విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది.అమరావతిని రాజధానిగా ఆమోదించి భూసేకరణ జరిపి అందరూ ఇదే రాజధాని అని భావిస్తున్న తరుణంలో వైసీపీ గెలుపు, తదనంతరం రాజధానిపై ఏర్పడిన సందిగ్ధత,దానికి కొనసాగింపుగా మీడియా ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనలు సృష్టించాయి.ప్రజల అనుమానాలని నిజం చేస్తూ శాసన సభ శీతా కాల సమావేశాల్లో జగన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.దక్షిణాఫ్రికాని ఉదాహరణగా పేర్కొంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చూ అంటూ సంచలనానికి తెర తీశారు.
అసలు జగన్ రెడ్డి వ్యాఖ్యల వెనక మర్మం ఏమిటీ,మూడు రాజధానులు నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ది పధాన నడిపిస్తాయా?ఎవరి లబ్ధి కోసం ఈ ప్రకటన?ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ ప్రతిపాదనా?జనసేన ఎందుకు దీనిని వ్యతిరేకిస్తుంది?
ఈ ప్రశ్నలన్నిటినీ సవివరంగా ఈ వ్యాసంలో చర్చిద్దాం.
నేడు జగన్ రెడ్డి చేసిన ప్రకటన గురించి చర్చించే ముందు,నాడు అమరావతిని రాజధానిగా మద్దతిచ్చిన సమయంలో జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాలి.తెలుగుదేశం వారు రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన ప్రక్రియని మేం వ్యతిరేకిస్తున్నాం తప్ప,విజయవాడ ప్రాంతంలో రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. నిర్మాణాత్మకంగా సూచనలు ఇస్తాము రాజధాని అభివృద్దికోసం అని ఆనాడు ప్రతిపక్ష నేతగా శాసన సభలో చేసిన ఉద్ఘాటించారు జగన్ రెడ్డి .
కానీ మాట తప్పుడం – మడమ తిప్పడం తన నైజం అని జగన్ రెడ్డి ఈ అంశంలో మరోసారి నిరూపించుకున్నాడు.
అమరావతి రాజధానిగా ప్రకటించడంలో చంద్రబాబు సర్కారు ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడింది అని చెబుతూ ఆ వాదనని బలపరిచే కొన్ని ఆధారాలనూ చూపుతూ అమరావతిని రాజధానిగా కేవలం తెలుగుదేశం నాయకుల లభ్ది కోసం ఎన్నుకున్నారు అని విమర్శించారు జగన్ రెడ్డి.గత పాలకులు తప్పులు చేస్తే ఆ తప్పునీ నిరూపించి శిక్ష పడేలా చేసి ఆ తప్పుని సరిదిద్ది ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన భాద్యత ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం,అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంది.
రాజధానిపై జగన్ రెడ్డి ద్వంద్వ వైఖరికి కొన్ని ఉదాహరణలు
1.నాడు అమరావతి రాజధానిగా ఉండేందుకు సుముఖం – నేడు శ్రీముఖం
2.శివ రామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికని కాదని అమరావతిని ఎన్నుకున్నారు,మేధావుల సూచనలు పట్టించుకోలేదు అంటూ నాడు విమర్శలు – నేడేమో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుంది అని చెబుతూనే ఎక్కడెక్కడ ఏయే రాజధానులు ఉంటాయో స్పష్టంగా తెలిపిన వైనం
కమిటీ సిఫారసులని పాటించలేదు అని విమర్శించి,నేడు కమిటీ నివేదిక ఇస్తుంది అని చెప్పి తానే రాజధానులు ఎక్కడ ఉంటాయో చెప్పాడు,ఇంకా నిఔనుల కమిటీకి ఏం విలువ ఇచ్చినట్లు
3.తెలుగు దేశం రాజధాని విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడింది అని విమర్శించి – నేడు అదే విధానాన్ని అవలంబిస్తూ ఆ అడుగుజాడల్లో వైసీపీ.
4.అమరావతి పేరుతో ప్రజలను మధ్య పెడుతుంది తెలుగుదేశం అని నాడు విమర్శించి – అధికార వికేంద్రీకరణని అభివృద్ది వికేంద్రీకరణగా ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ
ఇక వర్తమానంలోకి వద్దాం
శాసన సభలో జగన్ రెడ్డి ప్రకటన పూర్తిగా అనాలోచిత నిర్ణయం అని అనడంలో ఎటువంటి సంశయం లేదూ. శాసన వ్యవస్థ,కార్య నిర్వాహక వ్యవస్థని విడదీసి చూడలేము మన దేశంలో.ఒక దానిపై ఒకటి ఆధార పడి ఉన్న వ్యవస్థలు ఈ రెండూ...ఈ రెంటినీ వేరు చేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉంచడం వల్ల వ్యవస్థల మధ్య సమన్వయం లోపిస్తుంది. అధికార యంత్రాంగం లేకుండా ముఖ్యమంత్రి స్థాయి నుండీ ఎమ్యెల్యే వరకూ ఎవరూ స్వతంత్రంగా ఉండలేని పరిస్థితి ఉన్న నేటి కాలం లో,అసెంబ్లి సమావేశాల సమయంలో ఈ రెండు వ్యవస్థలూ ఎలా పనిచేస్తాయి అన్న ప్రశ్నకి జవాబు లేదు.
ప్రజలకి శాసన సభ,శాసన మండలితో పని ఉండకపోవచ్చు కానీ సచివాలయంతో రాష్ట్రంలోని పౌరులకి ఏదో ఒక విధంగా అవసరం ఉంటూనే ఉంటుంది.అలాంటి వ్యవస్థ రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో, సులభంగా చేరే ప్రాంతంలో ఉండాలి.కానీ నేడు జగన్ రెడ్డి తీసుకున్న అవివేక నిర్ణయం వల్ల ప్రజలు తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది.కడప కర్నూలు చిత్తూరు ప్రాంత ప్రజలు తమకేదైనా అవసరం వచ్చి సచివాలయానికి వెళ్లాలంటే దాదాపు పధ్నాలుగు నుండి పదహారు గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇది ప్రజల మీద భారం.
ఇక మరో కోణం చూద్దాం. ఎన్నో కేసుల్లో ప్రభుత్వం తరఫున అధికారులు న్యాయస్థానాల్లో హాజరు అవ్వాల్సి ఉంటుంది. కర్నూలు లో హై కోర్టు ఉండడం స్వాగతించదగినదే.కానీ విశాఖపట్నం నుండి ప్రతీ వాయిదాకి అధికారుల రాను పోనూ ఖర్చులు భారం ఖజానా మీద పడుతుంది.అలా కాకుండా కార్యనిర్వాహక వ్యవస్థ అమరావతిలో ఉంటే ఈ భారం ఎంతో కొంత తగ్గి ఉండేది.
శాసన సభ సమావేశాల నిర్వహణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో అయినా చేపట్టవచ్చు, మహారాష్ట్రలో మాదిరి ఒక్కో సమావేశాన్ని ఒక్కో ప్రాంతంలో చేపట్టవచ్చు. లెజిస్లేటివ్ కాపిటల్ అని ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా జరిగే మేలు ఏమీ ఉండదు.
అడిగింది అభివృద్ది వికేంద్రీకరణ – చేసింది అధికార వికేంద్రీకరణ
శాసన వ్యవస్థని ఒక ప్రాంతంలో,కార్యనిర్వాహక వ్యవస్థని ఒక ప్రాంతంలో,న్యాయ వ్యవస్థని ఒక ప్రాంతంలో విభజించడం ద్వారా తానేదో సాధించానని భావిస్తున్నారు జగన్ రెడ్డి. Division of Capital doesn’t mean Decentralisation of Development.
కేవలం న్యాయ స్థానం కర్నూలుకి రావడం వల్ల రాయలసీమ పచ్చగా మారిపోదు,అక్కడి వలసలు ఆగిపోవు,నిరుద్యోగం పోదు. కార్యనిర్వాహక వ్యవస్థ విశాఖ పట్నానికి రాగానే ఉత్తరాంధ్ర వెనకబాటు తనం పోదు.
స్థానికంగా ఉన్న సహజ వనరులూ,మానవ వనరులూ ఉపయోగించుకోవడం, అక్కడికి పరిశ్రమలు తీసుకురావడం.నీటి పారుదల రంగాన్ని అభివృద్ది పరిచి రైతన్నలకి సమాయానికి నీరందించడం,గిట్టుబాటు ధర,స్టోరేజీ వ్యవస్థలూ,పల్లెల్ని నగరాలకి అనుసంధానించే రహదారులు నిర్మించడం,వృత్తి నైపుణ్యం పెంపొందించే దిశగా చర్యలు చేపట్టడం,స్వయం ఉపాధి కల్పించడం.ఐటీకి ప్రాధాన్యం ఉన్న చోట బహుళ జాతి కంపనీలు తమ శాఖల్ని రాష్ట్రంలో స్థాపించే వాతావరణం ఏర్పాటు చేయడం, విదేశాల నుండి పెట్టుబడులు ఆకర్షించేలా సమగ్ర విధాన రూపకల్పన చేయడం. ఇదీ అభివృద్ది వికేంద్రీకరణ చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు.
ఇవేవీ లేకుండా అధికార,పరిపాలన వ్యవస్థలని విభజించి మేము చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము అంటూ తమ భుజాలు తామే చరుచుకుంటూ తమ గొప్పలు తామే చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు.
ప్రజలను ఏమార్చే ప్రయత్నమే ఈ మూడు రాజధానుల జపం
ఈ ప్రాంతానికి ఫలానా ప్రభుత్వ కార్యలయం రాబోతుందీ అంటే సహజంగానే ఆ ప్రాంత ప్రజలు సంతోషిస్తారు. అది కేవలం తాత్కాలికమే,దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏమీ ఉండవు అని తెలిసినా ఆ సంతోషంలో అవేవీ పెద్దగా పట్టించుకోరు.దానిని వ్యతిరేకించే వల్ల పై తీవ్రంగా మండి పడతారు కూడా.ఎందుకంటే తమ ప్రాంతానికి వచ్చిన ఒక ప్రతిష్టాత్మక వ్యవస్థ వల్ల తమకి,తమ ఊరికి,ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది అనే భావోద్వేగంలో ఉంటారు కాబట్టి.సరిగ్గా ఈ అంశాన్నే అందుకున్నాడు జగన్ రెడ్డి,ప్రజల భావోద్వేగాలతో తాను కాలం గడుపుతున్నాడు. ప్రజలకి అందించాల్సిన అభివృద్ది ఫలాలు అందించకుండా,వారి జీవన విధానల్ని మెరుగుపర్చకుండా తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రాంతంలో లెజిస్లాటివ్ కాపిటల్,జ్యూడిసియల్ కాపిటల్ అంటూ ప్రజల్ని మభ్య పెడుతున్నాడు.
సున్నితమైన అంశం,పైగా ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం కావున ప్రజలు కూడా లోతుగా ఆలోచించకుండా ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతో తమకి దక్కాల్సిన హక్కుల గురించి మాట్లాడడం మరిచిపోతున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులలో అత్యధికులు రాయలసీమ వాసులే,అయినా కూడా సీమ ఇంకా వెనకబాటు ప్రాంతంగానే గుర్తింపబడుతుంది,కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇంకా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి కుమారుడే నేడు ముఖ్యమంత్రి. ఇలాంటి నాయకుల నాయకత్వంలో కేవలం హై కోర్టు ఏర్పాటు వలన రాయాలసీమ రూపు రేఖలు మారిపోతాయా? ఈ విషయాల్ని ప్రజలు గుర్తుంచుకోవాలి.ఏళ్లుగా నిరాదరణకి గురైన రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చిన్న ఉపశమన చర్య మాత్రమే. దీనితో సంతృప్తి పరిచి ప్రజలను తమవైపు తిప్పుకోవాలనే ఆలోచనే వైసీపీ చేస్తుంది.
ఇక ఉత్తరాంధ్ర విషయానికి వద్దామ్. ఏళ్లుగా కొన్ని కుటుంబాల చెరలో నలిగిపోతూ ఉన్న ప్రాంతం,అభివృద్ది చెందడానికి అన్నీ వనరులూ ఉన్నా కూడా నాయకుల నిర్లక్ష్య వైఖరికి బలి అయిన ప్రాంతం,నేడు అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ ప్రకటన ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని నిర్మూలిస్తుందా అన్న ప్రశ్నకి జవాబు లేదు.ఇప్పటికీ ప్రసవం కోసం నలుగురు మనుషులు డోలీల మీద బాలింతల్ని మోసుకువెళ్లే దుష్టితిలో ఉన్న ఉత్తరాంధ్ర స్థితిని ఈ ప్రకటన ఎంత వరకూ మారుస్తుంది? నిర్లక్ష్యానికి గురైన తమ ప్రాంతానికి ప్రభుత్వ అధికారిక గుర్తింపు గల ఒక రాజధాని రాభోతుంది అనే స్వాంతన తప్ప నిజంగా ఈ ప్రకటన వల్ల ఉత్తరాంధ్ర వాసులకి కలిగే లాభం లేదు.పైగా వైసీపీ వంటి నాయకుల ఆధ్వర్యంలో జరిగే అరాచకాలే ఎక్కువ. ఈ విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది.
ఇక ఈ ప్రకటన మాటున దాగున్న రాజకీయ ఉద్దేశం ఏమంటే,వైసీపీ ప్రభుత్వం పై వస్తున్న ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకోడానికి,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్ని తమ వైపు తిప్పుకోడానికి చేసిన చర్యే తప్ప మరొకటి లేదు.
రాజధానుల పై జనసేన వైఖరి
అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడే జనసేన స్వాగతించింది,కానీ బలవంత భూ సమీకరణని వ్యఃతిరేకించింది జనసేననే,రాజధాని కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూమిని ఇచ్చే వాళ్లనుండి తీసుకోండి కానీ రైతుల నుండి బలవంతంగా భూ సమీకరణని మాత్రం వద్దని తేల్చేసి చెప్పింది జనసేన. జనసేనాని హెచ్చరికలతో వెనక్కి తగ్గింది నాటి తెలుగు దేశం ప్రభుత్వం.
పవన్ కల్యాణ్ “ఎవరి రాజధాని అమరావతి “ అనే పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నదీ వాస్తవమే.రాజధాని అంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి,కేవలం కొందరు నాయకుల గుత్తాధిపత్యంలో ఉండకూడదు, ఇది కొన్ని తరలా పాటు ఉండే రాజధాని,అన్నీ వర్గాలకీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి,లేదంటే ఊహించని పరిణామాలు వస్తాయి రాబోయే తరాలు నేటి పాలకుల నిర్లక్ష్యానికి అని చెప్పారు. చేసే అభివృద్ది జాగ్రత్తగా చేయాలి అని సూచించారు.ఎక్కడా రాజధానిని వ్యతిరేకించలేదు. ఎలా ఉంచుకోవాలి రాజధానిని అనే చెప్పారు,జరుగుతున్నా తప్పొప్పులను ఎత్తిచూపారు.
ఒక్క ప్రాంతానికే అభివృద్దిని పరిమితం చేయకుండా అన్నీ ప్రాంతాలకూ విస్తరించాలి, అన్నీ ప్రాంతాలనూ సమ దృష్టితో చూడాలి అనే ఉద్దేశంతోనే జనసేన ఉంది.కేవలం రాజకీయ స్వలాబేక్ష కోసం ప్రజల్ని ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్న విధానాల్ని మాత్రం నిర్ద్వందంగా వ్యతిరేకిస్తుంది.
నాయకులకు, అధికారులకు రెండు ఇల్లు ,రెండు కార్లు.. వాళ్ళు రోడ్ల మీద తిరగటం,హోటల్ లో ఉండటం సరిపోతుందనీ, రెండు రాజధానులు వల్ల దేశం ఇప్పటికీ నష్టపోయిందని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని పార్లమెంటును ఉద్దేశించి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ జుమా వ్యాఖ్యానించారు.
ఈ రకంగా సచివాలయం మరియు అసెంబ్లీని వేరు వేరు ప్రాంతాలలో పెట్టడం వల్ల ప్రజలు ప్రతి సంవత్సరం అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుంది.కానీ దీని వల్ల వచ్చే ప్రయోజనం కేవలం శూన్యం
ప్రభుత్వం ఇలాంటి బుర్ర తక్కువ ఆలోచనలు మానుకోవాలి
ఇది కేవలం 30 వేల ఎకరాలకు పైగా పొలాలను రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంతంరై నోట్లో మట్టి కొట్టడమే.
కేవలం హైకోర్టు ఇచ్చి రాయలసీమను అభివృద్ధిపరిచే చేసాము అని రాయలసీమ ప్రజలను మభ్య పెట్టే ఆలోచన మాత్రమే, హైకోర్టు ఎక్కడో ఒక చోట ఉంచి మిగిలిన చోట హైకోర్టు బెంచ్ లను ఏర్పాటు చేసి వారికి సులభతర మార్గంగా చేయవచ్చు
అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి 30 వేల ఎకరాలకు పైగా మహానగరంగా రాజధాని ఉండాలి అని ప్రమాణం చేసి ఇప్పుడు సిగ్గు…