప్రాధాన్యంగా దక్షణ భారతీయ భాష) హిందీ మాట్లాడని రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లీషు తో పాటు ఏదైనా ప్రాంతీయ భాష ఉండాలి అని నిర్ణయం జరిగింది.


కాల క్రమేణా అనేక విమర్శలు, ఆక్షేపణలు, సవరణలు జరుగుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా అనేక రాష్ట్రాలలో అదే విధానాన్ని పాటిస్తూ వస్తున్నారు... ఇక మన ఆంధ్రప్రదేశ్ కి వద్దాం ... మన రాష్ట్రంలో ఈ త్రి భాష విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాం . ఇందులో మన పాఠశాల విద్యా విధానంలో మనం వాడుతున్న భాషలు ఎక్కువ శాతం మన ప్రాంతీయ భాష మరియు మాతృ భాష ఐన తెలుగు ప్రథమ భాషగా, హిందీని ద్వితీయ భాషగా మరియు ఇంగ్లీష్ భాషను తృతీయ భాషగా చేసుకుని మిగిలిన పాఠ్యాంశాలు (సబ్జెక్ట్స్ - Subjects) ఐన మాథ్స్, సైన్స్, సోషల్ ను బోధనా మాధ్యమంలో చెప్తూ అనేక దశాబ్దాలుగా విద్యా వ్యవస్థను నడుపుతూ వస్తున్నాం . ఇప్పుడు మనం ఇప్పటి వరకు నడిచిన విద్యా విధానం, అందులోని లోటు పాట్లు, బోధన మాధ్యమం, బోధన ప్రమాణాలు "నాడు - నేడు - మున్ముందు" మరియు ఆ బోధన ప్రమాణాల మెరుగు పరుచుటకు తేసుకొదగిన కొన్ని సూచనలు చూద్దాం


  • సుమారు 1968లో త్రి భాష విద్యా విధానాన్ని దేశంలో అమలు చేయాలి అని అనుకున్నప్పటి నుండి మన రాష్ట్రంలో కూడా అదే విద్యా విధానం నడుస్తూ వస్తుంది (సరిగ్గా అప్పటి నుండే అని చెప్పలేను). ఈ బోధన విధానంలో మన మాతృ భాష ఐన తెలుగు బోధన మాధ్యమంగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానాన్ని ప్రారంభించినప్పటికి అప్పటి గురువులు వారికి విద్యా బోధన పట్ల ఉన్న ఆసక్తి విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంచి భావి తరాలకు మంచి యువతను అందించాలి అనే సదుద్దేశం కలవారై ఉండి ఉన్న మూడు భాషలలో ప్రావీణ్యత శాతం ఎక్కువగా ఉండేది. కానీ రాను రాను పాఠశాలలో విద్యా ప్రమాణాలు అడుగంటటం వలన పాఠశాలకు దూరమైన కుటుంబాలు ఎన్నో. అప్పుడే సుమారు 1980-90 లలో విద్యా ప్రైవేటీకరణ విస్తృతంగా జరిగిన సందర్భంలో పుట్టగొడుగుల వలె వెలిసిన విద్యాలయాలు మరియు ప్రావీణ్యం లేని అధ్యాపకులు సమాజంలోకి వెల్లువెత్తారు. దాని వల్ల నాణ్యత ప్రమాణాలు అడుగుఅంటుతున్న ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యామ్నాయంగా కనిపించాయి. అప్పటికే ఉన్న క్రైస్తవ మిషనరీ మరియు సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉన్న కొన్ని విద్యా సంస్థలలో చేర్పించి చదివించలేని తల్లిదండ్రులందరికి ఇవొక ఆశాకిరణాల్లా కనిపించాయి కనుకనే వాటికి అత్యంత ఆదరణ పెరిగింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో తెలుగు మాధ్యమ విద్యా బోధన మరియు అన్య భాషలలో ప్రావీణ్యత


  • ఉపాధ్యాయులు వారి వృత్తి పట్ల గౌరవం అంకిత భావం కలిగి ఉన్న రోజులలో ఈ త్రి భాష సూత్రం కానివ్వండి మరే విధానం ఐన కానీ విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చి దిద్ది భావితరాలకు అందించడంలో ముందు ఉన్నారు... కానీ ఎప్పుడైతే వారిలో ఆ భావన తగ్గిందో (అందరూ కాదు ఎక్కువ శాతం) విద్యా వ్యవస్థ విద్యార్థుల భవితవ్యం తిరోగమనం వైపు తన అడుగు ప్రారంభం అయింది. ఇక ఈ విద్యా విధానానికి వొస్తే ఈ తిరోగమన సమయంలో అది ప్రభుత్వం ఐన ప్రైవేట్ పాఠశాల ఇంగ్లీష్ మరియు హిందీ ఒక పాఠ్యాంశంగా ఉన్నప్పటికీ వాటి ప్రాముఖ్యత గురించి వివరించి సరైన విద్యా బోధన కరువై పాఠశాల నుండి పై చదువులకి వెళ్ళినప్పుడు ఆంగ్ల మాధ్యమంలో చదవవల్సి వచ్చినప్పుడు అనేక ఆటూ పోట్లకు మరియు ఆత్మన్యూనతా భావానికి లోనై అనేక ఇబ్బందులు పడవల్సి వస్తూ వచ్చింది మరియు విద్యా పూర్తైన తరువాత ఉద్యోగార్థులు ఆంగ్లం పై పట్టుకోసం అనేక మార్గాలు అన్వేసించవల్సి వస్తుంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన మరియు ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యా బోధనా ప్రమాణాలు మండల మరియు పట్టణ స్థాయిలలో నిర్వహించబడుతున్న ప్రైవేటు విద్యాలయాల విషయానికి వస్తే, ప్రభుత్వ పాఠశాలలో విద్యా మరియు సరైన సౌకర్యాల కల్పనలో వెనడుగు వేసిన తల్లిదండ్రులు వారి పిల్లలకు సరైన విద్యను అందించాలి అని ఆవేదన చెందుతున్న సందర్భంలో విద్యలో ప్రైవేటీకరణ అధికంగా జరిగినప్పుడు వచ్చినవే ఈ ప్రైవేట్ విద్య సంస్థలు. అలా నెల్కొల్పబడిన సంస్థలలో సరైన మౌళిక సదుపాయాలు(సరిగా ఉపాధ్యాయుల అందుబాటు, భవనాలు, మరుగు దొడ్లు మొదలైనవి) ఉండడం గమనించి తల్లిదండ్రులు వారి పిల్లలకు అక్కడ సరైన విద్యా దొరుకుతుంది అని భావించి వారి స్థోమత ఉన్నా లేకున్నా అప్పు చేసిన సరైన విద్యా అందించాలి అని చేర్పించడం ప్రారంభం ఐనది. ఇది గమనించి అనేక విద్యా సంస్థలు నాణ్యత ప్రమాణాలు పాటించనప్పటికి పుట్టగొడుగుల్లా ప్రారంభం ఐయ్యాయీ. ఇలాంటి సందర్భంలో "మంది ఎక్కువ ఐతే మజ్జిగ పల్చన అవుతుంది " అన్నట్టుగా మారింది ఈ వ్యవస్థ.ఇక్కడ ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం.

ఇప్పటి ప్రభుత్వం చెప్తున్నట్టే చాలా వరకు ఈ విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉంది మరియు మిగిలిన భాష పాఠ్యాంశాలు కాకుండా ఉన్న పాఠ్యాంశాలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి(ఇది అందరికీ తెలిసిందే). కానీ నిపుణులైన బోధన సిబ్బంది కరువై మరియు వారు ఇంటికి వచ్చి మర్లా చదువుకునే సందర్భంలో వారి సందేహాలు నివృత్తి చేసే అవకాశం లేక సతమతమైన విద్యార్థి జీవితాలు ఎన్నో మానసిక సంఘర్షణకులోనైన సందర్భాలు ఎన్నో మనలో చాలా మందికి విదితమే(అందులో ఇది చదివే వారు కూడా ఉండొచ్చు). ఈ ప్రైవేట్ పాఠశాలలో నేటికీ సరైన మౌలిక సదుపాయాల లో ఒకటైన సరైన క్రీడ ప్రాంగణం లేదు అని మనకి తెలుసు ఆ పాఠశాలలో వారు పెట్టిన పెట్టే విద్యార్థుల పై ఒత్తిడి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ(అర్థం కాని మాధ్యమంలో విద్యా బోధన) అనేక మంది విద్యార్థులు చిన్న వయసులోనే తనువు చలిస్తున్న దృశ్యాలు మనం నేటికీ చూస్తూనే ఉన్నం. బహుశా ఇదే విధానం ఉంటే భవిష్యత్తులో కూడా చూస్తూ ఉంటం అనుకుంటా. ప్రారంభ పాఠశాల దశలో సరైన నిపుణులైన అధ్యాపక సిబ్బంది లేక బట్టీ విధానంతో పట్టా తీసుకుని పై చదువులు పూర్తి చేసి సరైన వృత్తి విద్యా నైపుణ్యం లేక అగచాట్లు పడుతున్న జీవితాలు మనకి తెలుసు. వారి ధ్రువపత్రాలలో(సర్టిఫికేట్లు లో) ఆంగ్ల మాధ్యమం అని ఉన్నా, పాఠశాల స్థాయిలో సరైన పునాది లేక అవస్థలు పడుతూ ఉన్న వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారి పరిస్థితి "రెండిటికీ చెడ్డ రేవడిలా" మారుతుంది.



ఒక్కసారి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడితే.

  • సుమారు 40,000 మంది బోధన సిబ్బందికి(అప్పటికే మాతృ భాషలో ప్రావీణ్యం మరియు విద్యా బోధనకు అలవాటు పడిన అనేక మంది) కేవలం 6నెలల శిక్షణతో నిష్ణతులను చేయడం అనేది ఎంతవరకు సాధ్యమో ఆలోచించుకోవాలి.

  • కేవలం 6 నెలల శిక్షణతో ప్రభుత్వం చెప్తున్న ప్రపంచ స్థాయి నైపుణ్యత ఎంతవరకు బోధన సిబ్బంది పొందగలుగుతారు అనేది పునరాలోచించాలి.

  • ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమం వైపుగా మరే విద్యార్థి యుక్కా మానసిక స్థితి తను ఎదుర్కొనే మానసిక ఆందోళన పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి.

  • సుమారు దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలో పాఠశాలల ప్రారంభ సమయానికి పుస్తకాలు అందిచల్సిన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వెంకబడుతు ఉన్న సందర్భంలో ఇప్పుడు ఉన్న 9 నెలలో ఎంత వరకు ఆచరణ సాధ్యమో పరిశీలించుకోవాలి.

  • ఇప్పుడు ఉన్న అతి తక్కువ సమయంలో ప్రపంచ స్థాయి పాఠ్య ప్రణాళిక( Syllabus) తయారు చేయడానికి సరిపోతుందో లేదో ఆలోచించుకోవాలి. కొన్ని సంఘటనలు మరియు పరిశోధనలలో వెల్లడైన అంశాలను ఇక్కడ తెలియచేసి ముగిస్తాను....

  • 2015 లో తమిళనాడులో తమిళ్ తప్పనిసరి భాషగా చేస్తు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి శాసనసభలో ప్రస్తావించి మరియు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించి తిరిగి తెలుగు మాధ్యమంలో బోధన తెచ్చుకున్నారు. మరి అలాంటిది తెలుగు మాతృ భాషగా ఉన్న రాష్ట్రంలోనే పూర్తిగా తెలుగు మాధ్యమ బోధన తీసేస్తే ఎవరిని అడగగలం. ఏమని ప్రశ్నించగలం. • ప్రపంచ స్థాయిలో అనేక పరిశోధనలలో కనీసం ప్రాథమిక విద్యా వరకు ఐన విద్యార్థికి మాతృ భాషలో విద్యా బోధన అందించడం వల్ల విద్యార్థి యుక్కా వికాసానికి ఎంతో దోహద పడతాయి అని చెప్పడం జరిగింది.

భారత దేశంలో ప్రతి విద్యార్థి తనకు నచ్చిన మాధ్యమంలో విద్యా ను అభ్యసించే హక్కును భారత రాజ్యాగం కల్పించింది అలాంటిది ఆంగ్ల మాధ్యమ విద్యా ను నిర్బంధంగా వారిపై రుద్దడం అమానుష చర్య అవుతుంది. ఈ పరిస్థితి నుండి బయట పడడానికి కొన్ని సూచనలు



ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు అనువైన మౌలిక సదుపాయాలు విద్యా ప్రమాణాలు పెంచాలి.


ఆంగ్ల మాధ్యమంలో బోధించే అధ్యాపక సిబ్బంది నియామకం జరగాలి.


దశల వారీగా ఈ మధ్యమ బదిలీ ప్రక్రియ జరగాలి మరియు కొన్ని నిర్దేశిత ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందాలి.


విద్యార్థి లేదా విద్యార్థుల తల్లిదండ్రులు తెలుగు మాధ్యమంలో విద్యా అభ్యసించాలి అని భావించే వారికి కూడా విద్యా అందుబాటులో ఉడే విధంగా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమ బోధన అందుబాటులో ఉండాలి. అది వారి ప్రాథమిక హక్కు.

- ఇట్లు

ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించి రెండిటికీ చెడ్డ రేవడిలా మిగిలిన లక్షల్లో ఒక్కడు.


365 views1 comment

Recent Posts

See All

1 Comment


dharma341
Nov 18, 2019

Excellent and Informative. I support the content.

Like
bottom of page