జగన్ పార్టీపై మనం ఎన్నో విమర్శలు చేసాం.
అవినీతి, friday, రౌడీ రాజ్యం, రెడ్ల పార్టీ, క్రిస్టియన్ పార్టీ, కోడికత్తి helicopter, bathroom, paytm ఇలా ఇంకా ఎన్నో విమర్శలు చేసినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
దీనికి కారణాలు ప్రధానంగా రెండు.
1. ఆ విమర్శలు ప్రజల్లోకి వెళ్ళలేదు.
2. ఆ విమర్శలు ప్రజల్లోకి వెళ్ళినా, వారు పట్టించుకోలేదు లేదా నమ్మలేదు.
మొదటి కారణాన్ని అధిగమించాలంటే పార్టీ విషయాలు ప్రతి మారుమూల పల్లెకీ చేరేలా మాధ్యమాలు పెంపొందించుకోవాలి.
అది సొంత టీవీ ఛానెల్, పత్రిక పెడతామా? పెట్టి viewership, circulation సాధించగలమా? లేదా ఉన్న ఛానెల్స్, పత్రికలతో పార్టీ విషయాలు,పోరాటాలు అందరికీ చేరేలా ఇంకా ఏమైనా చేయగలమా?
సోషల్ మీడియా అనేది మంచి మాధ్యమమే కానీ, రాను రాను దీనిలో విశ్వసనీయత తగ్గిపోతుందేమో అని నా అనుమానం.
రెండవది కారణం అయితే, ఇక ఆ పాత చింతకాయ పచ్చడి విమర్శలు తాత్కాలికంగా వదిలేసి, ప్రస్తుత పాలనలోని లోపాలపై, ప్రభుత్వం పట్టించుకోని ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టాలి. ఆధారాలతో విమర్శలు చేయాలి.
మీ అభిప్రాయాలు తెలుపగలరు.
top of page
To test this feature, visit your live site.
ప్రభుత్వం పై విమర్శలు
ప్రభుత్వం పై విమర్శలు
1 comment
Like
1 Comment
bottom of page
ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే, టీవీ ఛానెల్, పత్రిక చెయ్యటం కష్టమే, చాలా డబ్బుతో కూడుకున్న విషయం.
దీని గురించి చర్చించాలి, మనకున్న options ఏంటి అనేది ఆలోచించాలి.
Correctగా చెప్పారు.