పవన్ కళ్యాణ్ మనకి నేర్పింది ప్రశ్నించడమే అని ప్రశ్నావళి సంధించిన వారికి,మరి పవన్ కళ్యాణ్ నుండి నేర్చుకోడానికి సంసిద్దంగా ఉన్నపుడు,పవన్ కళ్యాణ్ తెలిపిన ఇంకేన్నో విషయాలు ఎందుకు సంగ్రహించుకోలేకపోయారో మరి
.
మీ ప్రశ్నావళికి పవన్ కళ్యాణ్ తరఫున మా సమాధానం
పవన్ కల్యాణ్ బీజేపీతో కలవలేదు,జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. నేను బ్రతికి ఉన్నంత వరకూ,నలుగురు వచ్చి నన్ను మోసే వరకూ జనసేన పార్టీ ఉంటుంది అని ఘోర ఓటమి తరువాత సంధర్భం వచ్చిన ప్రతీ సారి చెబుతూనే ఉన్నాడు.అయినా విలీనం అనే ప్రస్తావన ఎందుకొస్తుందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.ఇప్పటి నుండి రాజకీయం చేస్తాము, ఎలా ఉంటుందో చూస్తారు అని ఓటమి తరువాత జరిగిన మొదటి సమీక్షా సమావేశంలోనే తెలిపాడు.
1. ప్రశ్న - పవన్ కల్యాణ్‌కూ నరేంద్రమోదీ మధ్యకానీ, జనసేనకూ, బీజేపీ మధ్య కానీ ఉన్న సైద్ధాంతిక అనుబంధం ఏంటి? ఇప్పుడు ఎలా కలుస్తున్నారు?
సమాధానం - సైద్ధాంతిక సారూప్యం ఉంటే కొత్త పార్టీ ఎందుకు పెడతారు? సిద్దాంతాల పరంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టే మరో పార్టీగా ఆవిర్భవించింది.భిన్నమైన సిద్దాంతాలు , ఆలోచనలూ,అభిప్రాయాలూ అయినప్పటికి ఒక కామన్ అజెండాగా, ఆంధ్ర ప్రదేశ్ కి మూడో ప్రత్యమ్న్యాయమ్ గా మారేందుకు ఈ కూటమి అని సుస్పష్టంగా తెలియజేశారు,రెండు పార్టీల నాయకులు.
ఏ పార్టీ మీద అక్కసుతో మరో పార్టీ ఉద్భవించిందో ఆ పార్టీనే వెళ్ళి వారితో కూటమి పెట్టుకున్న ఉదాహరణాలూ చూశాం.2014లో తొలి అడుగులోనే బీజేపీతో కలిసి వేసిన పార్టీ మళ్ళీ వారితో జత కట్టడంలో ఎందుకు ఇంత ఉడికిపడుతున్నారో అర్ధం అవ్వడం లేదు.
2. ప్రశ్న - ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీతో ఎందుకు కలిశారు?
సమాధానం - ప్రత్యేక హోదా కోసం తన పరిమితుల్లో ఎంతవరకూ కృషి చేయాలో అంతా చేశారు పవన్ కళ్యాణ్.ప్రజల్లో ప్రత్యేక హోదా పై కదలిక లేదు.వారికే పట్టనపుడు ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసిన ప్రయోజనం లేదు అనే వాస్తవాన్ని వెల్లడించింది కూడా పవన్ కళ్యానే. అయినా ఈరోజు పొత్తు కుదరగానే హోదా అంశం గుర్తుకువచ్చింది.మరి హోదా కోసం పోరాడిన వీరులు,మడమ తిప్పని శూరులు పదవుల్లో ఎందుకున్నట్లు,?హోదానే ఊపిరి,హోదానే సంజీవని.మెడలు వంచి సాధించుకోస్తాం అని ప్రఘల్భాలు పలికిన వారు ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు?పదవుల్లో ఉన్నది పల్లకీలు ఎక్కి ఊరేగడానికా? పవన్ ని ప్రశ్నించడానికి ఒకరి తరువాత ఒకరు బయటకి వస్తున్నారు.మరి అదే జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీని నిలదీయరేం? హోదా ఎక్కడా అని.మేం హోదా పేరు చెప్పే 22 ఎంపీలమ్ గెలిచాము.మా హోదా మాకివ్వండి అని పోరాడరెం? చేత కాకా?చేవ లేకా?
3. ప్రశ్న - ఇప్పుడు మీరు బీజేపీతో కలవడం వల్ల ఏపీ ప్రజలకు నిర్దిష్టంగా దక్కేదేంటి?
సమాధానం - సొంత ప్రయోజనాలకోసమే కలయిక అయితే 2014లోనే సొంత ప్రయోజనం చూసుకునే వారు,2019 ఎన్నికల నాటికే ఇద్దరికీ మేలు జరిగేలా పొత్తులు ఉండేవి. కాబట్టి పవన్ కళ్యాణ్ కి సొంత ప్రయోజనాల కోసం ఒకరితో కలవాల్సిన అగత్యం లేదు,ఇతర పార్టీల నాయకుల్కి ఉన్నట్లు.
తెలుగు దేశం,వైసీపీ రెండూ పార్టీలూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి, ఒకరి మీద ఒకరికి ఉన్న విద్వేషంతో.ఈ ఇరువురి నడుమ ప్రజలు,భవిష్యత్ తరాలు నష్టపోతున్నాయి. 2024 నాటికి ఈ రెండు పార్టీల చెర నుండి ప్రజలకి స్వేచ్చ లభించడానికి,ప్రజలకి మరో ప్రత్యమ్న్యాయమ్ ఉండేందుకు ఈ కలయిక,వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు అని స్పష్టంగా తెలిపారు.వినసోంపుగా లేదని వినిపించుకోలేదో,లేక విన్నా విననట్లు ఉన్నారో సదరు విశ్లేషకుల వారు
4. ప్రశ్న - సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కోసం వచ్చిన ఒక పార్టీకి ఇన్ని పల్టీలు కొట్టాల్సిన అవసరం ఏమిటి?
సమాధానం - జనసేన ఆవిర్భావం నుండీ పాతిక సంవత్సరాల సుధీర్గ ప్రస్థానం అనే చెబుతూ వస్తున్నాం.2014లో అప్పటి పరిస్థితుల వల్ల ఒక స్థిరమైన పాలన అందాల్సిన అవసరం ఉంది విభజిత ఆంధ్ర ప్రదేశ్ కి అనే కారణం చేత ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లను చీల్చి ఆస్తిరత మిగల్చకూడదని ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా మద్దతు తెలిపింది జనసేన పార్టీ.ప్రజా పోరాటాల సమయంలో అందరినీ కలుపుకుపోయింది కూడా జనసేన పార్టీనే.ఎన్నికల సమయంలో పొత్తులు అనివార్యం అయిన పరిస్తితి,అయినా మీ లెక్క ప్రకారం ఆ కూటమిని ప్రజలు తిరస్కరించినట్లే కదా.ఇక పల్టీలు అనే పద ప్రయోగం ఎందుకొచ్చింది? ప్రజామోదం ఉన్న కూటమి,జట్టుగానే మళ్ళీ కలిశారు అని కదా మీరు అనాల్సింది.
5. ప్రశ్న - ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ కొత్తగా ఏం చేసింది?
సమాధానం - ఉన్న రెండు పార్టీలు కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రాన్ని తమ ఇష్టానుసారం దోచుకుతింటుంటే ఈ అద్వితీయ దుష్ట ద్వయం నుండి ప్రజలకి విముక్తి కలిగించి కొత్త ప్రత్యమ్న్యాయమ్ ఏర్పాటు చేయాలనే తద్వారా ప్రజలకి మేలు చేయాలనే ఈ కలయిక.
6. ప్రశ్న - విడివిడిగా ఉన్నారు కానీ అంతర్గతంగా ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయని వైఎస్సార్ సీపీ అప్పట్లోనే తేల్చి చెప్పేసింది. ఆ ఆరోపణకు మీరు ఇప్పుడు బలం చేకూర్చడం లేదా? దీనిపై మీ సమాధానం ఏంటి?
సమాధానం - వైసీపీ తేల్చి చెప్పడం ఏమిటి? వారేమైనా సుప్రీం కోర్టా? లేక సీబీఐ ఆ? పదవుల కోసం ప్రజల ప్రయోజనల్ని తాకట్టు పెట్టె అవినీతి సొమ్ముతో పెట్టిన ఫక్తు రాజకీయ పార్టీ.అలాంటి పార్టీ చేతిలో ఒక కరపత్రం ఒక చానెల్ ఉన్నందున అబద్దాన్ని వంద సార్లు చెబితే నిజమై పోతుంది అనే భ్రమలో బతికే పార్టీ.ఏదో ఒక రీతిన దెబ్బ తీయాలనే ఉద్దేశంతో చేసే చవకబారు విమర్శలకి మీ వత్తాసు ఏమిటి?
అయినా ప్రజా కంఠక పాలన అందిస్తుంటే అందరూ విమర్శిస్తారు ప్రజా సంఘాల నుండి రాజకీయ పార్టీల వరకూ వారందరినీ ఒకే జట్టుగా పరిగణిస్తారా? అలా అయితే నాడు ప్రత్యేక హోదా కోసం జనసేన కృషి చేసింది,వైసీపీ కూడా హోదా రాగం అందుకుంది,జనసేన పిలుపు ఇచ్చాకే వైసీపీ లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది.మరి ఈ ఇద్దరి మధ్య కూడా అంతర్గత ఒప్పందం ఉన్నట్లా? ఇద్దరూ ఒకటేనా??
7 .ప్రశ్న - జనసేనను బీజేపీలో కలపను అని ఇప్పటికైనా మీరు మాటివ్వగలరా?
సమాధానం - నా శవాన్ని ఒక నలుగురు జనసైనికులు వచ్చి మోసే దాకా నేను జనసేన పార్టీని మోస్తాను,నాతో ఉంటే పదవులు పేరు ప్రతిష్టా రాకపోవచ్చు,ప్రజల కోసమే పోరాడతాను,ఎవరు ఉన్నా లేకున్నా,అని అవకాశం తీసుకొని మరీ ప్రతీ సారి చెబుతున్నాడు..ఇంతకు మించి ఇంకేం మాటివ్వాలి మీకు? ఇంకెలా రుజువు చేయాలి ?
శవాల సాక్షిగా సంతకాల సేకరణ చేసి పాడే కదలక ముందే పదవుల కోసం పాకులాడిన పార్టీ తరఫున వత్తాసు తీసుకున్న మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
8.ప్రశ్న - ప్యాకేజీలు తీసుకొని మీరు మారుతుంటారు అని అంటున్నారు?
సమాధానం - 2014 లోనే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట,నేను ఎవరి నుండి అయినా రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే ఆ క్షణమే రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతాను అని .పూటకి పది సార్లు ప్యాకేజీ అని సిగ్గుమాలిన విమర్శలు చేసే బదులు,ఒకే సారి అది రుజువు చేసి పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం ఇదీ అని ప్రజలకి నిరూపించి,తనని రాజకీయాల నుండి తప్పుకునేలా చేసి శాశ్వతంగా అయితే మీరు లేదా మీ 60.40 పార్ట్నర్ తెలుగుదేశమే పాలించుకోవచ్చుగా?
విష ప్రచారాలు చేయడం అతి సులువైన పని.కానీ నిరూపించమంటే మాత్రం పరుగు లంఘించుకుంటారు.
9. ప్రశ్న - రాజధానే ప్రాతిపదిక అయితే మీరు ప్రత్యేకంగా బీజేపీతోనే కలవాల్సిన అవసరం లేదు.
సమాధానం - ఒకే ప్రశ్నని తిప్పి తిప్పి మార్చి మార్చి అడిగి విజ్ఞాన ప్రదర్శనలు చేయడమెందుకు? ఈ ప్రశ్నకి జవాబు ఇదివరకే చెప్పి ఉన్నాం.
10. ప్రశ్న - అమరావతి విషయంలో బీజేపీ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? అమరావతి నుంచి రాజధానిని తరలించబోమని మీకు బీజేపీ నాయకులు ఏదైనా హామీ ఇచ్చారా?
సమాధానం - మూడు రాజధానుల విధానాన్ని బీజీపీ కూడా వ్యతిరేకిస్తుంది.అమరావతి రైతులకి అన్యాయం జరగకూడదు అని వారి పక్షాన ఇదివరకే రెండు పార్టీలు తమ విధానాన్ని తెలిపాయి,భవిష్యత్లో జరిగే వాటి గురించి ఇప్పుడే తొందరేల ? కాలం సమాధానం ఇస్తుంది.
👏👏..well done bro...i urge everyone to share this on every social platform
👍👍sainiks please spread this.very well written .kudos to the contributers