జనసేన ఆవిర్భావానికి కారణం కళ్యాణ్ గారి ఆలోచనలు. లక్షలమంది సామాన్యులు తన సినిమాలను ఆదరిస్తూ తనను అందలంపై కూర్చోబెట్టి డబ్బు,పేరు,గౌరవం,అంతులేని అభిమానం ఇస్తుంటే వాళ్ళకి నేను ఏమి ఇస్తున్నాను అనే ఆలోచన. ఆయన చదివిన పుస్తకాలు. ఆయనలో చలింపు కలిగించిన తను చూస్తున్న సమాజం తీరు ఒక రాజకీయ పార్టీ స్థాపించేలా ప్రభావితం చేశాయి. ఆ రాజకీయ పార్టీ ద్వారా ఆయన ఏదైనా అంశం మీద కాని ప్రజా సమస్యలపై కానీ గొంతెత్తితే ఆయనతో కొన్నివేల/లక్షల గొంతులు తోడయ్యి ప్రభుత్వ వ్యవస్థలతో ఆ సమస్య పరిష్కారం చేయించడం ముఖ్య ఉద్దేశంగా భావించారనుకుంటాను. ఎన్నికలు జనసేన లక్ష్యమే కానీ ఆశయం కాకూడదు. 2019 ఎన్నికల్లో ఓడింపబడ్డ జనసేన పార్టీ 2024 వరకు విప్లవాత్మకంగా ప్రజాసమస్యలకై పోరాడుతుందా లేక 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నత్త నడకలు సాగిస్తుందా? పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని... మన కోరిక: కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనే వెర్రి ఆశ...ఎటు తీసుకుపోతుంది. అసంపూర్తిగా ముగిస్తున్నా...
top of page
bottom of page